
మాటల గారడీతో మోసం చేయొద్దు: బొత్స
హైదరాబాద్: విభజన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమల్లో ఉందని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. సెక్షన్ 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్ దేనని స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
సెక్షన్ 8 అంశంపై రాష్ట్రపతితో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్రపతితో చంద్రబాబు మాట్లాడినట్టు లేదని అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నందున ఆయనతో చర్చలు జరపాలని సూచించారు. మాటల గారడీతో జనాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని బొత్స విమర్శించారు. బాధ్యతాయుతంగా మెలగాలని హితవు పలికారు.