US House of Representatives
-
బైడెన్ వల్లే ఓడిపోయాం
వాషింగ్టన్: ఎన్నికల ఫలితాలపై డెమొక్రాట్లలో ఆగ్రహం వెల్లువవుతోంది. పార్టీ హారిస్, బైడెన్ అనుకూల వర్గాలుగా చీలిపోయింది. ఓటమికి కారణం మీరంటే మీరంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వల్లే ఈ ఎన్నికల్లో ఓడిపోయామని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆరోపించారు. ఆయన పోటీ నుంచి తొందరగా తప్పుకొని ఉంటే డెమొక్రాట్లు మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవారన్నారు. అయితే ఓటమికి హారిస్ సాకులు చెబుతున్నారని బైడెన్ మాజీ సహాయకుడు ఆక్సియోస్ చెప్పారు. గెలవకుండానే ఒక బిలియన్ డాలర్లు ఎలా ఖర్చుచేశారని ప్రశ్నించారు. జో బైడెన్‌ను బయటకు నెట్టడానికి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సలహాదారులు పార్టిలో అంతర్గత కుమ్ములాటలను బహిరంగంగా ప్రోత్సహించారని ఆరోపించారు. బైడెన్‌ను గద్దె దించడానికి కుట్ర పన్నిన వారే ఎన్నికల్లో ఓటమికి కారణమని డెమొక్రాట్ సెనేటర్ జాన్ ఫెటర్మన్ ఆరోపించారు. -
అమెరికా ఎన్నికల్లో ఎన్నారైల సత్తా.. ఎంతమంది గెలిచారంటే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని విజయాన్ని నమోదు చేసుకున్నారు. పాపులర్ ఓటింగ్ ద్వారానే ఆయన తన గెలుపును ఖరారు చేశారు. అదే సమయంలో.. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతి పౌరులు (ఎన్నారై) సైతం తమ సత్తా చాటారు. అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 మంది భారతీయ అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. వీరిలో ఆరుగురు విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోసారి బరిలోకి దిగిన ఐదుగురు సీనియర్ నాయకులు.. విజయాన్ని దక్కించుకున్నారు.1. రాజా కృష్ణమూర్తి(51): డెమోక్రాటిక్ పార్టీకి చెందిన బలమైన నాయకుడు రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్(8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా అయిదోసారి గెలుపొందారు. 2017 నుంచి ఆయన చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2. రో ఖన్నా(48): డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రో ఖన్నా..2017 నుంచి కాలిఫోర్నియా (17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడే బరిలో దిగిన ఆయన మరోసారి గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి అనితా చెన్ను ఓడించి విజయం సాధించారు.3. సుహాస్ సుబ్రమణ్యం(38): డెమొక్రాటిక్ అభ్యర్థిగా వర్జీనియా (10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి బరిలో దిగిన సుహాస్ సుబ్రమణ్యం.. రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ క్లాన్సీని ఓడించి విజయం సాధించారు. ప్రస్తుతం వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా వ్యవహరిస్తున్న ఆయన... డెమొక్రాట్లకు కంచుకోట రాష్ట్రంగా పేరున్న వర్జీనియా నుంచి విజయం దక్కించుకున్నారు. దీంతో వర్జీనియా నుంచి గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్‌గా సుబ్రమణ్యన్ రికార్డు సృష్టించారురు. గతంలో అధ్యక్షుడు ఒబామాకు వైట్ హౌస్ సలహాదారుగా కూడా సుహాస్ పనిచేశారు.4. శ్రీథానేదార్(69): మిచిగాన్ (13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి బరిలోకి దిగిన శ్రీ థానేదార్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన ప్రత్యర్ధి రిపబ్లికన్ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్‌ను 35 శాతం ఓట్ల తేడాతో ఓడించి, రెండవసారి గెలుపును దక్కించుకున్నారు. ఈయన 2023 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.5. డాక్టర్ అమిబెరా(59): వృత్తి పరంగా వైద్యుడు అయిన అమిబెరా.. సీనియర్ మోస్ట్ ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యుడు.2013 నుంచి కాలిఫోర్నియా(6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి బరిలోకి దిగిన అమిబెరా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై ఘన విజయాన్ని సాధించారు.6. ప్రమీలా జయపాల్(59): డెమోక్రటిక్ నేత ప్రమీలా జయపాల్ వాషింగ్టన్( 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ నేత డాన్ అలెగ్జాండర్‌ను ఓడించి తిరిగి ఎన్నికయ్యారు.అమిష్ షా: భారతీయ సంతతికి చెందిన అమిష్ షా... అరిజోనా(1వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అతను రిపబ్లికన్‌కు చెందిన డేవిడ్ ష్వీకర్ట్ కంటే ముందంజలో ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు విజయం దక్కించుకున్న రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ స్క్యూకెర్ట్‌తో అమిష్ తలపడుతుండడం గమనార్హం. కాగా అరిజోనా రాష్ట్ర అసెంబ్లీకి వరుసగా మూడు సార్లు(2018, 2020, 2022) ఎన్నికయ్యారు షా. -
కలిస్తే ఖబడ్దార్.. తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన చైనా
బీజింగ్: తైవాన్‌కు చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ ప్రస్తుతం దౌత్యపరమైన ఒప్పందాల కోసం మధ్యఅమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే.. దేశ అంతర్గత వ్యవహారాలను ఈ పర్యటనలో అగ్రరాజ్యంతో చర్చిస్తే.. చూస్తూ ఊరుకోబోమని డ్రాగన్ హెచ్చరించింది. అంతేకాదు.. పర్యటనకు ముందు సాయ్ చేసిన వ్యాఖ్యలను ధిక్కార స్వరంగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. సాయ్ ఇంగ్-వెన్ పర్యటనకు ముందు మాట్లాడుతూ.. తైవాన్‌కు ప్రపంచంతో సంబంధాలు కొనసాగించే హక్కు ఉందని, బయటి శక్తులు(చైనాను ఉద్దేశించి..) ఈ మేరకు ఎలాంటి ప్రభావం తమపై చూపలేదంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆమె మధ్యలో కాలిఫోర్నియాను సందర్శించాల్సి ఉండగా.. యూఎస్ హౌజ్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్థీతో భేటీ అవుతారనే సమాచారం అందుతోంది. అయితే.. ఈ భేటీ పరిణామంపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ఒకవేళ తైవాన్ అధ్యక్షురాలు గనుక అమెరికా చట్టసభ స్పీకర్‌ను కలిస్తే మాత్రం పరిణామాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని, ఇది చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే అంశంగా భావించక తప్పదని పేర్కొంది. మరోవైపు సాయ్ ఇంగ్-వెన్ వ్యాఖ్యపైనా చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను, చర్యలను బీజింగ్ వర్గాలను రెచ్చగొట్టడం కిందే చూడాల్సి వస్తుందని, ప్రతీకార చర్యలు తప్పవని, తర్వాతి పరిణామాలకు తైవాన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
బైడెన్ భార్య.. కమలా హ్యారిస్ భర్త.. పబ్లిక్‌గా ఇలా..
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వీడియో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ భార్య, ప్రథమ పౌరురాలైన జిల్ బైడెన్.. ఆ దేశ ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్ భర్త డౌ ఎమ్హోఫ్ పబ్లిక్‌గా చుంబించుకోవడంపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. అది మామూలు పలకరింపు అయితే ఫర్వాలేదు. ఏకంగా పెదాలపై చుంబనం కావడంతోనే ఇక్కడ యవ్వారం మరో మలుపు తిరిగింది. మంగళవారం కాపిటోల్ హిల్‌లో ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియర్ ప్రసంగం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. కమలా హ్యారిస్‌ను మరోసారి ఉపాధ్యక్ష రేసులో నిలపకూడదని బైడెన్ భావిస్తున్నట్లు, ఈ మేరకు వైట్‌హౌజ్ వర్గాలు.. బైడెన్ అంతరంగికుల నుంచి ఆయన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు లాస్ ఏంజెల్స్ టైమ్స్ తాజాగా ఓ విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్థానాలను భారీగా కోల్పోయింది డెమొక్రటిక్ పార్టీ. రిపబ్లికన్లు చాలావరకు స్థానాలు దక్కించుకోవడంతో.. బైడెన్ ప్రసంగంలో స్నేహపూర్వక వ్యాఖ్యలే ఎక్కువగా వినిపించాయి. Did Jill Biden just kiss Kamala's husband on the LIPS?! pic.twitter.com/KvrUxSI8Lu — Benny Johnson (@bennyjohnson) February 8, 2023 -
అమెరికా హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి ఇల్హాన్ ఒమర్ తొలగింపు
వాషింగ్టన్: ‘కశ్మీర్‌పై అమెరికా మరింత శ్రద్ధ పెట్టాలి’ అని వ్యాఖ్యానించి భారత్ ఆగ్రహానికి గురైన అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌కు షాక్ తగిలింది. శక్తిమంతమైన హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి ఆమెను తొలగించారు. డెమొక్రటిక్ సభ్యురాలైన ఒమర్ తీరుపై రిపబ్లికన్ సభ్యులు చాలా రోజులుగా మండిపడుతున్నారు. ఇజ్రాయెల్, యూదులకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేసిన ఆమె విదేశీ వ్యవహారాల కమిటీలో ఉండడానికి అర్హురాలు కాదని వారు వాదిస్తూ వచ్చారు. ఓటింగ్ నిర్వహించగా కమిటీ నుంచి ఆమె తొలగింపుకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి. కమిటీలో లేనంత మాత్రాన తన గళాన్ని ఎవరూ అణచివేయలేరని, తాను మరింతగా రాటుదేలుతానని ఒమర్ వ్యాఖ్యానించారు. ఆమె గతంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో పర్యటించారు. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశమయ్యారు. -
స్త్రీ శక్తి: మడమ తిప్పలేదు... అడుగు ఆపలేదు
పౌరహక్కుల నుంచి పర్యావరణం వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాత్యహంకార బెదిరింపులు ఎన్ని ఎదురైనా ధైర్యమే వజ్రాయుధంగా ముందుకు కదిలారు. కొత్త అడుగుతో చరిత్ర సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మన వాళ్ల గురించి.. అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలిచిన అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో పుట్టింది. భారత సంతతికి చెందిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే మొదటిసారి. ఈ విషయంలో అరుణ చరిత్ర సృష్టించింది. మేరీలాండ్కు తొలి భారతీయ–అమెరికన్ డెలిగేట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. మిస్సోరీ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానర్‌గా, ట్రాఫిక్ ఇంజనీర్‌గా వివిధ ప్రాంతాలలో పనిచేసింది. మిస్సోరీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది. పరిమళా జయపాల్ పరిమళా జయపాల్ యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)కు ఎంపికైన తొలి భారతీయ–అమెరికన్ మహిళ. తాజాగా 7వ డిస్ట్రిక్ట్(వాషింగ్టన్) నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్లిఫ్‌మూన్‌పై విజయం సాధించింది. చెన్నైలో పుట్టిన పరిమళా జయపాల్ ఇండోనేషియా, మలేసియాలో పెరిగింది. తల్లి రచయిత్రి. తండ్రి మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. పదహారు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లింది పరిమళ. జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నుంచి బీఏ, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. చదువు పూర్తయిన తరువాత ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా పనిచేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు పౌరహక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసింది. ‘హేట్ ఫ్రీ జోన్’ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పరిమళ మంచి రచయిత్రి కూడా. ‘పిల్గ్రిమేజ్: వన్ వుమెన్స్ రిటర్న్ టు ఏ ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకం రాసింది. ‘నువ్వు మీ దేశానికి వెళ్లి పో’ అంటూ ఆమెకు ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఆమె వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. వెనక్కి తగ్గలేదు. నబీలా సయ్యద్ అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇల్లినాయి జనరల్ అసెంబ్లీకి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్–అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా 51వ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్పై ఘన విజయం సాధించింది. ఇల్లినాయి రాష్ట్రంలోని పాలై్టన్ విలేజ్‌లో పుట్దింది నబీలా. హైస్కూల్ రోజుల నుంచి ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. వాటి ద్వారా రకరకాల సామాజిక విషయాలను లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కాలేజిలో ఎన్నో చర్చావేదికల్లో పాల్గొనేది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో పట్టా పుచ్చుకుంది. స్త్రీ సాధికారత, హక్కులకు సంబంధించి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే నబీలా ఉద్యోగం కంటే ఉద్యమాలకే ప్రాధాన్యత ఇచ్చేది. ఈ క్రమంలోనే రాజకీయాలకు దగ్గరైంది. ‘ఎమిలీస్ లిస్ట్’తో కలిసి పనిచేసింది. ఎమిలీస్ లిస్ట్ అనేది డెమోక్రటిక్ మహిళా అభ్యర్థులు చట్ట సభకు ఎన్నిక కావడానికి ఉపకరించే పొలిటికల్ యాక్షన్ కమిటీ.‘నా విజయానికి ప్రధాన కారణం తమ తరపున పోరాడే, బలంగా గొంతు వినిపించే వ్యక్తిని ప్రజలు తమ ప్రతినిధిగా చట్టసభకు పంపాలనుకోవడం. వారి నమ్మకాన్ని నిలబెడతాను’ అంటోంది నబీలా.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టిన నబీలా తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మళ్లీ ఇంటింటికీ వెళ్లనుంది. -
సీన్ రివర్స్.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ స్వల్ఫ ఆధిపత్యం సాధించింది. అయితే అనుకున్న మేర ఫలితం సాధించలేకపోవడం గమనార్హం. ఈ తరుణంలో డెమోక్రటిక్ పార్టీ నేత, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి రోజు అంటూ వ్యాఖ్యానించారాయన. ఓటర్లలో పేరుకుపోయిన నిరాశను అంగీకరించిన బైడెన్.. అధిక మెజారిటీ ద్వారా అమెరికన్లు తన ఆర్థిక ఎజెండాకు మద్దతు ఇచ్చారని చెప్పారు. ‘‘ఇది ఒక శుభదినం. బహుశా ప్రజాస్వామ్యానికి, అమెరికాకు మంచి రోజని భావిస్తున్న. రిపబికన్లదే పూర్తి హవా ఉంటుందని కొందరు అంచనా వేశారు. అది జరగలేదు’’ అంటూ వైట్ హౌజ్‌లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారాయన. మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల కోసం సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఫలితాలు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 250 స్థానాలు ఆశించింది ఆ పార్టీ. పైగా ట్రంప్ వ్యక్తిగతంగా ప్రచారం చేసిన ప్రముఖులు ఓటమి చెందడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణంతో పాటు బైడెన్ ఎన్నిక చట్టబద్ధతను ప్రశ్నిస్తూ.. రిపబ్లికన్లు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 2018 తర్వాత మొదటిసారిగా 435 మందితో కూడిన యూఎస్ హౌజ్‌ను అతిస్వల్ఫ ఆధిక్యంతో తిరిగి కైవసం చేసుకునేందుకు ట్రాక్ ఎక్కింది. వంద మంది సభ్యున్న యూఎస్ సెనేట్‌లో ఇరు పార్టీలు 48 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక హౌజ్ ఆఫ్ రెప్రజెంటివ్స్లో రిపబ్లికన్ పార్టీ 207 సీట్లు, డెమోక్రటిక్ పార్టీ 183 స్థానాలు దక్కించుకున్నాయి(స్పష్టమైన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది). గత 40 ఏళ్లలో ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అత్యుత్తమమని బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
నాన్సీ పెలోసీ భర్తపై దాడి.. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్తపై దాడికి పాల్పడిన పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న పాల్ (82)పై అతను సుత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది రాజకీయ ప్రేరేపిత, ఉద్దేశపూర్వక దాడి అని శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రూక్ జెంకిన్స్ వెల్లడించారు. ‘‘నాన్సీ ఎక్కడున్నారంటూ ఆరా తీశాడు. ఆమె కొన్ని రోజుల వరకు రాదని తెలుసుకుని పాల్ చేతులు కట్టేశాడు. కిందికి వెళ్లాలని ప్రయత్నించిన పాల్‌ను అడ్డుకున్నాడు. చివరికి రెస్ట్‌రూంకు వెళ్లేందుకు అంగీకరించాడు. రెస్ట్ రూం నుంచే పోలీసులకు పాల్ సమాచారమిచ్చారు. తర్వాత డేవిడ్ సుత్తితో పాల్ తలపై మోదాడు. పెనుగులాట జరుగుతుండగా పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు’’ అని చెప్పారు. ‘డెమోక్రాటిక్ పార్టీలోని అబద్ధాలాడే వారికి నాయకురాలు నాన్సీ. నిజం చెబితే వదిలేయాలని, లేదంటూ సుత్తితో మోకాళ్లు విరగ్గొట్టి, వీల్ చైర్లో కాంగ్రెస్‌కు తీసుకెళ్లాలనుకున్నా. అబద్ధాలు మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో మిగతా సభ్యులకు చూపాలనుకున్నా అని డేవిడ్ విచారణలో తెలిపాడు’అని జెంకిన్స్ వెల్లడించారు. నాన్సీ తర్వాత మరో కాంగ్రెస్ సభ్యుడిపైనా దాడి చేయాలనుకున్నట్లు చెప్పిన డేవిడ్ ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదన్నారు. అంతేకాదు, పాల్, డేవిడ్‌లకు మధ్య ఇంతకు ముందు ఎటువంటి పరిచయం కూడా లేదని జెంకిన్స్ చెప్పారు. పెలోసీ ఇంట్లోకి దొంగతనంగా చొరబడిన డేవిడ్ డిపపే(42) వెంట సుత్తితోపాటు చేతులను కట్టేసేందుకు జిప్ టేప్, తాడు వెంట తీసుకెళ్లాడు. కెనడా పౌరుడైన డేవిడ్ 2000వ సంవత్సరం నుంచి అమెరికాలో ఉంటున్నాడు.అతడి వీసా గడువు కూడా ఎప్పుడో ముగిసిపోయిందని అధికారులు పేర్కొన్నారు. -
నాన్సీ పెలోసీ భర్తపై పైశాచికంగా దాడి
శాక్రమెంటో: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ అయిన నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీపై దాడి జరిగింది. ఈ దాడిలో పాల్ పెలోసీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం సమయంలో కాలిఫోర్నియాలోని ఆమె నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తైవాన్‌లో ఆమధ్య నాన్సీ పెలోసీ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆపై ఆమెపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది చైనా. ఇక ప్రస్తుత దాడి సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలుస్తోంది. డెమొక్రట్స్తో కలిసి ఆమె నవంబర్8న జరగబోయే మధ్యంతర ఎన్నికల కోసం ఫండ్‌రైజింగ్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. ఘటన సమయంలో ఆమె వాషింగ్టన్లో ఉన్నారు. పోలీసుల అదుపులోనే దుండగుడు ఉండగా.. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆగంతకుడి దాడిలో పాల్ పెలోసీ(82).. ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. సుత్తితో ఇంట్లోకి ప్రవేశించాడు ఆగంతకుడు. అయితే దాడికి ఆ సుత్తిని ఉపయోగించాడా? అనేది తెలియాల్సి ఉంది. పాల్ పెలోసీ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. శాన్ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా స్టేట్)కు చెందిన పాల్ పెలోసీ ప్రముఖ వ్యాపారవేత్త. నాన్సీ-పాల్‌కు 1963లో వివాహం జరిగింది. ఈ జంటకు ఐదుగురు సంతానం. ఈ కుటుంబం మొత్తం ఆస్తిపాస్తుల ద్వారా నాన్సీ పెలోసీ మొత్తం కాంగ్రెస్ సభ్యుల్లో అత్యంత ధనవంతురాలిగా నిలవడం విశేషం. బాల్టిమోర్‌కు చెందిన నాన్సీ పెలోసీ.. 1987 నుంచి శాన్ఫ్రాన్సిస్కో తరపున కాంగ్రెస్‌కు ఎన్నికవుతూ(మధ్య మధ్యలో కాలిఫోర్నియా, వాషింగ్టన్ నుంచి కూడా) వస్తున్నారు. అమెరికాలో పవర్ఫుల్ నేతల్లో పెలోసీ ఒకరు. ప్రతినిధుల సభకు స్పీకర్‌గా 2021లో ఆమె నాలుగో సారి ఎన్నికయ్యారు. పాతికేళ్లలలో తైవాన్ను సందర్శించిన అమెరికా అతిపెద్ద నేత ఈమెనే కావడం గమనార్హం. స్పీకర్ నాన్సీ పావెల్ భర్తపై దాడి ఘటనను యూఎస్ఐ, యూఎస్ కాపిటోల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కథనాలే కాదు మాటా పదునే
‘దక్షిణాసియాలో మానవ హక్కులు’ అనే అంశం మీద మంగళవారం యు.ఎస్.లో సదస్సు జరుగుతోంది. ఆ సదస్సును ఏర్పాటు చేసింది యు.ఎస్. హౌస్ కమిటీ. హౌస్ అంటే ‘హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్’. ప్రతినిధుల సభ. ఆ సభ నేతృత్వంలో విదేశీ వ్యవహారాల మీద చర్చలకు, తీర్మానాలకు ‘హౌస్ కమిటీ ఆన్ ఫారిన్ అఫైర్స్’ పని చేస్తుంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే మంగళవారం నాటి సదస్సు జరిగింది. అందులో మాట్లాడ్డం కోసం ఆసియా దేశాల్లోని జర్నలిస్టులు కొందరికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి. ఇండియా నుంచి ప్రముఖ పాత్రికేయురాలు ఆర్తిసింగ్‌కు ఆహ్వానం అందింది. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. వారిలో ఎక్కుమంది కశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. వారి మాటల్ని బట్టి.. ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని బయటిదేశాల్లో ఇప్పటికే బాగా ప్రచారం అయిందని ఆర్తికి అర్థమైంది. ఏ ప్రచారంలోనైనా ప్రపంచ మీడియా పాత్ర బలంగా ఉంటుంది. అందుకని ఆర్తి తన ప్రసంగంలో.. ప్రచారం జరుపుతున్న వారి బాధ్యతారాహిత్యం మీద ప్రశ్నలు గుప్పించారు. ‘‘ముప్పై ఏళ్లుగా కశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయంపై ప్రపంచ మీడియా ఒక్కసారైనా నోరు మెదిపిందా? కశ్మీర్లో పాక్ ఉగ్రవాద బాధితుల గురించి గళమెత్తడం తమ కనీస ధర్మం అని ప్రపంచ మీడియాతో పాటు, ప్రపంచ మానవ హక్కుల కార్యకర్తలు ఏనాడైనా అనుకున్నారా?’’ అని ఆర్తి విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై పాక్ స్పందన, పాక్‌ను సమర్థించే దేశాల ప్రతిస్పందన ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల నుండి ఆర్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆర్తి ప్రస్తుతం ఒక జాతీయ దినపత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్‌గా ఉన్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాలలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆర్తి, గతంలో జమ్మూకశ్మీర్‌లో ఏడేళ్లపాటు న్యూస్ కరస్పాండెంట్‌గా పని చేశారు. -
అమెరికా కాంగ్రెస్‌లో కంచ ఐలయ్య ప్రస్తావన
వాషింగ్టన్: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యతో పాటు ప్రముఖ రచయిత కంచ ఐలయ్యను హతమారుస్తామని వచ్చిన బెదిరింపులు అమెరికా కాంగ్రెస్‌లో ప్రస్తావనకు వచ్చాయి. హరాల్డ్ ట్రెంట్ ఫ్రాంక్స్ అనే సభ్యుడు ప్రతినిధుల సభలో ఈ ఘటనల్ని లేవనెత్తారు. ‘గౌరవనీయులైన స్పీకర్ గారు.. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేస్తున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ విమర్శను పోస్ట్ చేసిన వారిని లేదా తమ అభిప్రాయాలను ఇంటర్నెట్లో స్వేచ్ఛగా వ్యక్తీకరించిన వారిని శిక్షించాలనే, వీలైతే చంపేయాలనే ధోరణి పెరిగిపోతోంది. భారత్‌లో అధికారంలో ఉన్న పార్టీల అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా, ధైర్యంగా విమర్శలు గుప్పించిన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను ఇటీవలే దారుణంగా హతమార్చారు. హేతువాదులు పన్సారే, ఎంఎం కల్బుర్గీ, నరేంద్ర దబోల్కర్లతో పాటు లంకేశ్ హత్యకు దారితీసిన పరిస్థితులు ఒకేలా ఉన్నాయి’ అని తెలిపారు. కంచ ఐలయ్యపై తెలుగుదేశం ఎంపీ టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ..‘లంకేశ్ హత్య జరిగిన కొద్ది రోజుల తర్వాత భారత్‌లో కుల, సామాజిక వ్యవస్థలపై పోరాడుతున్న కంచ ఐలయ్యను బహిరంగంగా ఉరితీయాలని హిందూ మతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు అన్నారు. కేంద్రంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఆ సభ్యుడు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదొక్కటే కాదు ఐలయ్యకు ఇంకా చాలా బెదిరింపులు వచ్చాయి. ఓ సమావేశానికి వెళుతున్న ఆయనపై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలు ఐలయ్యపై ఎంతగా ప్రభావం చూపాయంటే.. ప్రాణ రక్షణ కోసం ఆయన ప్రస్తుతం స్వయం ప్రకటిత గృహనిర్బంధంలో ఉంటున్నారు’ అని ఫ్రాంక్స్ వెల్లడించారు.‘స్పీకర్ గారు.. అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం ఐలయ్య రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తోందని ఈ సందర్భంగా ప్రతినిధుల సభ సాక్షిగా నేను తెలుపుతున్నాను. కంచ ఐలయ్య హక్కులు, వాక్ స్వాతంత్య్రాన్ని హరించకూడదని, ఐలయ్యతో పాటు ఆయన లాంటి వ్యక్తుల ప్రాణాల రక్షణను అత్యంత ప్రాధాన్యత కల్గిన అంశంగా పరిగణించాలని భారత్‌ను కోరుతున్నాం’ అని ఫ్రాంక్స్ పేర్కొన్నారు. -
ట్రంప్ డ్రీమ్ నెరవేరుతుందా..?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కల నెరవేరనున్నట్లు తెలుస్తోంది. మెక్సికోతో తమ దేశానికి ఉన్న సరిహద్దు గుండా నిర్మించాలనుకుంటున్న భారీ ప్రహరీ నిర్మాణం ప్రక్రియ మొదలుకానుంది. అందుకోసం కావాల్సిన డబ్బుకు సంబంధించిన బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ప్రాధాన్యత అంశాల్లో ఈ మెక్సికో గోడనే ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, దీని నిర్మాణం కోసం మెక్సికో కూడా ఖర్చు భరించాల్సి ఉంటుందని అమెరికా చెప్పగా మెక్సికో నిరాకరించింది. దీంతో తామే ఈ నిర్మాణం పూర్తి చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. మొత్తం 827 బిలియన్ల ప్యాకేజీకి సంబంధించిన బిల్లును గురువారం సభలో ప్రవేశపెట్టగా 235మంది ప్రతినిధులు ఉన్న హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో 192మంది ఆమోదించారు. దీంతో ఇందులోని 1.6 బిలియన్ డాలర్లను ప్రత్యేకంగా గోడ నిర్మాణానికే ఖర్చు చేయనున్నారు. అక్రమ వలసలను, మాదక ద్రవ్యాలు అమెరికాలోకి రాకుండా అడ్డుకునేందుకు ఈ ప్రహరీ నిర్మాణం చేయనున్నారు. అయితే, ఈ బిల్లు సెనేట్‌లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. సెనేట్‌లో డెమొక్రాట్లు అధికంగా ఉన్నారు. ఇది చట్ట రూపం దాల్చేందుకు ముందు సెనేట్లు కూడా ఈ బిల్లును ఆమోదించనుంది. -
భారత ఐటీ కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్
భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. హెచ్-1బీ వీసాదారుల కోసం తీసుకొచ్చిన కొత్త వేతన చట్టం కోసం తీసుకొచ్చిన బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో హెచ్-1బీ వీసా దారుల కనీసం వేతనం రెట్టింపు అయింది. లక్షా 30వేల డాలర్లకు వీసా హోల్డర్స్ వేతనం పెంచుతున్నట్టు ఈ వీసా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసాహోల్డర్స్కు 60వేల డాలర్లను మాత్రమే చెల్లిస్తున్నారు. 1989లో రూపొందించిన ఈ చట్టానికి ఇంతవరకు మార్పులు చేపట్టలేదు. అదేవిధంగా అమెరికన్ ఉద్యోగులను విదేశీ వర్కర్లతో భర్తి చేసుకునే సదుపాయంపై కూడా ఆంక్షలు విధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా) ''హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫేర్నెస్ యాక్ట్ 2017''ను కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జో లోఫ్గ్రెన్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. సర్వే లెక్కించిన వేతనానికి 200 శాతం చెల్లించేందుకు సిద్ధమయ్యేలా మార్కెట్‌కు ఆధారితంగా వీసాలు ఇవ్వాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. తక్కువ వేతన కేటగిరీని తీసివేయాలని బిల్లు ప్రతిపాదించింది. హెచ్-1బీ ప్రొగ్రామ్‌పై తమ చట్టం మళ్లీ పునఃసమీక్షిస్తుందని లోఫ్గ్రెన్ చెప్పారు. అమెరికన్ ఉద్యోగులను విదేశీ వర్కర్లతో భర్తి చేసుకునేలా ప్రస్తుతం పలు కంపెనీలు వాడుతున్న వర్క్-వీసీ ప్రొగ్రామ్ ఇక క్లిష్టతరంగా మారనుంది. ఈ కొత్త వేతన చట్టం ద్వారా ఇబ్బడిముబ్బడిగా అమెరికాలోకి వస్తున్న వీసాదారులకు అడ్డుకట్ట వేయనున్నారు. కంపెనీలు స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ప్రతిపాదించారు. ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌ను జారీచేసిన వెంటనే హెచ్-1బీ వీసా హోల్డర్స్‌కు కఠిన నిబంధనలు జారీచేయడం గమనార్హం. -
భారత ఐటీ కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్
-
'భారత్‌లోనే పుట్టాను.. వీడలేని బంధం నాది'
వాషింగ్టన్: భారత్ తనకు చాలా ముఖ్యమైన దేశమని భారతీయ సంతతికి చెందిన మహిళ ప్రమీల జయపాల్ అన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఆమె ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ హౌజ్‌కు ఎన్నికైన తొలి భారతీయ మహిళ కూడా ఆమెనె. ఈ సందర్భంగా ఆమె తొలిసారి భారత్‌తో అమెరికాకు ఉండబోయే సంబంధాల విషయంలో మాట్లాడారు. తాను మహాత్మా గాంధీ జన్మించిన నేలలో జన్మించానని, భారత్‌కు తనకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. భారత్‌కు పేదరికం నుంచి క్లీన్ ఎనర్జీ వరకు అన్ని రకాలుగా అమెరికా మద్దతు ఉంటుందని అన్నారు. 'నేను భారత్ లోనే జన్మించాను. నాకు భారత్ కు చాలా గాఢ సంబంధం ఉంది. మా అమ్మనాన్నలు అక్కడే ఉన్నారు. బెంగళూరులో ఉంటారు. నా కుమారుడు అక్కడే జన్మించాడు. భారత్ కు అమెరికాకు మధ్య ఉంది కేవలం రాజకీయ సంబంధమే కాదు.. చాలా వ్యక్తిగత సంబంధం కూడా' అని ఆమె అన్నారు. చెన్నైలో జన్మించిన ప్రమీల ఐదేళ్లప్పుడే ఇండోనేషియాకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ ఆ తర్వాత పదహారేళ్లకు అమెరికాకు వచ్చారు. ప్స్తుతం ఆమె వాషింగ్టన్ డీసీలో ఉంటున్నారు. -
పాక్‌కు షాకిస్తూ అమెరికా సభ్యుల బిల్లు!
-
పాక్‌కు షాకిస్తూ అమెరికా సభ్యుల బిల్లు!
అమెరికా చట్టసభకు చెందిన ఇద్దరు శక్తిమంతమైన సభ్యులు పాకిస్థాన్‌కు షాకిచ్చేలా ఓ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం(స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం) గా పాకిస్థాన్ని ప్రకటించాలని వారు బిల్లులో కోరారు. ’పాకిస్థాన్ పాల్పడిన వెన్నుపోట్లకుగాను.. మనం ఆ దేశానికిచ్చే నిధులను ఆపివేసి.. దానిని ఉగ్రవాద ప్రాయోజిత రాజ్యంగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ (చట్టసభ) సభ్యుడు, ఉగ్రవాదంపై సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయి ఈ బిల్లులో పేర్కొన్నారు. ఆయన డెమొక్రిటిక్ పార్టీ చట్టసభ సభ్యుడు డెనా రోహ్రాబచర్‌తో కలిసి ’ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్తాన్‌ను గుర్తించే చట్టం’ బిల్లును ప్రవేశపెట్టారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ కమిటీలో కీలక సభ్యుడిగా డెనా రోహ్రాబచర్ ఉన్నారు. ’పాకిస్థాన్ ఒక విశ్వసించలేని మిత్రదేశమే కాదు.. అది ఎన్నో ఏళ్లుగా మన శత్రువుల్ని రెచ్చగొడుతూ వస్తున్నది. ఒసాన్ బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించడం మొదలు.. హక్కానీ నెట్‌వర్క్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం వరకు ఉగ్రవాదంపై యుద్ధంలో పాకిస్థాన్‌కు ఎవరికి అండగా నిలిచిందో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అది అమెరికాకు ఎప్పుడు అండగా నిలబడలేదు’ అని పోయి వివరించారు. ఒబామా సర్కారు తమ బిల్లుపై అధికారికంగా సమాధానం ఇవ్వాల్సి ఉందని ఆయన కోరారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఇచ్చిందా? లేదా? అన్న దానిపై 90 రోజుల్లో అధ్యక్షుడు నివేదిక విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
అమీ బెరాకు ఏఏహెచ్ఓఏ శుభాకాంక్షలు
వాషింగ్టన్: యూఎస్ చట్టసభకు మరోసారి ఎన్నికైన ఇండియన్ అమెరికన్ అమీ బెరాకు ఆసియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ (ఏఏహెచ్ఓఏ) శుభాకాంక్షలు తెలిపింది. అమీ బెరాకు మద్దతు ఇస్తున్నందుకు తామంతా గర్విస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ఏఏహెచ్ఓఏ ఛైర్మన్ ప్రతీక పటేల్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. యూఎస్ చట్టసభకు ఎన్నికైనా అమీ బెరా ఏఏహెచ్ఓఏలో సభ్యుడని ఆమె గుర్తు చేశారు. ఆయనతో పని చేస్తూ అతిథ్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని తెలిపారు. దాదాపు పక్షం రోజుల క్రితం జరిగిన కాలిఫోర్నియాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమీబెరా గెలుపొందారు. 2012లో అమీబెరా యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్‌కు ఎన్నికయ్యారు. యూఎస్ చట్టసభకు ఎన్నికైన మూడో ఇండియన్ అమెరికన్‌గా అమీబెరా చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు బాబీ జిందాల్, దలిప్ సింగ్ సంద్లు ఎన్నికయ్యారు. -
అమెరికా ప్రతినిధుల సభలో భారత సంతతి సభ్యుడు
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ సంతతికి చెందిన ఏకైక సభ్యుడు అమిరేష్ 'అమీ' బెరా తాజా ఎన్నికలలో కూడా తన స్థానాన్ని నిలుపుకున్నారు. రెండువారాల కిందట జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసిన అమీ బెరా తొలుత తన ప్రత్యర్థి రిపబ్లిక్ పార్టీకి చెందిన డౌగ్ ఓసే కంటే 3వేల ఓట్లు వెనుకబడ్డారు. మిగిలిన ఓట్లన్నీ లెక్కించేసరికి 1,432 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2012లో కూడా అమీ బెరా గెలిచారు. ఈసారి హోరా హోరీగా జరిగిన ఎన్నికలలో మరోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించిన అమీ బెరాకు ప్రత్యర్థి డౌగ్ ఓసే అభినందనలు తెలిపారు. **