కమేడియన్ కునాల్ కమ్రా
న్యూఢిల్లీ: కమేడియన్ కునాల్ కమ్రా సుప్రీంకోర్టుని విమర్శిస్తూ చేసిన ట్వీట్‌లు కోర్టుని అవహేళన చేయడమేనని, అతనిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు అటార్నీ జనరల్(ఏజీ) వేణుగోపాల్ తెలిపారు. సుప్రీంకోర్టుని, న్యాయమూర్తులను ప్రజలు ధైర్యంగా, బహిరంగంగా విమర్శించవచ్చునని, అయితే వాక్ స్వాతంత్య్రం అనేది చట్టానికి లోబడి ఉంటుందని కెకె.వేణుగోపాల్ అన్నారు.సుప్రీంకోర్టుని కాషాయరంగుతో, దానిపై త్రివర్ణపతాకం జెండా స్థానంలో బీజేపీ జెండాని చూపిస్తూ కమ్రా ట్వీట్ చేశారని, ఇది సుప్రీంకోర్టు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని, అతనిపై చర్యలకు అనుమతినివ్వాలని ముగ్గురు లాయర్లు కోరారు. అర్నబ్‌కి సుప్రీం బెయిలు మంజూరు చేయడంపై కమ్రా ఈ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment