సుప్రీం కోర్టులో బొగ్గు కుంభకోణం కేసు వాదనల సందర్భంగా సహనం కోల్పోయిన భారత అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి క్షమాపణలు చెప్పారు.
సుప్రీం కోర్టులో బొగ్గు కుంభకోణం కేసు వాదనల సందర్భంగా సహనం కోల్పోయిన భారత అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి క్షమాపణలు చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసు మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. వాదనల సందర్భంగా వాహనవతి సహనం కోల్పోయి వ్యవహరించారు.
ఈ సంఘటన గురించి సుప్రీం కోర్టులో బుధవారం వాహనవతి ప్రస్తావిస్తూ విచారం వ్యక్తం చేశారు. ధర్మాసనాన్ని అగౌరవ పరచాలన్నది తన ఉద్దేశంకాదని వివరించారు. ఏదేమైనా తాను అలా వ్యవహరించడం సరికాదని, క్షమించాల్సిందిగా న్యాయమూర్తి జస్టిస్ లోధాకు విన్నవించారు.