
విమానంలో బాలిక ఎదుట అసభ్యంగా ప్రవర్తించిన భారత సంతతి వైద్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితునికి పక్కసీటులో కూర్చున్న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై అభియోగాలు మోపారు. గత ఏడాది మేలో ఈ ఘటన జరగగా.. అనేక విచారణల తర్వాత అరెస్టు చేశారు.
సుదీప్త మొహంతీ(33) అమెరికాలోని బోస‍్టన్‌లో ఇంటర్నల్ మెడిసిన్, ప్రైమరీ కేర్ విభాగంలో వైద్యునిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మే నెలలో స్నేహితురాలితో కలిసి బోస్టన్‌కు విమానంలో వెళుతున్నారు. కాగా పక్క సీటులో 14 ఏళ్ల మైనర్ బాలిక కూర్చుంది. ఆ బాలిక తన నానమ్మ తాతయ్యలతో ప్రయాణిస్తోంది. మొహంతీ పక్కనే బాలిక ఉండగా.. అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. ఇది గమనించిన బాలిక పక్క సీటులోకి వెళ్లిపోయింది.
విమానం దిగగానే తన నానమ్మ, తాతయ్యలతో పాటు విమాన సిబ్బందికి తెలిపింది. బాలిక ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. మొహంతీపై కేసు నమోదు చేశారు. అనంతరం న్యాయస్థానం ముందు ప్రాథమికంగా హాజరుపరిచారు. అప్పుడు ఆంక్షలను విధిస్తూ విడుదల చేశారు. విమానంలో అసభ్య చేష్టలకు పాల్పడితే అమెరికా శాసనం ప్రకారం అతనికి 90 రోజుల వరకు జైలు శిక్షతో పాటు 5000 అమెరికా డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి..
Comments
Please login to add a commentAdd a comment