అమీ బెరాకు ఏఏహెచ్ఓఏ శుభాకాంక్షలు | AAHOA congratulates Bera on re-election to US Congress | Sakshi
Sakshi News home page

అమీ బెరాకు ఏఏహెచ్ఓఏ శుభాకాంక్షలు

Published Sat, Nov 22 2014 11:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

అమీ బెరాకు ఏఏహెచ్ఓఏ శుభాకాంక్షలు

అమీ బెరాకు ఏఏహెచ్ఓఏ శుభాకాంక్షలు

వాషింగ్టన్: యూఎస్ చట్టసభకు మరోసారి ఎన్నికైన ఇండియన్ అమెరికన్ అమీ బెరాకు ఆసియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ (ఏఏహెచ్ఓఏ)  శుభాకాంక్షలు తెలిపింది. అమీ బెరాకు మద్దతు ఇస్తున్నందుకు తామంతా గర్విస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ఏఏహెచ్ఓఏ ఛైర్మన్ ప్రతీక పటేల్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. యూఎస్ చట్టసభకు ఎన్నికైనా అమీ బెరా ఏఏహెచ్ఓఏలో సభ్యుడని ఆమె గుర్తు చేశారు.

ఆయనతో పని చేస్తూ అతిథ్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని తెలిపారు.  దాదాపు పక్షం రోజుల క్రితం జరిగిన కాలిఫోర్నియాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమీబెరా గెలుపొందారు. 2012లో అమీబెరా యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్కు ఎన్నికయ్యారు. యూఎస్ చట్టసభకు ఎన్నికైన మూడో ఇండియన్ అమెరికన్గా అమీబెరా చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు బాబీ జిందాల్, దలిప్ సింగ్ సంద్లు ఎన్నికయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement