బైడెన్‌కు తగ్గిన భారతీయ- అమెరికన్ల మద్దతు | Nineteen Per Cent Decline in Indian American Support for Biden | Sakshi
Sakshi News home page

బైడెన్‌కు తగ్గిన భారతీయ- అమెరికన్ల మద్దతు

Published Thu, Jul 11 2024 10:35 AM | Last Updated on Thu, Jul 11 2024 11:30 AM

Nineteen Per Cent Decline in Indian American Support for Biden

ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇంతలో బైడెన్‌కు మద్దతునిచ్చే విషయంలో భారతీయ-అమెరికన్లు కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఆసియన్-అమెరికన్ ఓటర్ సర్వే (ఏఏవీఎస్‌) తెలిపిన వివరాల ప్రకారం 2020 ఎన్నికలు- 2024 ఎన్నికల మధ్యకాలంలో జో బైడెన్‌కు మద్దతునిచ్చే భారతీయ-అమెరికన్ మద్దతుదారులలో 19 శాతం క్షీణత  కనిపించింది.

ఆసియా అండ్‌ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ వోట్ ఆసియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్‌ల సర్వే ప్రకారం 49 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు ఈ  ఏడాది జో బైడెన్‌కు ఓటు వేసే అవకాశం ఉంది. 2020లో ఇది 65 శాతంగా ఉంది. 30 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసే అవకాశాలున్నాయని సర్వే వెల్లడించింది.

డొనాల్డ్ ట్రంప్‌కు రెండు పాయింట్ల మేరకు ప్రయోజనం ఉండబోతోందని ఈ  సర్వే  తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య  గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో 15 శాతం వృద్ధి నమోదైంది. భారతీయ-అమెరికన్ ఓటర్ల సంఖ్య తగ్గడం బైడెన్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఈ సర్వే ప్రకారం 55 శాతం భారతీయ-అమెరికన్ ఓటర్లు బైడెన్‌కు మద్దతు నివ్వగా, 38 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతు పలికారు.  కాగా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్, అమెరికా రాయబారి నిక్కీ హేలీని 33 శాతం మంది భారతీయ-అమెరికన్లు ఇష్టపడుతున్నారు. అయితే హేలీ పేరు వినని వారు 11 శాతం మంది ఉండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement