కాలిఫోర్నియాలో పోస్ట్‌మాస్టర్‌గా భారత సంతతి మహిళ | Indian American Jagdeep Grewal chosen as postmaster for Sacramento | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో పోస్ట్‌మాస్టర్‌గా భారత సంతతి మహిళ

Published Fri, Sep 11 2015 8:56 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

Indian American Jagdeep Grewal chosen as postmaster for Sacramento

న్యూయార్క్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలో పోస్ట్‌మాస్టర్‌గా భారత సంతతికి చెందిన జగ్‌దీప్ గ్రేవాల్ నియమితులయ్యారు. గత 166 ఏళ్లలో ఇక్కడ పోస్ట్‌మాస్టర్‌గా నియమితులైన తొలి మహిళ జగ్‌దీప్ గ్రేవాల్ కావడం విశేషం. 537 సిటీ మార్గాలు, 94 రూరల్ ప్రాంతాల్లో విధుల నిర్వహించే 1,004 మంది ఉద్యోగులకు ఆమె నేతృత్వం వహిస్తారు.

భారత్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో గ్రేవాల్ బ్యాచిలర్ డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 1988లో విండో క్లర్క్‌గా తపాలా శాఖలో కెరీర్ ప్రారంభించారు. ఐదేళ్లలోనే మేనేజర్ స్థాయికి ఎదిగారు. తపాల సేవలకు ఆదరణ తగ్గిన ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తోటి ఉద్యోగులతో కలిసి మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తానని ఆమె తెలిపారు. కాగా యూఎస్ తపాల శాఖ తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటోంది. గతేడాది 586 మిలియన్ డాలర్ల నికర నష్టాలను చవిచూసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement