Indian IT firms
-
5 ఐటీ కంపెనీలు.. 3 నెలలు.. 2587 మంది టెకీలు..
దేశ ఐటీ రంగం (IT sector) ఆటోమేషన్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ద్వారా పరివర్తన చెందుతోంది. గతంలో సాంప్రదాయకంగా శ్రామికశక్తి విస్తరణపై దృష్టి సారించిన ఐటీ పరిశ్రమ ఇప్పుడు తక్కువ నుండి మధ్యస్థ సంక్లిష్టత కలిగిన పనులను ఆటోమేట్ చేస్తోంది. ఫలితంగా నియామక విధానాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి.2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి.మార్చి త్రైమాసికంలోనూ ఇదే ట్రెండ్ఇలాంటి ట్రెండ్ 2024 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలోనూ కనిపించింది. ఐటీ సంస్థలు సమిష్టిగా 12,600 ఉద్యోగాలను తగ్గించాయి. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 60,000 మంది ఉద్యోగులను జోడించిన క్రమంలో వెంటనే ఈ స్థాయిలో ఉద్యోగులు తగ్గడం గమనార్హం.గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC) ద్వారా వృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో 2025 ఆర్థిక ఏడాదిలో ఐటీ రంగం గత ఆర్థిక సంవత్సరం శ్రామికశక్తిలో నాలుగింట ఒక వంతు కంటే తక్కువగానే జతవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్క్‌ఫోర్స్ జోడింపులో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు వరుసగా రెండవ సంవత్సరం కూడా సాంప్రదాయ ఐటీ సంస్థలను అధిగమిస్తాయని భావిస్తున్నారు.కోవిడ్ మహమ్మారి సమయంలో ఐటీ పరిశ్రమ దూకుడుగా నియామకాలు చేపట్టిందని, ఫలితంగా వర్క్‌ఫోర్స్ అధికంగా పోగుపడిందని ఎవరెస్ట్ గ్రూప్‌కు చెందిన పీటర్ బెండోర్-శామ్యూల్ చెబుతున్నారు. కంపెనీలు నియామకాలను తగ్గించడం, రీబ్యాలెన్స్ కోసం అట్రిషన్‌ను అనుమతించడం వలన ఉత్పాదకత లాభాలు కొంత ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రాబడి వృద్ధి ఇకపై కేవలం హెడ్‌కౌంట్‌ను పెంచడంపై ఆధారపడి ఉండదని, నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌తో అధిక బిల్లింగ్ రేట్లను పెంచుతుందని హెచ్‌సీఎల్‌టెక్ సీఈవో పేర్కొన్నారు.అమెరికా ఐటీలో అనిశ్చితిఅమెరికాలో వచ్చిన కొత్త పరిపాలనలో హెచ్ వన్ బీ (H1B) వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలతో సహా ఇమ్మిగ్రేషన్ విధానాలు మారవచ్చు కాబట్టి యూఎస్‌లోని భారతీయ ఐటీ నిపుణులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది నిపుణులు యూరప్ వంటి దేశాల్లో అవకాశాలను అన్వేషిస్తున్నారు. అనిశ్చితి ఉన్నప్పటికీ నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలు ప్రయత్నిస్తాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. -
ఇండియన్స్‌కు బదులుగా కెనడా, మెక్సికన్లు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీయులకు వీసాలనిచ్చే నిబంధనలను కఠినతరం చేయడం భారతీయ ఐటీ కంపెనీలకు కాక పుట్టిస్తోంది. ఫలితంగా భారతీయ ఐటీ నిపుణుల కొరత ఏర్పడడంతో ఆ కంపెనీలన్నీ అమెరికాకు ఇరుగుపొరుగునున్న మెక్సికో, కెనడా నుంచి టీఎన్ వీసాలపై నిపుణులను తెప్పించుకుంటున్నారు. హెచ్–1బీ వీసాల్లాగా టీఎన్ వీసాలకు దరఖాస్తు సమయం ఉండదు, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదికింత కోటా