వాషింగ్టన్: ప్రభుత్వ కార్యకలాపాలపై నిఘా పెట్టి, అధికారులపై అభియోగాలు మోపుతున్న న్యూయార్క్ జిల్లా న్యాయవాది జాఫ్రీ బెర్మన్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారని యుఎస్ అటార్నీ జనరల్ విలియం బార్ తెలిపారు. జాఫ్రీ బెర్మన్ తొలగింపునకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడని వెల్లడించారు. అయితే, బెర్మన్ పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించారని బార్ పేర్కొన్నారు. అతను రాసిన ఓ లేఖలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయని జిన్హువా వార్తా సంస్థ ప్రచురించింది. బెర్మన్ స్థానంలో యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఛైర్మన్ జే క్లేటన్ ను నామినేట్ చేయాలనే ఉద్దేశ్యాన్ని ట్రంప్ శుక్రవారం అర్థరాత్రి ప్రకటించారని తెలిపింది.
(చదవండి: 30 ఏళ్ల తర్వాత ఆ రహస్య చీటీలు చూసి..)
కాగా, బెర్మన్ విచారణతోనే ట్రంప్ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైఖేల్ కోహెన్‌ను జైలు జీవితం గడుపుతున్నాడు. దాంతోపాటు ట్రంప్ ప్రస్తుత వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియానిని కూడా బెర్మన్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అందుకనే అతని తొలగింపునకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. అయితే, సెనేట్ ధృవీకరణతోనే తాను పదవికి రాజీనామా చేస్తానని బెర్మన్ కుండబద్దలు కొట్టారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. అప్పటి వరకు, తమ దర్యాప్తులు ఆలస్యం లేదా అంతరాయం లేకుండా ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేసినట్టు పేర్కొంది.
(చదవండి: ఇరు దేశాలతో చర్చిస్తున్నాం: ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment