
తొలి మహిళా అటార్నీ జనరల్ కన్నుమూత
వాషింగ్టన్: అమెరికా తొలి మహిళా అటార్నీ జనరల్ జానెట్ రెనో (78) కన్నుమూశారు. పార్కిన్సన్ వ్యాధి తో బాధపడుతున్న ఆమె మియామి లోని ఇంట్లో తది శ్వాస విడిచారని అమెరికా సంయుక్త మీడియా వెల్లడించింది. బిల్ క్లింటన్ క్యాబినెట్ లో ఆమె అత్యంత విశ్వసనీయ కేబినెట్ సభ్యులు ఒకరుగా ఉన్నారు
1993 -2001మధ్య కాలంలో బిల్ క్లింటన్ అధ్యక్షుడి గా ఉన్నపుడు పలు రాజకీయ సంక్షోభాలకు కేంద్రంగా మారారు. క్లింటన్ నాయకత్వంలో సుదీర్ఘకాల నమ్మకంగా పనిచేసిన మహిళగా పేరొందారు. అయితే వాకో పాశవిక దాడి ఆమె రాజకీయ చరిత్రలో మాయనిమచ్చ. పదవి చేపట్టిన వెంటనే వాకో, టెక్సాస్ లో ఘోరమైన దాడితో పలు విమర్శలకు ఎదుర్కొన్నారు. ఈ దాడిలో తెగ నాయకుడు డేవిడ్ కోరేష్ , అతని 80మంది అనుచరులను మట్టు బెట్టడం వివాదం రేపింది. రెనో 20 వ శతాబ్దపు దీర్ఘకాలం పనిచేసిన ప్రధానన్యాయసలహాదారుగా నిలిచారు.
1995 లో ఆమెకు పార్కిన్సన్స్ వ్యాధి నిర్ధారణ అయినప్పటికీ రెండు చేతులు వణుకుతూ ఇబ్బంది పడుతున్నా పదవిలో కొనసాగారు.