అంటూ పరిమితి ఏమీ ఉండదు. పైగా దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం, ఖర్ఛు చాలా తక్కువ. ఎప్పటిప్పుడు వీసా గడువును పొడిగించుకోవచ్చు. గతేడాదితో పోలిస్తే అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలు మెక్సికో, కెనడాల నుంచి ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకున్నాయి. ఈ కంపెనీలు గతేడాదికన్నా ఈ ఏడాది సబ్ కాంట్రాక్టులపై కూడా ఎక్కువ ఖర్చు పెట్టాయి. స్థానికంగా అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ట్రంప్ భారతీయుల వీసాలను టైట్ చేస్తే, ఐటీ కంపెనీలు ఆయన లక్ష్యంగాని విరుద్ధంగా అమెరికా ఇరుగు పొరుగు దేశాల వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని ‘కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసర్చ్’ ఓ అధ్యయనంలో తెలిపింది. కొన్ని కంపెనీలు మెక్సికోలో తమ యూనిట్‌ను పెట్టుకుంటూ సమన్వయంతో పనిచేయించుకుంటున్నాయి. ఇప్పటికే మెక్సికో యూనిట్లో తమకు 500 మంది ఉద్యోగులు ఉన్నారని, అవసరమైనప్పుడు వారిని అమెరికాకు బదిలీపై రప్పించుకుంటామని ‘హెక్సావేర్’ ఓ మోస్తారు ఐటీ సంస్థ సీఈవో శ్రీకృష్ణ తెలిపారు. గతేడాదితో పోలిస్తే హెక్సావేర్తోపాటు విప్రో, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, టీసీఎస్, మైండ్‌ట్రీ సంస్థలన్నీ ఎక్కువగా బయటకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చాయి. స్థానికంగా అమెరికన్లను ఎందుకు ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే, ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు అమెరికన్లు బాగానే పనికొస్తారని, బాగా మేథస్సును ఉపయోగించాల్సిన మధ్య స్థాయిలో, ప్రాజెక్టును విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించే ఉన్నత స్థాయి ఉద్యోగులకు వారంతా పనికి రారని దాదాపు అన్ని కంపెనీలు చెబుతున్నాయి. ఎక్కువ డబ్బులిచ్చి కింద స్థాయిలోనే అమెరికన్లను తీసుకుంటే పైస్థాయి ఉద్యోగులు గొడవ పెట్టే అవకాశాలు ఉన్నాయని కంపెనీలు భయపడుతున్నాయి. ప్రస్తుతానికి మధ్యేమార్గంగా మెక్సికో, కెనడా ఉద్యోగులు ఉపయోగపడుతున్నారని, భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలని కంపెనీల వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
'ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోత'
న్యూఢిల్లీ : దేశీయ ఐటీ సంస్థల్లో గుబేలు రేపుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసేశారు. హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ 'హైర్ అమెరికన్, బై అమెరికన్' పేరుతో తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమల్లోకి తెచ్చారు.. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులతో ఇక ఎవరు పడితే వారు అమెరికా వెళ్లడానికి వీలు లేకుండా.. ఉద్యోగుల కట్టడి నెలకొంటోంది. ఈ ప్రభావం దేశీయ ఐటీ కంపెనీలపై తీవ్రంగా చూపనున్నట్టు తెలుస్తోంది. వ్యయాల భారంతో పాటు ఉద్యోగులపై వేటు కూడా పడనుందని అసోచామ్ పేపర్ బుధవారం నివేదించింది. పెరుగుతున్న రూపాయి కూడా ఎక్స్పోర్ట్ టెక్నాలజీ సంస్థల మధ్య పరిస్థితిని మరింత అతలాకుతలం చేస్తుందని పేర్కొంది. అమెరికా నుంచి వచ్చే రెమిటెన్స్‌లు కూడా తగ్గనున్నాయని అసోచామ్ తెలిపింది. ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్‌ను దెబ్బతీయనుందని చెప్పింది. వరల్డ్ బ్యాంకు డేటా ప్రకారం రెమిటెన్స్‌లో అమెరికా భారత్‌కు రెండో అతిపెద్ద దేశంగా ఉంది. దాని తర్వాత సౌదీ అరేబియా నుంచి ఎక్కువ రెమిటెన్స్‌లు వస్తున్నాయి. తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఐటీ సంస్థలు తమ వర్క్‌ఫోర్స్‌ను బలవంతంగా వేరువేరు ప్రాంతాలకు తరలించనున్నారని, కంపెనీల ఖర్చులు, రూపాయి విలువ పెరగడం కంపెనీలకు తక్కువ గుర్తింపు తెచ్చిపెడుతుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. ఇది ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. హెచ్-1బీ వీసాల్లో కఠినతరమైన నిబంధనలు భారత్ లో ఐటీ దిగ్గజాల నియామకాల్లో, వేతనాల్లో, ఉద్యోగాల్లో కూడా మార్పులు తేనుందని అసోచామ్ నివేదించింది. -
హెచ్-1బీ సవరణ బిల్లుకు ట్రంప్ మద్దతు
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకురావడానికి తీసుకొస్తున్న హెచ్-1బీ సవరణ బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుగా నిలిచారట. ఈ విషయాన్ని సీనియర్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు డారెల్ ఇస్సా తెలిపారు. హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు కనీస వేతనం రెట్టింపు చేయాలని ప్రతిపాదిస్తూ హెచ్-1బీ సవరణ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణ బిల్లుతో ప్రతిభావంతులైన వారు మాత్రమే అమెరికాలోకి రావడానికి వీలుంటుందని, హెచ్-1బీ వీసా సిస్టమ్ లో దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని డారెల్ పేర్కొన్నారు.'' ప్రెసిడెంట్ ఈ బిల్లును సపోర్టు చేస్తున్నారు. సెనేట్ నుంచి కూడా దీనికి బలమైన మద్దతు ఉంది'' అని డారెల్ క్యాపిటోల్ విజిటర్ సెంటర్ వద్ద అట్లాంటికా కౌన్సిల్ ఈవెంట్లో చెప్పారు. ఒకవేళ ఈ బిల్లు కనుక చట్టంగా రూపం దాలిస్తే అమెరికాలో పనిచేసే భారత ఐటీ కంపెనీలకు, ఇతర కన్సల్టెన్సీకి భారీగా దెబ్బకొట్టనుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ లో ఐటీ కంపెనీల ఆగడాలకు చెక్ పెడుతూ.. వీసా నిబంధనలను కఠినతరం చేయడానికి ఈ బిల్లును ప్రతిపాదించామని డారెల్ చెప్పారు. హెచ్-1బీ వీసా సిస్టమ్ ను భారత కంపెనీలు ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నాయని మండిపడ్డారు. డెమొక్రాటిక్ చట్టసభ్యుడు స్కాట్ పీటర్స్ తో కలిసి డారెల్, హెచ్-1బీ వీసా సవరణ బిల్లును ప్రతిపాదించారు. ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్ పేరుతో దీన్ని తీసుకొచ్చారు. దీనికింద హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు ప్రస్తుతమున్న 60వేల డాలర్ల వేతనాన్ని లక్ష డాలర్లకు పెంచాలని ఆ చట్టసభ్యులు ప్రతిపాదించారు. -
హెచ్-1బీ వీసా వాడకం ఆపేయండి
న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసా చట్ట సవరణ రూపంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురుకాబోతున్న ముప్పుకు భారత ఐటీ దిగ్గజాలన్నీ గజగజలాడుతున్న సంగతి తెలిసిందే. హెచ్-1బీ వీసా భయంతో దేశీయ మార్కెట్లో కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి దేశీయ ఐటీ కంపెనీలకు పలు సూచనలు చేశారు. దేశీయ కంపెనీలు మరింత బహుళ సాంస్కృతికి అలవాటు పడాల్సిన అవసరం ఉందని, హెచ్-1బీ వీసాల వాడకం ఆపేయాలని సూచించారు. సర్వీసులను అందించడానికి ఇక్కడి నుంచి భారీగా భారతీయులను విదేశాలకు తరలించడం కూడా ఆపేయాలన్నారు. స్థానిక ఉద్యోగుల నియామకంపై దృష్టిసారిస్తే ఇలాంటి ముప్పుల నుంచి బయటపడొచ్చన్నారు. విదేశీ వర్కర్లపై కఠిన ఆదేశాలు విధించేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న ప్రతిపాదనలు నేపథ్యంలో ఓ ఇంగ్లీష్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణమూర్తి కంపెనీలకు ఈ సూచనలు చేశారు. ''అమెరికాలో అమెరికా నివాసితులనే తీసుకోవాలి, కెనడాలో కెనడియన్లను, బ్రిటిష్‌లో బ్రిటైన్ వారిని నియమించుకోవాలి. అలా చేస్తేనే మనం నిజమైన బహుళ జాతీయ కంపెనీలగా పేరులోకి వస్తాం. హెచ్-1బీ వీసాల వాడకం తగ్గించేయండి. భారీగా భారతీయులను ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం కూడా ఆపండి'' అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వస్తే, మన కంపెనీలు మరింత బహుళ సాంస్కృతిక కంపెనీలుగా పేరులోకి రావడానికి ఎంతో సహకరించనున్నాయని చెప్పారు. బహుళ-సాంస్కృతిలా మారడం అంతా సులభం కాదు.. మన కంపెనీల ఆలోచనలు అందుకే ఎప్పుడూ సాఫ్ట్‌గా ఉంటాయని పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే ఈ నిర్ణయానికి కంపెనీలు ఎందుకు అంతలా భయపడుతున్నాయనే ప్రశ్నకు నారాయణమూర్తి ఈ మేరకు సమాధానమిచ్చారు. -
భారత ఐటీ కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్
భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. హెచ్-1బీ వీసాదారుల కోసం తీసుకొచ్చిన కొత్త వేతన చట్టం కోసం తీసుకొచ్చిన బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో హెచ్-1బీ వీసా దారుల కనీసం వేతనం రెట్టింపు అయింది. లక్షా 30వేల డాలర్లకు వీసా హోల్డర్స్ వేతనం పెంచుతున్నట్టు ఈ వీసా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసాహోల్డర్స్కు 60వేల డాలర్లను మాత్రమే చెల్లిస్తున్నారు. 1989లో రూపొందించిన ఈ చట్టానికి ఇంతవరకు మార్పులు చేపట్టలేదు. అదేవిధంగా అమెరికన్ ఉద్యోగులను విదేశీ వర్కర్లతో భర్తి చేసుకునే సదుపాయంపై కూడా ఆంక్షలు విధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా) ''హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫేర్నెస్ యాక్ట్ 2017''ను కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జో లోఫ్గ్రెన్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. సర్వే లెక్కించిన వేతనానికి 200 శాతం చెల్లించేందుకు సిద్ధమయ్యేలా మార్కెట్‌కు ఆధారితంగా వీసాలు ఇవ్వాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. తక్కువ వేతన కేటగిరీని తీసివేయాలని బిల్లు ప్రతిపాదించింది. హెచ్-1బీ ప్రొగ్రామ్‌పై తమ చట్టం మళ్లీ పునఃసమీక్షిస్తుందని లోఫ్గ్రెన్ చెప్పారు. అమెరికన్ ఉద్యోగులను విదేశీ వర్కర్లతో భర్తి చేసుకునేలా ప్రస్తుతం పలు కంపెనీలు వాడుతున్న వర్క్-వీసీ ప్రొగ్రామ్ ఇక క్లిష్టతరంగా మారనుంది. ఈ కొత్త వేతన చట్టం ద్వారా ఇబ్బడిముబ్బడిగా అమెరికాలోకి వస్తున్న వీసాదారులకు అడ్డుకట్ట వేయనున్నారు. కంపెనీలు స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ప్రతిపాదించారు. ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌ను జారీచేసిన వెంటనే హెచ్-1బీ వీసా హోల్డర్స్‌కు కఠిన నిబంధనలు జారీచేయడం గమనార్హం. -
భారత ఐటీ కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్
-
ఐటీ కంపెనీలకు భారీ షాక్
వాషింగ్టన్: హెచ్ 1 బీ,ఎల్ 1 వీసాలపై అత్యధిక ఆదాయన్ని పొందుతున్న భారతీయ ఐటీ కంపెనీలు, దేశ ఐటి నిపుణుల గుండెల్లో గుబులు మొదలైంది. భారత ఐటీ కంపెనీలను నిరోధించడానికి ఉద్దేశించిన '2016 హెచ్-1బీ, ఎల్ 1 వీసా సంస్కరణ చట్టం' బిల్లును సంయుక్త చట్టసభ సభ్యుల ద్వైపాక్షిక సమూహం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. ఈ వీసాలను నియంత్రించే యాంటి వీసా బిల్లును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదముద్ర పడాలంటే ఈ బిల్లును సెనెట్ ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార, విపక్ష సభ్యులు హెచ్ 1 బీ, ఎల్ 1 సంస్కరణల బిల్లును సంయుక్తంగా ప్రవేశపెట్టారు. కాలిఫోర్నియా, న్యూ జెర్సీ రాష్ట్రాలకు చెందిన డెమొక్రాటిక్ పార్టీ నుంచి బిల్ పాస్ర్కెల్, రిపబ్లికన్ సభ్యుడు డానా రోహ్రా బాచెర్ ఈ బిల్లును ప్రతిపాదించారు. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్న హెచ్-1బీ, ఎల్ 1 వీసాల విధానాన్ని కఠినతరం చేయాలంటూ యూఎస్ కాంగ్రెస్ లోఈ బిల్లును ప్రవేశపెట్టారు. విదేశీ అవుట్సోర్సింగ్ కంపెనీల ఉద్యోగులే టాప్ వినియోగదారులుగా ఉన్నారని కాంగ్రెస్ కార్యాలయం విడుదల చేసిన ఒక మీడియా ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. వీసా జారీ ప్రక్రియలోని లోపాలను సవరించాలని సెనేట్ సభ్యులు డిమాండ్ చేశారు. తద్వారా అమెరికా ఉన్నోతోద్యోగులకు, వీసా హోల్డర్ల హక్కులను కాపాడాలని కోరుతున్నారు. విదేశీ ఉద్యోగులను ఎన్నుకునేటపుడు మరింత పారదర్శకంగా వ్యవహారించాలన్నారు. తద్వారా దుర్వినియెగాన్ని అడ్డుకోవాలని, వీసా నిబంధలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ సాంకేతిక నిపుణులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. తక్కువ వేతనాలకే పనిచేయడానికి ఇతర దేశాల నుంచి వస్తున్నవారితో అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారని వీరు ఆరోపించారు. ఈ కొత్త బిల్లు ప్రకారం- ఏదైనా కంపెనీ తమ ఉద్యోగుల్లో 50 కంటే ఎక్కువ మందిని, లేదంటే మొత్తం ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువ మందిని హెచ్-1బి, లేదా ఎల్-1 వీసాదారులతో భర్తీ చేసుకోవడం కుదరదు. పెద్దఎత్తున విదేశీ కార్మికుల్ని అమెరికాకు దిగుమతి చేసుకుని, స్వల్పకాలిక శిక్షణను ఇచ్చి, ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపించి అక్కడి నుంచే పనిచేసేలా చూసే కంపెనీలపై కొత్త నిబంధనలు కొరడా ఝళిపించనున్నాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బి వీసా కార్యక్రమంలో సంస్కరణలు తీసుకువచ్చి, వేతన పరిమితుల్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా 2010లో మొదటిసారి అమెరికా వీరువురు సెనేట్‌లో ప్రవేశపెట్టారు. కానీ అపుడు ఆమోదం లభించలేదు. -
ఇక లాటరీ ద్వారా హెచ్1బీ వీసా..
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కోసం అమెరికా మంజూరు చేసే హెచ్ 1బీ వీసాలకు పోటీ పెరిగింది. ద్రవ్యోల్భణంతో ఆర్థిక ప్రగతి మందగించి తిరిగి 2011లో పుంజుకున్న తర్వాత అమెరికాలోని సంస్థల్లో పనిచేయాలని నైపుణ్యం ఉన్న ఉద్యోగుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఏటా ఈ వీసాల కోసం ఎక్కువగా భారత్ నుంచే దరఖాస్తులు వస్తుంటాయి. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత ఐటీ సంస్థలు భారత్ నుంచి నిపుణులను రప్పించుకోవడానికి, భారత్‌లో క్యాంపస్‌లు నెలకొల్పే బహుళజాతి సంస్థలు అక్కడి తమ సిబ్బందిని అమెరికాలోని ఆఫీసులకు తీసుకువచ్చేందుకు ప్రధానంగా ఈ వీసాల కోసం దరఖాస్తులు చేస్తుంటాయి. అయితే దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండటంతో కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారికి వీసాలు మంజూరు చేయనున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది. అయితే దరఖాస్తుల పరిశీలనకు సమయం పడుతుందని, అందువల్ల డ్రా ఎప్పుడు నిర్వహించేదీ ఇప్పుడే వెల్లడించలేకపోతున్నామని పేర్కొంది. అంటే నైపుణ్యంతోపాటూ అశావహులకు కూడా అదృష్టం ఉండాలన్నమాట. ఇంతకు ముందు(గత ఆర్థిక ఏడాదికి గానూ) మంజూరు చేసిన హెచ్1-బీ వీసాలకు మూడు రేట్ల దరఖాస్తులు అందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85 వేల హెచ్1బీ వీసాలను మంజూరు చేయాలని అమెరికా నిర్ణయించింది. వీటికి భారీగా దరఖాస్తులు వచ్చినట్లు ఇమిగ్రేషన్ విభాగం వెల్లడించింది. వీరిలో అమెరికాలోనే ఉన్నత విద్య చదువుకున్నవారికి 20,000 హెచ్1బీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. -
హెచ్1బీ వీసాలకు 2.5 లక్షల దరఖాస్తులు
ఇచ్చేవి 65 వేలు.. డ్రా ద్వారా త్వరలో ఎంపిక వాషింగ్టన్: అమెరికాలోని సంస్థల్లో పనిచేసేందుకు విదేశీ నిపుణులకిచ్చే హెచ్1బీ వీసాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం తెలిపింది. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత ఐటీ సంస్థలు భారత్ నుంచి నిపుణులను రప్పించుకోవడానికి, భారత్‌లో క్యాంపస్‌లు నెలకొల్పే బహుళజాతి సంస్థలు అక్కడి తమ సిబ్బందిని అమెరికాలోని ఆఫీసులకు తీసుకువచ్చేందుకు ప్రధానంగా ఈ వీసాల కోసం దరఖాస్తు చేస్తుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65 వేల హెచ్1బీ వీసాలను మంజూరు చేయాలని అమెరికా నిర్ణయించగా, ఇప్పటివరకు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఇమిగ్రేషన్ విభాగం వెల్లడించింది. అమెరికాలోనే ఉన్నత విద్య చదువుకున్నవారికి ఇచ్చే 20,000 హెచ్1బీల కోసం అంతకు రెండింతలమంది దరఖాస్తు చేసుకున్నారంది. వీటన్నింటిలో అర్హమైన వాటిని ఎంపిక చేసి, కంప్యూటరైజ్డ్ డ్రాలో ఎంపికైనవారికి త్వరలో వీసాలు మంజూరు చేస్తామని తెలిపింది. అయితే దరఖాస్తుల పరిశీలనకు సమయం పడుతుందని, అందువల్ల డ్రా ఎప్పుడు నిర్వహించేదీ ఇప్పుడే వెల్లడించలేకపోతున్నామని పేర్కొంది.