'రేవంత్‌రెడ్డికి అనుమతి ఇవ్వొద్దు' | OU JAC complaint to HRC against revanthreddy | Sakshi
Sakshi News home page

'రేవంత్‌రెడ్డికి అనుమతి ఇవ్వొద్దు'

Published Wed, Jun 1 2016 8:07 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

OU JAC complaint to HRC against revanthreddy

నాంపల్లి: ఈనెల 2న ఓయూలో జరగబోయే జన జాతరకులో పాల్గొనేందుకు టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించవద్దని తెలంగాణ విద్యార్ధి జేఏసీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అవతరణ దినోత్సవం వైభవంగా నిర్వహిస్తుంటే కొందరు ఓయూలో జన జాతర పేరిట బహిరంగ సభ పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ జన జాతరకు టీ టీడీపీ ఎమ్మెల్యే హాజరైతే శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశ్వ విద్యాలయం కీర్తి ప్రతిష్టలు దెబ్బతినకుండా, విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు జన జాతర సభ అనుమతిని రద్దు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement