భారత ఐటీ కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్ | Setback for Indian firms: H-1B reform bill introduced in US House of Representatives | Sakshi
Sakshi News home page

భారత ఐటీ కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్

Published Tue, Jan 31 2017 1:37 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM

భారత ఐటీ కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్ - Sakshi

భారత ఐటీ కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్

భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. హెచ్-1బీ వీసాదారుల కోసం తీసుకొచ్చిన కొత్త వేతన చట్టం కోసం తీసుకొచ్చిన బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో హెచ్-1బీ వీసా దారుల కనీసం వేతనం రెట్టింపు అయింది. లక్షా 30వేల డాలర్లకు వీసా హోల్డర్స్ వేతనం పెంచుతున్నట్టు ఈ వీసా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసాహోల్డర్స్కు 60వేల డాలర్లను మాత్రమే చెల్లిస్తున్నారు. 1989లో రూపొందించిన ఈ చట్టానికి ఇంతవరకు మార్పులు చేపట్టలేదు. అదేవిధంగా అమెరికన్ ఉద్యోగులను విదేశీ వర్కర్లతో భర్తి చేసుకునే సదుపాయంపై కూడా ఆంక్షలు విధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. 
 

దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి

(అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..)

(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌)

(ట్రంప్‌ ‘నిషేధం’: ఐసిస్‌ విజయోత్సవాలు)

(ట్రంప్‌ చెప్పింది పచ్చి అబద్ధం!)

(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)

(ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?)

(ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!)

(ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!)

(వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)

 
''హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫేర్నెస్ యాక్ట్ 2017''ను కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు  జో లోఫ్గ్రెన్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు.  సర్వే లెక్కించిన వేతనానికి 200 శాతం చెల్లించేందుకు సిద్ధమయ్యేలా మార్కెట్కు ఆధారితంగా వీసాలు ఇవ్వాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. తక్కువ వేతన కేటగిరీని తీసివేయాలని బిల్లు ప్రతిపాదించింది. హెచ్-1బీ ప్రొగ్రామ్పై తమ చట్టం మళ్లీ పునఃసమీక్షిస్తుందని లోఫ్గ్రెన్ చెప్పారు. అమెరికన్ ఉద్యోగులను విదేశీ వర్కర్లతో భర్తి చేసుకునేలా ప్రస్తుతం పలు కంపెనీలు వాడుతున్న వర్క్-వీసీ ప్రొగ్రామ్ ఇక క్లిష్టతరంగా మారనుంది. ఈ కొత్త వేతన చట్టం ద్వారా ఇబ్బడిముబ్బడిగా అమెరికాలోకి వస్తున్న వీసాదారులకు అడ్డుకట్ట వేయనున్నారు. కంపెనీలు స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ప్రతిపాదించారు.  ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ను జారీచేసిన వెంటనే హెచ్-1బీ వీసా హోల్డర్స్కు కఠిన నిబంధనలు జారీచేయడం గమనార్హం. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement