![UK Military Chief Dismissed As Wishful thinking On Putin Health Rumours - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/17/putin.jpg.webp?itok=LoO7dpWN)
Britain's armed forces has dismissed as "wishful thinking: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను యూకే మిలటరీ చీప్ టోనీ రాడాకిన్ తోసిపుచ్చారు. అందరూ పుతిన్ ఆరోగ్యం పై దృష్టిసారించారని, పైగా ఆయన హత్య కావింపబడతాడు లేదా పరారవుతాడంటూ వస్తున్న పుకార్లన్ని చూస్తేంటే అందరూ ఆయన నాశనాన్నే ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. మిలటరీ నిపుణుడిగా రష్యాలో పుతిన్ పాలనను దగ్గరగా చూశానని చెప్పారు. ఆయన ఎటువంటి వ్యతిరేకతనైనా అణిచివేయగలరని కూడా అన్నారు.
అంతేకాదు రష్యాని సవాలు చేసే శక్తి కూడా ఎవరికీ లేదని చెప్పారు. అంతేగాదు రష్యా అణుశక్తిగా కొనసాగడమే కాకుండా సైబర్ సామర్థ్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. పైగా అంతరిక్ష సామర్థ్యంతో పాటు నీటి అడుగున ప్రత్యేకమైన ప్రోగామింగ్ కేబుళ్లు ఉన్నాయని అందువల్ల ప్రపంచాన్ని శాసిస్తోందన్నారు.
అదే సమయంలో సెప్టెంబర్ 6న కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వారసుడిని ఎన్నుకున్నందున రష్యాకి కచ్చితంగా ముప్పు ఉంటుందన్నారు. అంతేగాదు బోరిస్ వారసురాలు బాధ్యతలు చేపట్టంగానే ఉక్రెయిన్‌కి సైనిక సాయం అందించి రష్యాని నియంత్రిస్తామన్నారు. ఆ తర్వాత యూకే కచ్చితంగా అణుశక్తిగా అవతరించడం పై దృష్టిసారిస్తుందని యూకే మిలటరీ చీప్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment