అమెరికా ప్రతినిధుల సభలో భారత సంతతి సభ్యుడు | Indian American lawmaker Ami-Bera stages comeback win | Sakshi
Sakshi News home page

అమెరికా ప్రతినిధుల సభలో భారత సంతతి సభ్యుడు

Published Thu, Nov 20 2014 10:01 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

అమిరేష్ 'అమీ' బెరా

అమిరేష్ 'అమీ' బెరా

 వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ సంతతికి చెందిన ఏకైక సభ్యుడు అమిరేష్ 'అమీ' బెరా తాజా ఎన్నికలలో కూడా తన స్థానాన్ని నిలుపుకున్నారు. రెండువారాల కిందట జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసిన అమీ బెరా తొలుత తన ప్రత్యర్థి రిపబ్లిక్ పార్టీకి చెందిన డౌగ్ ఓసే కంటే 3వేల ఓట్లు వెనుకబడ్డారు.  మిగిలిన ఓట్లన్నీ లెక్కించేసరికి 1,432 ఓట్ల ఆధిక్యం సాధించారు.

2012లో కూడా అమీ బెరా గెలిచారు. ఈసారి హోరా హోరీగా జరిగిన ఎన్నికలలో మరోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించిన అమీ బెరాకు ప్రత్యర్థి డౌగ్ ఓసే అభినందనలు తెలిపారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement