5న ఉస్మానియాలో పోరు దీక్ష: కృష్ణయ్య
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల రూ. 2 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5న ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో వేలాది మందితో పోరు దీక్ష నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. సోమవారం ఇక్కడి బీసీ భవన్లో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగిం ది. కృష్ణయ్య మాట్లాడుతూ రెండేళ్ల ఫీజు బకాయిలు మొత్తం రూ. 3,140 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించినప్పటికీ ఇంకా విడుదల కాలేదన్నారు.
దీంతో విద్యార్థులు సమస్యలెదుర్కొంటున్నారన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ జాతీయ విద్యార్థి సంఘం కన్వీనర్ ర్యాగ అరుణ్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు.