వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కోసం అమెరికా మంజూరు చేసే హెచ్ 1బీ వీసాలకు పోటీ పెరిగింది. ద్రవ్యోల్భణంతో ఆర్థిక ప్రగతి మందగించి తిరిగి 2011లో పుంజుకున్న తర్వాత అమెరికాలోని సంస్థల్లో పనిచేయాలని నైపుణ్యం ఉన్న ఉద్యోగుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఏటా ఈ వీసాల కోసం ఎక్కువగా భారత్ నుంచే దరఖాస్తులు వస్తుంటాయి. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత ఐటీ సంస్థలు భారత్ నుంచి నిపుణులను రప్పించుకోవడానికి, భారత్‌లో క్యాంపస్‌లు నెలకొల్పే బహుళజాతి సంస్థలు అక్కడి తమ సిబ్బందిని అమెరికాలోని ఆఫీసులకు తీసుకువచ్చేందుకు ప్రధానంగా ఈ వీసాల కోసం దరఖాస్తులు చేస్తుంటాయి.
అయితే దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండటంతో కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారికి వీసాలు మంజూరు చేయనున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) తెలిపింది. అయితే దరఖాస్తుల పరిశీలనకు సమయం పడుతుందని, అందువల్ల డ్రా ఎప్పుడు నిర్వహించేదీ ఇప్పుడే వెల్లడించలేకపోతున్నామని పేర్కొంది. అంటే నైపుణ్యంతోపాటూ అశావహులకు కూడా అదృష్టం ఉండాలన్నమాట. ఇంతకు ముందు(గత ఆర్థిక ఏడాదికి గానూ) మంజూరు చేసిన హెచ్1-బీ వీసాలకు మూడు రేట్ల దరఖాస్తులు అందాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85 వేల హెచ్1బీ వీసాలను మంజూరు చేయాలని అమెరికా నిర్ణయించింది. వీటికి భారీగా దరఖాస్తులు వచ్చినట్లు ఇమిగ్రేషన్ విభాగం వెల్లడించింది. వీరిలో అమెరికాలోనే ఉన్నత విద్య చదువుకున్నవారికి 20,000 హెచ్1బీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇక లాటరీ ద్వారా హెచ్1బీ వీసా..
Published Sat, Apr 9 2016 2:23 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM
Advertisement
Advertisement