front
-
మూడు చక్రాల వింత వాహనం: ఇలాంటిది మీరెప్పుడూ చూసుండరు (ఫోటోలు)
-
మూడు రోజులుగా ఇంటి ముందు భార్య పడిగాపులు.. పట్టించుకోని భర్త
సాక్షి, జగిత్యాల జిల్లా: కృష్ణానగర్‌లో దారుణం వెలుగుచూసింది. ఇంటి ముందు వేచిచూస్తున్న భార్యను ఓ భర్త ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. మూడు రోజులుగా ఇంటి ముందు పడిగాపులు కాస్తున్న ఆమెను పట్టించుకోలేదు. కాగా వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన లావణ్యతో, జగిత్యాలకు చెందిన గంగాధర్ కు 2017లో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులతో భర్త గంగాధర్‌పై భార్య లావణ్య కేసు నమోదు చేసింది. వేధింపుల కేసులో జైలుకెళ్లిన గంగాధర్.. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చిన భర్తలో మార్పు వచ్చిందేమోనని భావించిన భార్య లావణ్య తిరిగి అత్తారింటికి వచ్చింది. కానీ ఆమెను భర్త ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ముందే నిరీక్షిస్తూ ఉండిపోయింది. లావణ్యకు గత మూడు రోజులుగా ఇరుగుపొరుగువారు అన్నపానీయాలందిస్తున్నారు. -
భర్త ఇంటి ముందు రెండో భార్య దీక్ష
చేజర్ల (సోమశిల): భర్త ఇంటి ముందు అతని రెండో భార్య దీక్షకు దిగిన ఘటన అనంతసాగరం మండలం రేవూరులో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రేవూరుకు చెందిన పోలయ్య అనంతసాగరం విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. పోలయ్యకు ఇది వరకే పెళ్లి అయింది. మనస్పర్థలు కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. దీంతో మస్తాన్‌బీ అనే మహిళ అతనికి దగ్గర కావడంతో 12 ఏళ్ల నుంచి సహ జీవనం చేస్తున్నట్లు తెలిపారు. పోలయ్య మరో పెళ్లి చేసుకుని మస్తాన్‌బీని వదిలించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకుని ఆమె ఈ విషయమై రెండు నెలల క్రితం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి భర్త పోలయ్య, అతని మూడో భార్య, బంధువుల మస్తాన్‌బీపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన అక్కడే కూర్చుని దీక్ష కొనసాగిస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. -
ఛీ..ఛీ.. విమానంలో వికృత చేష్టలు.. ఇండో అమెరికన్ వైద్యుని అరెస్టు..
విమానంలో బాలిక ఎదుట అసభ్యంగా ప్రవర్తించిన భారత సంతతి వైద్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితునికి పక్కసీటులో కూర్చున్న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై అభియోగాలు మోపారు. గత ఏడాది మేలో ఈ ఘటన జరగగా.. అనేక విచారణల తర్వాత అరెస్టు చేశారు. సుదీప్త మొహంతీ(33) అమెరికాలోని బోస్టన్‌లో ఇంటర్నల్ మెడిసిన్, ప్రైమరీ కేర్ విభాగంలో వైద్యునిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మే నెలలో స్నేహితురాలితో కలిసి బోస్టన్‌కు విమానంలో వెళుతున్నారు. కాగా పక్క సీటులో 14 ఏళ్ల మైనర్ బాలిక కూర్చుంది. ఆ బాలిక తన నానమ్మ తాతయ్యలతో ప్రయాణిస్తోంది. మొహంతీ పక్కనే బాలిక ఉండగా.. అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. ఇది గమనించిన బాలిక పక్క సీటులోకి వెళ్లిపోయింది. విమానం దిగగానే తన నానమ్మ, తాతయ్యలతో పాటు విమాన సిబ్బందికి తెలిపింది. బాలిక ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. మొహంతీపై కేసు నమోదు చేశారు. అనంతరం న్యాయస్థానం ముందు ప్రాథమికంగా హాజరుపరిచారు. అప్పుడు ఆంక్షలను విధిస్తూ విడుదల చేశారు. విమానంలో అసభ్య చేష్టలకు పాల్పడితే అమెరికా శాసనం ప్రకారం అతనికి 90 రోజుల వరకు జైలు శిక్షతో పాటు 5000 అమెరికా డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి.. -
అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన.. అసలు ఏం జరిగిందంటే?
సాక్షి, సూర్యాపేట జిల్లా: అత్తగారింటి ఎదుట అల్లుడు నిరసనకు దిగిన ఘటన కోదాడలో జరిగింది. తన కొడుకుని చూపించకుండా అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆ అల్లుడు ఆరోపిస్తున్నాడు. భార్యాభర్తలైన ప్రవీణ్ కుమార్, పృథ్వీ రమణీల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. బాబుని తల్లిదండ్రుల చెంతనే ఉంచి పృథ్వీ రమణీ కెనడా వెళ్లింది. వారం వారం కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్న ప్రవీణ్.. తన కొడుకును చూడకుండా అత్తామామలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. తన నుంచి కొడుకును దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ప్రవీణ్.. తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగాడు. చదవండి: హైదరాబాద్‌లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ..ఎక్కడో తెలుసా -
వ్యూహం మార్చుకున్న టీఎంసీ.. బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరమైనట్లేనా?
కోల్‌కతా: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయిన తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంది. ఇకపై బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటించనుంది. అవంటే గిట్టని ప్రాంతీయ పార్టీలతో మరో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ‘బీఆర్ఎస్, ఆప్ తదితర పార్టీలతో చర్చలు ప్రారంభించాం. మా వ్యూహమేంటో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలుస్తుంది’ అని టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్ తెలిపారు. ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి టీఎంసీ సాయం చేస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఎం నేతలు విమర్శలు గుప్పించడంతో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. -
వామపక్షాల చెరో కూటమి
సాక్షి, హైదరాబాద్: వామపక్షాల్లోని రెండు ప్రధాన పార్టీలు రాష్ట్రంలో చెరో కూటమి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. వామపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్నామని బహిరంగంగా మాట్లాడుతున్నప్పటికీ సీపీఎం, సీపీఐ చెరో దారిలోనే పయనిస్తున్నాయి. వివిధ సామాజిక, ప్రజా సంఘాలతో కలసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)ను సీపీఎం ఏర్పాటు చేయగా తెలంగాణ జన సమితి(టీజేఎస్), టీడీపీ, న్యూ డెమోక్రసీ, ఎమ్మార్పీఎస్ వంటి వాటితో మరో వేదికను ఏర్పాటు చేసేందుకు సీపీఐ నిర్ణయించింది. నియోజకవర్గ సమావేశాల్లో బీఎల్ఎఫ్... టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీఎల్ఎఫ్ను బలోపేతం చేయడానికి సీపీఎం కార్యాచరణకు దిగుతోంది. ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ప్రధాన సమస్యలను గుర్తించి, వాటిపై పెద్దఎత్తున కార్యాచరణ చేపట్టాలని బీఎల్ఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఆ దిశలోనే రాష్ట్రస్థాయిలో పలు సమావేశాలు, సదస్సులను ఇప్పటికే పూర్తి చేసింది. నియో జకవర్గ స్థాయిలో బీఎల్ఎఫ్ నిర్మాణాలను చేసుకుంటోంది. జూన్, జూలై, ఆగస్టులలో బీఎల్‌ఎఫ్‌కు నియోజకవర్గస్థాయి నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. దీనికి సమాంతరంగానే మండల, గ్రామ స్థాయిలోనూ బీఎల్ఎఫ్ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రెవెన్యూ, మండల స్థాయి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి ప్రధాన సమస్యలపై క్షేత్రస్థాయి కార్యాచరణకు దిగాలని బీఎల్ఎఫ్ భావిస్తోంది. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి నిర్మాణాలు పూర్తయిన తర్వాత బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. నియోజకవర్గ బీఎల్ఎఫ్ కమిటీ సారథ్యంలో ఆగస్టు నెలాఖరులోగా నియోజకవర్గ కేంద్రాలు లేదా మరో ముఖ్య కేంద్రాల్లో బహిరంగ సభలను నిర్వహించనుంది. ద్విముఖ వ్యూహంలో సీపీఐ సీపీఎంకు దీటుగా నియోజకవర్గాల్లో బలోపేతం కావాలని సీపీఐ ఏర్పాట్లు చేసుకుంటోంది. సొం తంగా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయడం, కార్యాచరణకు దిగడం ఒక వ్యూహమైతే... వివిధ పార్టీలు, సామాజిక సంఘాలతో కలసి ఐక్య కార్యాచరణకు దిగాలనే రెండో వ్యూహంతో సీపీఐ పనిచేస్తోంది. ముందుగా పార్టీకి ఎక్కువ బలం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. గత ఎన్నికల సందర్భంగా 25 వేల వరకు ఓట్లు వచ్చిన దాదాపు 15 నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేయనుంది. తమకు 10 వేల ఓట్ల చొప్పున బలం ఉన్న సుమారు 25 నియోజవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపగల సత్తా ఉందని సీపీఐ భావిస్తోంది. ఎక్కువ బలమున్న 15 నియోజకవర్గాల్లో వెంటనే కమిటీలు వేసి ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయనుంది. పార్టీపరంగా సొంత నిర్మాణం పూర్తి చేసుకుంటూనే మిగిలిన పార్టీలతో కలసి ఐక్య కార్యాచరణకూ నేతృత్వం వహించడానికి చర్చలు జరుపుతోంది. ఇప్పటికే టీజేఎస్, టీటీడీపీతో చర్చలను పూర్తి చేసింది. వేర్వేరుగా కార్యాచరణకు దిగుతున్న నేపథ్యంలో వామపక్షాలతో ఐక్య కూటమి సాధ్యమేనా అని ఇరు పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. -
కిరోసిన్ డబ్బాతో బ్యాంక్‌లో ఆత్మహత్యయత్నం
-
హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో మోసం
-
ఢిల్లీకి వచ్చిన మరో 'మోదీ'..!
న్యూ ఢిల్లీః లండన్ లోని మేడమ్ తుస్సాడ్ మ్యూజియంలో పెట్టేందుకు తయారు చేసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మైనపు విగ్రహం ఢిల్లీకి చేరుకుంది. నిర్మాణం పూర్తయి మ్యూజియంలో కొలువుదీరేందుకు సిద్ధంగా ఉన్న విగ్రహాన్ని ప్రధాని మోదీకి చూపించేందుకు తుస్సాడ్ మ్యూజియం కళాకారుల బృందం ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆయన లండన్ వెళ్ళి చూసే అవకాశం లేకపోవడంతో ఢిల్లీలోనే స్వయంగా తిలకించేందుకు వీలు కల్పించారు. త్వరలో ప్రపంచ ప్రఖ్యాత తుస్సాడ్ మ్యూజియంలో కొలువుదీరనున్న తన విగ్రహాన్ని చూసిన మోదీ.. కళాకారులపై ప్రశంసల జల్లు కురిపించారు. వారిని అపర బ్రహ్మలుగా కీర్తించారు. ఆయన మైనపు విగ్రహాన్ని ప్రజలందరూ కూడ సందర్శించేందుకు వీలుగా ఏప్రిల్ 28న ఢిల్లీలో ప్రదర్శనకు ఉంచుతారు. ముఖ్యంగా లండన్ లోనే కాక సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాగ్ లోని టుస్సాడ్ సంగ్రహాలయాల్లో కూడ మోదీ మైనపు విగ్రహాన్ని ఉంచేందుకు నిర్ణయించారు. ప్రపంచ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ప్రధాని మోదీ విగ్రహాన్ని రూపొందించేందుకు ఈ సంవత్సరం ప్రారంభంలో మ్యూజియం కళాకారులు, నిపుణులు ఢిల్లీలో భారత ప్రధాని మోదీని ఆయన ఇంట్లో కలుసుకున్నారు. -
కాపురానికి తీసుకెళ్లలేదని భార్య మౌనపోరాటం