హెచ్-1బీ సవరణ బిల్లుకు ట్రంప్ మద్దతు | US lawmaker says Trump backing H-1B reforms bill that will hurt Indian IT firms | Sakshi
Sakshi News home page

హెచ్-1బీ సవరణ బిల్లుకు ట్రంప్ మద్దతు

Published Tue, Mar 28 2017 8:26 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

హెచ్-1బీ సవరణ బిల్లుకు ట్రంప్ మద్దతు - Sakshi

హెచ్-1బీ సవరణ బిల్లుకు ట్రంప్ మద్దతు

వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకురావడానికి తీసుకొస్తున్న హెచ్-1బీ సవరణ బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుగా నిలిచారట. ఈ విషయాన్ని సీనియర్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు డారెల్ ఇస్సా తెలిపారు. హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు కనీస వేతనం రెట్టింపు చేయాలని ప్రతిపాదిస్తూ  హెచ్-1బీ సవరణ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణ బిల్లుతో ప్రతిభావంతులైన వారు మాత్రమే అమెరికాలోకి రావడానికి వీలుంటుందని, హెచ్-1బీ వీసా సిస్టమ్ లో దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని డారెల్ పేర్కొన్నారు.'' ప్రెసిడెంట్ ఈ బిల్లును సపోర్టు చేస్తున్నారు. సెనేట్ నుంచి కూడా దీనికి బలమైన మద్దతు ఉంది'' అని డారెల్ క్యాపిటోల్ విజిటర్ సెంటర్ వద్ద అట్లాంటికా కౌన్సిల్ ఈవెంట్లో చెప్పారు. 
 
ఒకవేళ ఈ బిల్లు కనుక చట్టంగా రూపం దాలిస్తే అమెరికాలో పనిచేసే భారత ఐటీ కంపెనీలకు, ఇతర కన్సల్టెన్సీకి భారీగా దెబ్బకొట్టనుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ లో ఐటీ కంపెనీల ఆగడాలకు చెక్ పెడుతూ.. వీసా నిబంధనలను కఠినతరం చేయడానికి ఈ బిల్లును ప్రతిపాదించామని డారెల్ చెప్పారు. హెచ్-1బీ వీసా సిస్టమ్ ను భారత కంపెనీలు ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నాయని మండిపడ్డారు.  డెమొక్రాటిక్ చట్టసభ్యుడు స్కాట్ పీటర్స్ తో కలిసి డారెల్, హెచ్-1బీ వీసా సవరణ బిల్లును ప్రతిపాదించారు. ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్ పేరుతో దీన్ని తీసుకొచ్చారు. దీనికింద హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు ప్రస్తుతమున్న 60వేల డాలర్ల వేతనాన్ని లక్ష డాలర్లకు పెంచాలని ఆ చట్టసభ్యులు ప్రతిపాదించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement