అమెరికా సర్జన్ జనరల్‌గా వివేక్ మూర్తి
వాషింగ్టన్: అమెరికా సర్జన్ జనరల్‌గా 37 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్ మూర్తి నియామకాన్ని సెనేట్ ఆమోదించింది. దీంతో పిన్న వయసులోనే సర్జన్ జనరల్ అయిన వ్యక్తిగా మూర్తి రికార్డు సృష్టించారు. ఈ బాధ్యతలు చేపట్టనున్న తొలి భారతీయ సంతతి వ్యక్తి కూడా ఆయనే. బోస్టన్‌లో వైద్య వృత్తిలో స్థిరపడిన మూర్తి కర్ణాటకలో జన్మించారు. మూడేళ్ల వయసులోనే అమెరికాకు వలసవెళ్లారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి బీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీగా పట్టాలు పుచ్చుకున్నారు.