వాషింగ్టన్: తనకు అత్యంత విధేయుడిగా పేరొందిన అమెరికా పార్లమెంట్ సభ్యుడు మ్యాట్ గేజ్‌ను తదుపరి అమెరికా అటార్నీ జనరల్‌గా ఎంపికచేశారు. ‘‘ ఫ్లోరిడా నుంచి అమెరికా కాంగ్రెస్‌కు సేవలందిస్తున్న మ్యాట్ గేజ్‌ను అటార్నీ జనరల్‌గా నియమించడం గౌరవంగా భావి స్తున్నా. విపక్ష నేతలపైకి న్యా య వ్యవస్థను ఆ యుధంగా వాడే పెడపోకడకు గేజ్ ముగింపు పలు కు తారని భావి స్తున్నా.
సరిహద్దులను కాపాడుతూ, నేరముఠాల పనిపట్టి, న్యాయ వ్యవస్థపై అమెరికన్లలో సన్నగిల్లిన నమ్మకాన్ని గేజ్ మళ్లీ పెంచుతారని ఆశిస్తున్నా. జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లోని వ్యవస్థాగత అవినీతిని గేజ్ అంతమొందిస్తారు’’ అని ట్రంప్ గురువారం ప్రకటించారు. విలియం అండ్ మేరీ కాలేజ్ ఆఫ్ లాలో పట్టభద్రుడైన గేజ్ అమెరికా న్యాయవ్యవస్థలో సంస్కరణ కోరుకునే వ్యక్తిగా పేరొందారు.
Comments
Please login to add a commentAdd a comment