
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు గళమెత్తిన వ్యవహారంపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందించారు. సర్వోన్నత న్యాయస్ధానం పనితీరుపై న్యాయమూర్తుల ఆక్రోశం నేపథ్యంలో తలెత్తిన సంక్షోభానికి శనివారం తెరపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రీం న్యాయమూర్తులందరూ అపార అనుభవం, ప్రతిభా పాటవాలు కలిగిన విజ్ఞులు..నాకు తెలిసి రేపటితో (శనివారం) మొత్తం వ్యవహారం సమసిపోతుంద’ని ఆయన పేర్కొన్నారు.
సుప్రీం కోర్టులో పరిస్థితి సజావుగా లేదని జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు సీజేఐ దీపక్ మిశ్రాపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులు బాహాటంగా సుప్రీం కోర్టు వ్యవహార శైలిపై వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment