
'కేసు నుంచి బయటపడటానికే సెక్షన్ - 8'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడటానికే సెక్షన్ - 8 తెరపైకి తెస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రి వర్గ సహాచరులు సెక్షన్ -8 అంశం తెరపైకి తీసుకురావడంపై వీహెచ్ ఆదివారం హైదరాబాద్లో మండిపడ్డారు.
ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్న ఇరు రాష్ట్రాల ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. కొంత మంది కావాలనే హైదరాబాద్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని వీహెచ్ విమర్శించారు. అలాగే శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం లేదన్నారు. తాజా రాజకీయాలపై స్పందించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను వీహెచ్ డిమాండ్ చేశారు.