'అప్రజాస్వామిక విధానాలలో చంద్రబాబు దిట్ట'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మానవ హక్కుల నేత, సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అప్రజాస్వామిక విధానాలు అవలంభించడంలో చంద్రబాబు దిట్ట అని హరగోపాల్ మండిపడ్డారు.
ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో ప్రజలు ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.