కిమ్‌ హత్యకు సీఐఏ కుట్ర: ఉత్తర కొరియా | CIA in Kim Jong Un Assassination Attempt, Claim DPRK | Sakshi
Sakshi News home page

కిమ్‌ హత్యకు సీఐఏ కుట్ర: ఉత్తర కొరియా

Published Sat, May 6 2017 1:36 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

కిమ్‌ హత్యకు సీఐఏ కుట్ర: ఉత్తర కొరియా - Sakshi

కిమ్‌ హత్యకు సీఐఏ కుట్ర: ఉత్తర కొరియా

సియోల్‌: తమ అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను హతమార్చడానికి అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ), దక్షిణ కొరియా నిఘా వర్గాలు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉత్తర కొరియా అంతర్గత భద్రత శాఖ తెలిపింది. జీవరసాయన ఆయుధాలతో కిమ్‌పై దాడి చేయడానికి జరిగిన కుట్రను అడ్డుకున్నట్లు స్పష్టం చేసింది. తమ అధినేత హత్యకు ఉత్తర కొరియాకే చెందిన కిమ్‌ అనే వ్యక్తిని అమెరికా, దక్షిణ కొరియాలు ఎంపిక చేసినట్లు దేశ అధికార వార్తాసంస్థ కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది.

నిందితుడి వద్ద నుంచి 7.40 లక్షల అమెరికన్‌ డాలర్లు, ఓ శాటిలైట్‌ ట్రాన్స్‌రిసీవర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తండ్రి, తాతల సమాధులతో పాటు సైనిక పరేడ్‌లో దాడికి ప్రణాళిక రచించారని అంతర్గత భద్రత శాఖ తెలిపింది. తమవద్ద ఉన్న రేడియోధార్మిక విష పదార్థాలు ప్రయోగించిన 6 నుంచి 12 నెలల తర్వాతే ప్రభావం చూపిస్తాయని నిందితుడికి సీఐఏ చెప్పినట్లు వెల్లడించింది. నిందితుడి వద్ద దక్షిణ కొరియాకు చెందిన పలు ఇంటెలిజెన్స్‌ అధికారుల నెంబర్లు లభించినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement