రష్యా మిలటరీ విమానం తొమ్మిది అంతస్తుల భవనంపైకి దూసుకురావడంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ ఘటన ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రష్యాలోని యెయిస్క్ ప్రాంతంలో సంభవించింది. ఈ సుఖోయ్-34 విమానం మిలటరీ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇది ఒక మీడియం రేంజ్ సూపర్‌సోనిక్ జెట్ ఫైర్‌బాల్‌గా పేలినట్లు ఆ ప్రాంతీయ గవర్నర్ వెనియామిన్ కొండ్రాటీవ్ తెలిపారు. సుమారు ఐదు అంతస్తుల్లో దాదాపు 2 వేల చదరపు మీటర్లు మంటలు వ్యాపించినట్లు వెల్లడించారు. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలెట్లు నివేదించినట్లు పేర్కొన్నారు.
అందులోని విమాన సిబ్బంది విమానం అపార్టమెంట్ కాంప్లెక్స్ వైపుకి దూసుకొచ్చేలోపు బయటకొచ్చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సమాచారం రష్యా అధ్యక్షుడి పుతిన్‌కి తెలియజేసినట్లు పేర్కొంది. అలాగే మిలటరీ విమానంలో గాయపడ్డవారికి తక్షణ సాయం అందించాలని క్రెమ్లిన్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
Watch the moment of military #plane #crash at a residential building in #Yeysk , #Russia. pic.twitter.com/TEunPX3KQl
— Gaurav Kumar Singh (@GKSinghJourno) October 17, 2022
In the Krasnodar Territory of Russia, a military plane crashed on a residential building in Yeysk. According to preliminary data, the pilot managed to eject.
— Ey Villan (@NeutralNews111) October 17, 2022
Eyewitnesses report that after the plane crash, a residential building is on fire from the first to the ninth floor. pic.twitter.com/NytFaAB8Up
Comments
Please login to add a commentAdd a comment