హైదరాబాద్: సెక్షన్-8 అమలుపై ఓయూ విద్యార్థి నాయకుల ఆంజనేయగౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, వల్లమల్ల కృష్ణ, మంద సురేష్, శంకర్‌నాయక్, కరాటే రాజు తదితరులు మంగళవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలపై ఎలాంటి దాడులు, ఇతర గటనలు జరగకున్నా సెక్షన్-8 తెరపైకి తెచ్చి గవర్నర్‌కు శాంతి భద్రతల అధికారాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పై ఓయూ విద్యార్థి నాయకులు ధ్వజమెత్తారు.
సెక్షన్-8 పైన చంద్రబాబునాయుడు కపట నాటకం ఆపకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు వేస్తున్న కొత్త ఎత్తుడగా విద్యార్థి నాయకులు అభివర్ణించారు.