అటార్నీ జనరల్‌కు సోనియా పేరుతో మహిళ ఫోన్! | woman phone with sonia name to Attorney General | Sakshi
Sakshi News home page

అటార్నీ జనరల్‌కు సోనియా పేరుతో మహిళ ఫోన్!

Published Tue, Sep 24 2013 4:55 AM | Last Updated on Sat, Aug 25 2018 5:20 PM

అటార్నీ జనరల్‌కు సోనియా పేరుతో మహిళ ఫోన్! - Sakshi

అటార్నీ జనరల్‌కు సోనియా పేరుతో మహిళ ఫోన్!

న్యూఢిల్లీ: యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ గొంతును అనుకరిస్తూ అటార్నీజనరల్ జీఈ వాహనవతికి ఓ గుర్తుతెలియన మహిళ ఫోన్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు కేంద్ర హోంమత్రి సుశీల్‌కుమార్ షిండే సోమవారం తెలిపారు. అటార్నీ జనరల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఈ ఫోన్‌కాల్‌పై ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టారన్నారు.
 
 ‘సోనియాగాంధీ గొంతును అనుకరిస్తూ గుర్తుతెలియని మహిళ సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత ముఖ్యమైన ఫైల్‌ల విషయమై అటార్నీ జనరల్‌తో మాట్లాడారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అంశం కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. దీనిపై అటార్నీ జనరల్ ఫిర్యాదు చేశారు’ అని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సోనియాగాంధీ ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన సమయంలోనే ఆమె పేరుతో ఫోన్ చేసిన మహిళ.. తాను న్యూయార్క్ నుంచి మాట్లాడుతున్నానని వాహనవతికి చెప్పినట్లు సమాచారం. అయితే ఆ ఫోన్ కాల్ ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసే మహిళ చేసిందని, కార్యాలయం నుంచే ఏడుసార్లు అటార్నీ జనరల్‌కు ఫోన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement