రాష్ట్ర పునర్విభజన చట్టంలోని వివాదాస్పద సెక్షన్-8 ఆధారంగా... భారత అటార్నీ జనరల్ సూచన మేరకు ‘ఓటుకు కోట్లు’ కేసును పర్యవేక్షించడం సాధ్యం కాదని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తేల్చారు. ఇదే విషయాన్ని మంగళవారం తనను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్ స్పష్టం చేసినట్లు అత్యున్నతస్థాయి వర్గాలు తెలిపాయి. సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్ పర్యవేక్షించవచ్చునని, ‘ఓటుకు కోట్లు’ కేసును ఉభయ రాష్ట్రాల డీజీపీలను పిలిచి పర్యవేక్షించవచ్చునని భారత అటార్నీ జనరల్ శుక్రవారం సూచించారు.