
ప్రజలా..? మాస్టర్ మైండా...?
అవినీతిపరులను కాపాడేలా ఏ చట్టం ఉండదని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్: అవినీతిపరులను కాపాడేలా ఏ చట్టం ఉండదని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 'ఓటు కోట్లు' వ్యవహారంపై ట్విటర్ వేదికగా చంద్రబాబుపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. రాజ్యాంగబద్దంగా రూపొందించిన ఏ చట్టమైనా, సెక్షనైనా ప్రజలను కేంద్రబిందువుగా చేసుకుని ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వం 5 కోట్ల ప్రజల ప్రయోజనాలు కాపాడుతుందా లేదా రూ. 5 కోట్లతో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన మాస్టర్ మైండ్ ను కాపాడుతుందా అని ప్రశ్నించారు.
ఏడాది కాలంగా అత్యంత ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్, తెలంగాణలో సెక్షన్ 8 పెట్టాలని ఏపీ సర్కారుకు ఇప్పుడు గుర్తుకురావడం శోచనీయమన్నారు. విభజన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో సెక్షన్ 8 చెల్లదని అరుణ్ జైట్లీ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ పై వివాదాలు చేయడం మానుకుని, ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని టీడీపీ ప్రభుత్వానికి హితవు పలికారు.
Whose interest is paramount to Govt of AP:that of 5 crore people of AP or the criminal mastermind in the Rs. 5 crore cash for vote scam? 2/5
— KTR (@KTRTRS) June 24, 2015