viswa hindhu parishat
-
వక్ఫ్ బోర్డును రద్దు చేయాలంటూ ర్యాలీ
హమీర్పూర్: హిమాచల్ ప్రదేశ్‌లోని సంజౌలీలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని కోరుతూ దేవభూమి సంఘర్ష్ సమితి హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ చేపట్టింది. దీనిలో పాల్గొన్న 46 ఏళ్ల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యుడొకరు గుండెపోటుతో కన్నుమూశారు. వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. దేవభూమి సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సిమ్లా, హమీర్పూర్, మండీ, చంబా, నహాన్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. హమీర్‌పూర్‌లో ఆందోళనకారులు అధికారులకు మెమోరాండం సమర్పించడానికి వెళ్తుండగా, వీహెచ్‌పీ కార్యకర్త వరిందర్ పర్మార్ స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని వెంటనే పోలీసు వాహనంలో హమీర్పూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతను మృతిచెందాడని తెలిపారు.నిరసన ప్రదర్శనలో పాల్గొన్న దేవభూమి సంఘర్ష్ సమితి కమిటీ కో-కన్వీనర్ మదన్ ఠాకూర్ మాట్లాడుతూ, వివాదాస్పద మసీదుపై అక్టోబర్ ఐదు వరకూ కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తామని, ఆ తరువాత భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామన్నారు. అక్టోబర్ ఐదు తర్వాత జైల్ భరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తమపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన ఏఐఎంఐఎం నేత షోయబ్ జమైపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి -
బజరంగ్ దళ్ ఎప్పుడు, ఎలా ఆవిర్భవించింది? కాంగ్రెస్‌తో దీనికి కనెక్షన్ ఏమిటి?
బజరంగ్ దళ్ మరోమారు చర్చల్లోకి వచ్చింది. హరియాణాలోని నూహ్(మేవాత్)లో జరిగిన హింసాకాండ నిందితుడు బిట్టూ బజరంగీ, ఉరఫ్ రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాను బజరంగ్దళ్ నేతనని స్వయంగా బిట్టూ ప్రకటించుకున్నాడు. అయితే విశ్వహిందూ పరిషత్ బిట్టూకు, బజరంగ్‌దళ్‌కు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. కాగా బజరంగ్ దళ్పేరు చర్చల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. బజరంగ్ దళ్ ఎలా ఏర్పాటయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ అనంతరం అది జూలై 1984..‘ఆపరేషన్ బ్లూ స్టార్’ ముగిసి నెల రోజులు పూర్తయింది. అయినా పంజాబ్‌లో హిందువులపై తరచూ హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతలో అయోధ్యలోని రామజన్మభూమికి విముక్తి కల్పించేందుకు విశ్వహిందూ పరిషత్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గోరఖ్‌నాథ్ మఠం అధిపతి మహంత్ వైద్యనాథ్ నేతృత్వం వహించగా, కాంగ్రెస్ నేత దౌ దయాల్ ఖన్నా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1984 సెప్టెంబరులో ఈ కమిటీ బీహార్‌లోని సీతామర్హి నుండి అయోధ్య వరకు 400 కిలోమీటర్ల యాత్రను ప్రారంభించింది. సరయూ ఒడ్డున భారీ కార్యక్రమం యాత్రలో ఊరేగింపునకు ముందు ఒక ట్రక్కులో రాముడు, సీత విగ్రహాలు ఏర్పాటు చేశారు. వెనుకనున్న వాహనాల్లో సాధువులు, వేలాది మంది ప్రజలు ఉన్నారు. 1984, అక్టోబర్ 6న యాత్ర అయోధ్యలోని సరయూ నదిపైగల వంతెన వద్ద ముగిసింది. అక్టోబరు 7న సరయూ ఒడ్డున ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 60 వేల మంది పాల్గొన్నారని సీనియర్ జర్నలిస్ట్ వినయ్ సీతాపతి తన పుస్తకంలో రాశారు. రామజన్మ భూమి కోసం పాటుపడేవారికే ఓటు ఆరోజు జరిగిన కార్యక్రమంలో వేదికపై ఒక పెద్ద చిత్రం ఏర్పాటు చేశారు. అందులో నిరాయుధ సాధువుల ఎదుట కత్తులు పట్టుకున్న ముస్లింలు నిలబడి ఉన్నట్లు చూపించారు. ఆ కార్యక్రమానికి హాజరైనవారు జాతీయ సమైక్యత, సమగ్రత కోసం ముస్లింలు ఈ వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎలాంటి గందరగోళం ఏర్పడకూడదని అటల్ బిహారీ వాజ్‌పేయి అభ్యర్థించారని సీతాపతి తన పుస్తకంలో రాశారు. ఈ భూమిని, మిగిలిన రెండు పవిత్ర స్థలాలను (కాశీ, మధుర) విముక్తి చేయడానికి ఎవరు ప్రయత్నించినా వచ్చే ఎన్నికల్లో హిందువులు వారికే ఓటు వేయాలని కార్యక్రమంలో తీర్మానించారు. వానరసేన స్ఫూర్తిగా బజరంగ్ దళ్ 1984, అక్టోబర్ 8న విశ్వహిందూ పరిషత్ వానరసేన స్ఫూర్తిగా బజరంగ్ దళ్ ఏర్పాటును ప్రకటించింది. వానరసేన సీతామాతను రక్షించడంలో రామునికి సహాయపడింది. బజరంగ్ దళ్ ఉద్దేశ్యం బాబ్రీ మసీదు నుండి రామ జన్మభూమిని కాపాడటం. ఆ తరువాత కొన్నేళ్లకు రామజన్మభూమి ఉద్యమానికి బజరంగ్ దళ్ ప్రధాన భూమికగా మారింది. 1992 డిసెంబరు 6న భజరంగ్ దళ్ నేతృత్వంలో కరసేవకులు అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత బజరంగ్‌దళ్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. వీహెచ్‌పీ వెబ్సైట్లో.. విశ్వహిందూ పరిషత్ వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం బజరంగ్ దళ్ ఎవరిపైననో నిరసన వ్యక్తం చేసేందుకు ఆవిర్భవించలేదు. హిందువులను సవాలు చేసే సంఘ వ్యతిరేక శక్తుల నుండి రక్షణకే ఏర్పాటయ్యింది. ఆ సమయంలో శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో చురుకుగా పాల్గొనే స్థానిక యువకులకే బజరంగ్ దళ్ బాధ్యతలు అప్పగించారు. తరువాతి కాలంలో దేశం నలుమూలల నుంచి యువకులు ఈ సంస్థలో చేరారు. 1993లో తొలిసారిగా బజరంగ్ దళ్ అఖిల-భారత సంస్థాగత రూపం నిర్ణయించారు. అన్ని రాష్ట్రాలలో బజరంగ్ దళ్ శాఖలు ఏర్పాటయ్యాయి. ఇది కూడా చదవండి: కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. -
మండపాల్లో కేసీఆర్ బొమ్మ చెక్కడంపై నిరసన
సాక్షి, యాదగిరిగుట్ట: ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదగిరికొండపై శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాలు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణ మవుతున్న తూర్పు రాజగోపురం పక్కనే ఉన్న అష్టభుజి ప్రాకార మండపంలో మొదటి స్తంభానికి తెలంగాణ సంక్షేమ పథకాల్లో భాగమైన హరితహారం, పక్కనే ఉన్న పిల్లర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో పిల్లర్‌కు సీఎం కేసీఆర్ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపు అష్టభుజి ప్రాకార మండపంలో కారుగుర్తు, కేసీఆర్ కిట్టు, తెలంగాణ లోగోలో చార్మినార్‌ను అమర్చినట్లు చెక్కారు. వీటిని బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన సుమారు 30మంది నాయకులు, కాంగ్రెస్ జిల్లా నాయకులు బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 15మంది నాయకులు వేర్వేరుగా వాటిని పరిశీలించారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. దీంతో సీఐ నర్సింహారావు పోలీసులతో అక్కడికి చేరుకొని ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించరాదని ఆదేశించి వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అగ్రహానికి లోనైనా బండ్రు శోభారాణి, బీర్ల అయిలయ్యలు కొండపైన ఆలయాన్ని సందర్శించే హక్కు మాకు లేదా.. ఇక్కడ ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టవద్దు.. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడానికి వస్తే ఏమీ కాదుకానీ.. మేము మాట్లాడితే తప్పెంటి అంటూ వాగ్వాదానికి దిగారు. అయినా సీఐ వినిపించుకోకుండా అలానే ప్రవర్తించడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రమా.. కేసీఆర్ ఆదేశామా..? యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతున్నాయని ఆచార్యులు పదేపదే చెబుతున్నారని, ఇక్కడి పనులు చూస్తే సీఎం కేసీఆర్ ఆదేశానుసారంగా, ఆయన చెబుతున్న సొంత శాస్త్రంగానే జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి, కాంగ్రెస్ జిల్లా నాయకులు బీర్ల అయిలయ్య ఆరోపించారు. ఆలయాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణతో పాటు ఆంధ్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గొప్పగా ఆలయాలు నిర్మించిన ఎంతో మంది ప్రముఖులు ఎక్కడా వారి చిత్రాలు, పార్టీ గుర్తులు , ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల బొమ్మలను చెక్కించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి, రాచరిక పాలనతో యాదాద్రి ఆలయ నిర్మాణం పేరుతో తన చిత్రం, పార్టీ గుర్తు, సంక్షేమ పథకాలను గీయించుకున్నాడని మండిపడ్డారు. ఆలయాన్ని సందర్శించే భక్తులు దేవుడిని చూడాలా లేక కేసీఆర్‌తో పాటు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను చూడాల అని ప్రశ్నించారు. వారి వెంట బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాఘవుల నరేందర్, రచ్చ శ్రీనివాస్, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ఎరుకల చైతన్య, శేఖర్, భాస్కర్‌రెడ్డి, బొమ్మగాని రాజమణి, రాయగిరి రాజు, బెలిదె అశోక్, నవీన్ఠాగూర్, బెలిదే నవీన్ తదితరులు ఉన్నారు. హిందుత్వ వాదుల ఆందోళన యాదాద్రి కొండపైన సీఎం కేసీఆర్, కారుగుర్తు, కేసీఆర్ కిట్టు, హరితహారం వంటి చిత్రాలను ఆలయంలో పిల్లర్లపై చెక్కడంతో హిందువుల మనోభా వాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ భజరంగ్‌దళ్, హిం దుపరిరక్షణ సమితి, విశ్వహిందు పరిషత్, హిం దుత్వ వాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు హిందుత్వ వాదులను నిర్మాణం అవుతున్న ఆలయంలో చెక్కిన బొమ్మలవద్దకు పంపించకపోవడంతో వారు గోపురం ఎక్కేందుకు ప్రయత్నిం చారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని కిందికి దించారు. ఈ క్రమంలో తూరు రాజగోపురం వైపు పరుగులు తీస్తున్న క్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ మనోహర్‌రెడ్డిలు అడ్డుకున్నారు. వారిని సముదాయించి, నచ్చచెప్పి వెనక్కి పంపారు. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో అనంతరం భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌చందర్, విశ్వహిందు పరిషత్ ప్రచార కన్వీనర్ బాలస్వామి, మఠం మందిర్ రాష్ట్ర ప్రముఖ్ అరవింద్‌రెడ్డి, భజరంగ్‌దళ్ స్టేట్ కన్వీనర్ శివరాములు, వీహెచ్‌పీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తోట భానుప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె ప్రవీన్, ఈశ్వర్, కోకల సందీప్, బోయిని క్రాంతి, గురుగుల క్రాంతి, శివకుమార్ తదితరులున్నారు. -
‘భారతీయులకు అమెరికా క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) పేర్కొంది. అరెస్ట్ చేసిన వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భజరంగ్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్‌తో పాటు ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ సీఐఏ రిపోర్టును నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమ నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శించింది. హిందూ ధార్మిక సంస్థలైన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా సీఐఏ పేర్కొనందుకు భారత సమాజానికి అమెరికా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, జాతీయ పున:నిర్మాణం కోసం సేవ చేస్తున్న సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడం అమెరికా కుటిలనీతికి నిదర్శనమని పేర్కొంది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం ద్వారా సీఐఏ తన అజ్ఞానాన్ని ప్రదర్శించిందని విమర్శించింది. సీఐఏ తన తప్పును సరిదిద్దుకొని భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) ప్రతి సంవత్సరం వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ పేరిట ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తుంటుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన పుస్తకంలో హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంది. వాటిని రాజకీయ ఒత్తిడులకు పాల్పడే సంస్థలుగానూ, ఆర్ఎస్ఎస్ను జాతీయ సంస్థగా ప్రకటించింది. -
విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని అమెరికా రాయబార కార్యలయ ముట్టడికి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ పిలుపు నిచ్చాయి. అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ సీఐఏ హిందూ ధార్మిక సంస్థలైన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్లను మిలిటెంట్లుగా పేర్కొనటాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ.. సోమవారం బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాయి. దీంతో అమెరికా రాయబార కార్యాలయం ఎదుట భారీగా భద్రతా దళాలు మోహరించాయి. అమెరికాకు చెందిన ‘‘సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ’’(సీఐఏ) ప్రతి సంవత్సరం ‘‘వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ ’’ పేరిట ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తుంటుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన పుస్తకంలో హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మిలిటెంట్లుగా పేర్కొంది. వాటిని రాజకీయ ఒత్తుడులకు పాల్పడే సంస్థలుగానూ, ఆర్ఎస్ఎస్ను జాతీయ సంస్థగా పేర్కొంది. -
రాజకీయ ఎజెండా లేదు
వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా హిందువుల మనోభావాల రక్షణకు కృషి చేసే వారి వెంట ఉంటాం నాగపూర్: విశ్వ హిందూ పరి షత్ (వీహెచ్‌పీ)కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని ఆ సంస్థ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా పేర్కొన్నారు. తాము ఏ పార్టీకి గానీ, వ్యక్తికి గానీ మద్దతు ఇవ్వడం లేదని ఆయన నాగపూర్‌లో మంగళవారం విలేకరులకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల కోసం నిస్వార్ధ సేవ చేయాలనుకునేవారికి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘వీహెచ్‌పీకి ఎలాంటి రాజకీయ ఏజెండా లేదు. సంస్థ ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు. అయితే లక్షలాది మంది హిందువుల మనోభావాల రక్షణకు కృషి చేసేవారి వెంట ఉంటామ’ని ఆయన స్పష్టం చేశారు. రామాలయం, ఉమ్మడి పౌర స్మృతి, అర్టికల్ 370, గో వధ తదితర అంశాలను పార్టీలు మరిచిపోతున్నాయన్నారు. అయితే ప్రజాప్రతినిథులను ఎన్నుకునే ముందు గతంలో వారి ప్రదర్శన ఎలాగుంది, వారి పార్టీ పనితీరు ఎలా ఉంది తదితర పరిశీలించాకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. రూ.700 కోట్లతో మైనారిటీ అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేస్తూ యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అత్యధిక జనాభా ఉన్న హిందువులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వాటి పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. లక్షలాది మంది హిందువులు పేదరిక జీవనస్థాయిలోనే ఉంటున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చదువుల కోసం ఆర్థిక సహకారం కావాల్సిన హిందూ విద్యార్థుల్లో పేదవాళ్లు లేరా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒకప్పుడు వీహెచ్‌పీ నేతేనని, ఆయన ఆలోచనలను పార్టీ నుంచి వేరు చేయలేం కదా అని విలేకరుల ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాగా, పేద రోగుల కోసం లంచ్ ఇండియా హెల్త్‌లైన్ (ఐహెచ్ఎల్)ను నాగపూర్‌లో తొగాడియా ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక్క ఫోన్‌కాల్‌తో పేద హిందువులకు ఉచిత ఆరోగ్య సేవలందించేందుకు ఐహెచ్ఎల్ను ప్రారంభించామన్నారు. రోగముందని తెలిసినా డబ్బులు లేక అనేక మంది ఆస్పత్రులు వెళ్లడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. పుణే, ఢిల్లీతో పాటు ఇతర నగరాల్లోనూ త్వరలోనే ఐహెచ్ఎల్ సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు.