
కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ స్పష్టికరణ
‘అమెరికా స్వర్ణయుగం’ ఇప్పుడే మొదలైంది
మా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించే దేశాలను వదిలిపెట్టం
వచ్చే నెల 2 నుంచి ఆయా దేశాలపై టారిఫ్‌ల మోత తప్పదు
పనామా కాలువ, గ్రీన్‌లాండ్‌ను స్వా«దీనం చేసుకుంటాం
శాంతిని కోరుకుంటున్నట్లు రష్యా నుంచి సంకేతాలు అందాయి
శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నానని జెలెన్‌స్కీ లేఖ రాశారు
మతిలేని యుద్ధాన్ని ఆపేయాల్సిన సమయం ఇదే..
కాంగ్రెస్‌లో అమెరికా అధ్యక్షుడి 100 నిమిషాల రికార్డు ప్రసంగం
వాషింగ్టన్: ‘అమెరికా స్వర్ణయుగం’ ఇప్పుడే మొదలైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అని ఉద్ఘాటించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తోందని స్పష్టంచేశారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చబోతున్నామని చెప్పారు. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళవారం రాత్రి అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ మొదటిసారిగా మాట్లాడారు. ఏకంగా ఒక గంట 40 నిమిషాలకుపైగా ప్రసంగించి సరికొత్త రికార్డు సృష్టించారు.
తొలి జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్‌లో గానీ, తొలి స్టేట్ ఆఫ్ ద యూనియన్ స్పీచ్‌లో గానీ అధ్యక్షుడు 100 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడడం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం. ఇప్పటిదాకా బిల్ క్లింటన్ పేరిట ఉన్న రికార్డును ట్రంప్ తిరగరాశారు. 2000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ స్టేట్ ఆఫ్ ద యూనియన్ స్పీచ్‌లో ఒక గంట 28 నిమిషాల 49 సెకండ్ల పాటు ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్ తన తాజా ప్రసంగంలో పలు కీలక అంశాలపై స్పందించారు. సరిహద్దు భద్రత, టారిఫ్‌లు, రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందం, ఇంధన భద్రత, ధరల పెరుగుదల, అక్రమ వలసలు తదితర అంశాలపై తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. పనామా కాలువను స్వా«దీనం చేసుకుంటామని, గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ సాధిస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
ప్రతి దేశం మమ్మల్ని దగా చేస్తోంది
‘‘ఇండియాతోపాటు ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధికంగా సుంకాలు విధిస్తున్నాయి. ఇలా చేయడం ముమ్మాటికీ అన్యాయమే. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడా తదితర దేశాల టారిఫ్‌ల గురించి విన్నారా? ఇండియాలో అయితే అటో టారిఫ్‌లు 100 శాతానికి పైగా విధిస్తున్నారు. చాలాదేశాలు దశాబ్దాలుగా మా ఉత్పత్తులపై సుంకాల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు సుంకాల మోత మోగిస్తున్నాయి. ఈ భూగోళంపై ఉన్న దాదాపు ప్రతి దేశం మమ్మల్ని దగా చేస్తోంది.
ఇకపై ఈ దోపిడీ సాగడానికి వీల్లేదు. ఇప్పుడు మా వంతు వచి్చంది. మా ఉత్పత్తులపై సుంకాలు విధించే దేశాల ఉత్పత్తులపై మేము కూడా అదే స్థాయిలో సుంకాలు వసూలు చేస్తాం. వచ్చే నెల 2వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తాయి. ఆయా దేశాలు వారి ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయకపోతే టారిఫ్‌లు చెల్లించాల్సిందే. ట్రంప్ పాలనలో కొన్ని సందర్భాల్లో టారిఫ్‌లు చాలాచాలా అధికంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఎవరైనా వారి మార్కెట్లలోకి మమ్మల్ని రానివ్వకపోతే మేము కూడా అదే పనిచేస్తాం. మా మార్కెట్లలోకి వారిని అడుగు పెట్టనివ్వం.
జెలెన్‌స్కీ లేఖ ప్రశంసనీయం
ఉక్రెయిన్‌తో ఘర్షణకు ముగింపు పలికి, శాంతిని కోరుకుంటున్నట్లు రష్యా నుంచి నాకు బలమైన సంకేతాలు అందాయి. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నుంచి నాకు ఈరోజే ఒక ముఖ్యమైన లేఖ అందింది. శాంతి సాధన కోసం సాధ్యమైనంత త్వరగా చర్చలు ప్రారంభం కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజల కంటే మిన్నగా శాంతిని ఆకాంక్షిస్తున్నవారు ఎవరూ లేరని లేఖలో జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఇది నిశ్చయంగా శుభ పరిణామం. శాశ్వత శాంతి కోసం ట్రంప్ నాయకత్వంలో పని చేస్తామని జెలెన్‌స్కీ, ఆయన బృందం చెప్పారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సాయాన్ని మర్చిపోలేమని వారు తెలిపారు.
ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వం, స్వాతంత్య్రాన్ని అమెరికా కాపాడుతుందని వారు ఆశిస్తున్నారు. అదే సమయంలో అరుదైన ఖనిజాల సరఫరాతోపాటు ఉక్రెయిన్ భద్రత విషయంలో ఒప్పందంపై ఏ సమయంలోనైనా సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ నా దృష్టికి తీసుకొచ్చారు. జెలెన్‌స్కీ రాసిన లేఖ ప్రశంసనీయం. క్రూరమైన యుద్ధం వల్ల ఉక్రెయిన్, రష్యాలో ఇప్పటికే లక్షలాది మంది అన్యాయంగా బలైపోయారు. చాలామంది క్షతగాత్రులుగా మారారు. ఈ మారణకాండ ఆగిపోవాల్సిందే. మతిలేని యుద్ధాన్ని ఆపేయాల్సిన సమయం ఇదే. ఉక్రెయిన్‌లో ఘర్షణకు తెరదించడానికి నేను ఎంతగానో కష్టపడుతున్నా. రష్యా ప్రతినిధులతో ఇటీవలే చర్చలు జరిపాం. శాంతి కోసం సిద్ధంగా ఉన్నట్లు వారు బలమైన సంకేతాలిచ్చారు. ఇది నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది కదా.
కాశ్ పటేల్‌కు కృతజ్ఞతలు
2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్ ఎయిర్‌పోర్టు వద్ద పేలుళ్లకు పాల్పడి 13 మంది అమెరికా సైనికులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది ముహమ్మద్ షరీఫుల్లాను అరెస్టు చేశామని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. పాకిస్తాన్ సాయంతో అతడిని బంధించాం. అమెరికాకు తరలిస్తున్నాం. సత్వరమే చట్టప్రకారం విచారణ చేపట్టి, అతడిని శిక్షిస్తాం. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గతంలో అప్పటి పాలకులు న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకున్నారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని కాశ్ పటేల్ పునరుద్ధరించారు. కాశ్ పటేల్ మున్ముందు గొప్ప పనులు చేయబోతున్నారు. అలాగే లింగ మార్పిడి చర్యలకు మేము వ్యతిరేకమే. లింగ మారి్పడిని శాశ్వతంగా నిషేధిస్తూ, దాన్ని నేరంగా పరిగణించే బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్‌ను కోరుతున్నా. చిన్నారుల్లో క్యాన్సర్, ఆటిజం కేసులను తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మన పర్యావరణం నుంచి విషకారకాలను, ఆహార పదార్థాల అన్ని రకాల విష రసాయనాలను తొలగించి, చిన్నారులను ఆరోగ్యంగా, బలంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
డ్రిల్ బేబీ డ్రిల్
అమెరికాలో ఇప్పుడు ధరల పెరుగుదలతోపాటు అనేక సమస్యలకు గత జో బైడెన్ ప్రభుత్వమే కారణం. బైడెన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణ సమస్య వేధిస్తోంది. ఏ దేశానికీ లేని విధంగా మన కాళ్ల కింద ద్రవరూపంలో బంగారం ఉంది. ముడి చమురు, సహజ వాయువును వెలికితీస్తే ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారమవుతుంది. బైడెన్ పాలనలో వందకుపైగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు మూసివేశారు. వాటిని మళ్లీ తెరవబోతున్నాం. ఇంధన వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టాం.
నేను అధికారంలోకి రాగానే జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి విధించా. కాళ్ల కింద ఉన్న బంగారాన్ని తవ్వితీస్తే ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది. దాన్ని డ్రిల్ బేబీ డ్రిల్ అంటారు. అమెరికా పౌరులందరికీ సామాజిక భద్రత కలి్పంచడమే మా ధ్యేయం. 300 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందుకొనే విధానం తీసుకొస్తాం. అక్రమ వలసలపై మా వైఖరేమిటో ఇప్పటికే బయటపెట్టాం. అక్రమ వలసదార్లను బయటకు పంపిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. అక్రమ వలసను అరికట్టడానికి సరిహద్దులను దుర్భేద్యంగా మారుస్తాం’’ అని డొనాల్డ్ ట్రంప్ వివరించారు.
ఆ దేశాలకు రాయితీలు
బంద్ ‘‘పొరుగు దేశాల నుంచి ఫెంటానిల్ వంటి ప్రాణాంతక మాదక ద్రవ్యాలు అమెరికాలోకి అక్రమంగా వచ్చి పడుతున్నాయి. డ్రగ్స్ కారణంగా వేలాది మంది అమెరికా పౌరులు అకాల మరణం చెందుతున్నారు. కుటుంబాలు కూలిపోతున్నాయి. యువతీ యువకులు ప్రాణాలు కోల్పోతుండడం బాధ కలిగిస్తోంది. ఇలాంటి విషాదం ఎప్పుడూ చూడలేదు. అమెరికా నుంచి వందల బిలియన్ డాలర్ల సబ్సిడీలు పొందుతున్న దేశాలు చేస్తున్న నిర్వాకమిది. కెనడా, మెక్సికో దేశాలకు ఎన్నో రాయితీలు ఇస్తున్నాం. వందల బిలియన్ల డాలర్ల సొమ్ము ఖర్చు చేస్తున్నాం. ఇకపై ఇలాంటి త్యాగాలకు మేము సిద్ధంగా లేము. మాకు నష్టం కలిగిస్తున్న దేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రాయితీలిచ్చే ప్రసక్తే లేదు’’.
గ్రీన్‌లాండ్ అమెరికాలో భాగం కావాల్సిందే
‘‘పనామా కాలువను మా అ«దీనంలోకి తీసుకోవడానికి మావద్ద ప్రణాళికలు ఉన్నాయి. మా జాతీయ భద్రతను మరింత పటిష్టం చేసుకోవడానికి పనామా కాలువను నియంత్రణలోకి తెచ్చుకోక తప్పదు. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. జిమ్మీ కార్టర్ ప్రభుత్వం కేవలం ఒక్క డాలర్‌కు పనామా కాలువను ఇతరులకు ఇచ్చేసింది. అప్పట్లో కుదిరిన ఒప్పందాలు పదేపదే ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక మాది మేం తీసుకుంటాం. గ్రీన్‌లాండ్ సైతం అమెరికాలో భాగం కాక తప్పదు. ఒక మార్గంలో కాకపోతే మరో మార్గంలో గ్రీన్‌ల్యాడ్‌ను స్వా«దీనం చేసుకుంటాం. సొంత భవిష్యత్తును నిర్ణయించుకొనే హక్కు గ్రీన్‌లాండ్ ప్రజలకు ఉంది. అమెరికా పౌరులుగా మారాలనుకుంటే సాదర స్వాగతం పలుకుతాం. గ్రీన్‌లాండ్ ప్రజలను భద్రంగా చూసుకుంటాం’’.
Comments
Please login to add a commentAdd a comment