భ్రూణహత్యకు పాల్పడిన మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష
వాషింగ్టన్: భ్రూణహత్యకు పాల్పడినందుకు ఓ భారత సంతతి మహిళలకు అమెరికా కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పూర్వీ పటేల్(33) అనే మహిళ అమెరికాలోని ఇండియానా రాష్ట్రం గ్రాంగర్ లో నివాసం ఉంటోంది.2013 వ సంవత్సరంలో గర్భవతిగా ఉన్న పూర్వీ ఆన్ లైన్ ద్వారా విదేశాల నుంచి తెప్పించుకున్న మందులు వాడి గర్భస్రావం చేయించుకుంది.
ఈ క్రమంలోనే పిండాన్ని బ్యాగ్ లో చుట్టి చెత్త తీసుకు వెళ్లే వాహనంలో వేసింది. అనంతరం ఆమెకు రక్తస్రావం అధికం కావడంతో ఆసుపత్రిలో చేరింది. దీనికి సంబంధించి ఆమెను పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెపై అప్పట్లో భ్రూణ హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారించిన కోర్టు పూర్వీకి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.