death of child
-
ఊరకుక్క దాడిలో చిన్నారి దుర్మరణం
తాండూరు రూరల్: దగ్గర్లోనే పనిచేస్తున్న భర్తకు మంచినీళ్లు ఇచ్చొద్దామని వెళ్లిందా తల్లి. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోతుందని ఊహించలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఐదు నెలల చిన్నారి రక్తపు మడుగులో కన్పించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువుపై ఊరకుక్క దాడి చేసింది. మెడ, కన్ను భాగంలో కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. వైద్యులు చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగానే బాలుడు మరణించాడు.దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మరోవైపు కోపోద్రిక్తులైన చుట్టుపక్కల ఉండే కార్మికులు కుక్కను కొట్టి చంపేశారు. మంగళవారం ఉదయం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బసవేశ్వర్‌నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ విఠల్‌రెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.గదిలో బాలుడు ఒంటరిగా ఉండటంతో..కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన నీలం మధు, మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం సాయినాథ్ పుట్టాడు. కాగా స్టోన్ పాలిషింగ్ పనిచేసే మధు వారం క్రితమే బసవేశ్వర్‌నగర్‌లోని సంగెం కలాన్ గ్రామానికి చెందిన నాగభూషణం పాలిషింగ్ యూనిట్లో చేరాడు. సమీపంలోనే ఓ అద్దె గదిలో దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం చిన్నారిని ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య పక్కనే వంద అడుగుల దూరంలో పనిచేస్తున్న మధుకు మంచినీళ్లు ఇవ్వడానికి వెళ్లింది.బాబుకు ఉక్కపోస్తుందని, వెంటనే తిరిగొస్తాను కదా అన్న ఉద్దేశంతో గది తలుపు వేయలేదు. లావణ్య అలా బయటకు వెళ్లగానే పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఊరకుక్క ఇంట్లోకి చొరబడింది. ఒంటరిగా ఉన్న సాయినాథ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్లుగా సంతానం కోసం ఎదురు చూసి, ఎన్నో మొక్కులు మొక్కగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ‘నాన్నా లే నాన్నా’అంటూ లావణ్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ నెల 24న తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని మధు విలపించాడు.అందరూ ఎన్నికలకు వెళ్లడంతో..సాధారణ రోజుల్లో పాలిషింగ్ యూనిట్ సమీపంలోని కార్మికుల గదుల వద్ద సందడి ఉంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో చాలావరకు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లడంతో పెద్దగా మనుషుల అలికిడి లేకుండాపోయింది. దీనికి తోడు మధు కుటుంబం నివాసం ఉంటున్న గది ఒక్కటే విడిగా ఉండటం, పక్కన ఇతర నివాసాలు లేకపోవడంతో కుక్క దాడి చేసేందుకు అవకాశం ఏర్పడింది. -
క్షణికావేశంలో కన్న బిడ్డనే కడతేర్చాడు..
శ్రీకాళహస్తి(తిరుపతి): ఓ తండ్రి క్షణికావేశం ముక్కు పచ్చలారని మూడు నెలల చిన్నారి ప్రాణాలను బలి తీసుకొంది. భార్యతో గొడవతో సహనం కోల్పోయిన ఆ తండ్రి.. బిడ్డను గోడకేసి కొట్టడంతో ఆ పసిప్రాణాలు అక్కడికక్కడే గాలిలో కలిసిపోయాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని వాటర్ హౌస్ కాలనీలో భార్యాభర్తలు మునిరాజా, స్వాతి నివాసముంటున్నారు. తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం. రెండేళ్ల తర్వాత వీరికి నిఖిల్ పుట్టాడు. ప్రస్తుతం నిఖిల్ వయసు మూడు నెలలు. నాలుగు రోజుల కిందట పిల్లాడికి న్యుమోనియా సోకడంతో తిరుపతిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఇందుకోసం తన బైక్‌ను అమ్మేశాడు. రెండు రోజుల తర్వాత బిడ్డకు మళ్లీ జ్వరం రావడంతో.. నువ్వు ఆస్పత్రిలో సరిగా చూపించలేదంటూ భార్య గొడవకు దిగింది. మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తన తండ్రి బైక్‌ను తీసుకురాగా.. అప్పటికే వాళ్ల మధ్య విభేదాలుండటంతో ఆ బైక్ ఎక్కేందుకు ఆమె నిరాకరించింది. అంతేగాక తన తల్లిదండ్రుల మీద ఆమె నోరు పారేసుకోవడంతో మునిరాజా సహనం కోల్పోయాడు. అదే సమయంలో బాలుడు గుక్కపట్టి ఏడుస్తుండటంతో మునిరాజా.. బాలుడి కాళ్లు పట్టుకుని తలను గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వన్ టౌన్ సీఐ అంజుయాదవ్ చెప్పారు. -
కత్తి దూసిన ‘కిరాతకం’
అవనిగడ్డ/చల్లపల్లి: మూడో తరగతి చదువుతున్న బాలుడిని అత్యంత పాశవికంగా మెడకోసి హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చల్లపల్లి నారాయణరావు నగర్లో నివాసం ఉంటున్న దాసరి రవీంద్ర కుమారుడు దాసరి ఆదిత్య (8) బీసీ వసతి గృహంలో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతని సోదరుడు ఇదే వసతి గృహంలో ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన ఆదిత్య వసతి గృహం పై అంతస్తులో ఉన్న మరుగుదొడ్డిలో దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లవారుజామున ఐదు గంటలకు బక్కెట్ కోసం పైకి వెళ్లిన విద్యార్థి వాకలయ్య రక్తపు మడుగులో పడిఉన్న ఆదిత్యను చూసి వెంటనే కిందకు వచ్చి వాచ్మెన్ నాగరాజుతో చెప్పాడు. పైకి వెళ్ళిన వాచ్మెన్ ఆదిత్య పడిపోయి ఉంటాడని భావించి వైద్యశాలకు తీసుకెళ్ళేందుకు పైకిలేపగా, మెడ సగభాగం తెగి ఉండటం, అప్పటికే విగత జీవిగా ఉండటంతో ఆదిత్య మృత దేహాన్ని గోడకు కూర్చోబెట్టి ఇన్చార్జి వార్డెన్‌కు సమాచారం ఇచ్చాడు. ఏఎస్పీ ఎం.సత్తిబాబు, డీఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి హత్యాస్థలిని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ని రప్పించగా బాత్రూం నుంచి వెనకున్న ప్రహరీ గోడ వరకు వెళ్లి వెనక్కి వచ్చింది. హతుని తండ్రికి, పిన్నికి మధ్య ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. కాగా, ఆదిత్యను వసతి గృహ విద్యార్థే హతమార్చినట్లు సమాచారం. మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లనీయబోమని మృతుని బంధువులు వసతి గృహం గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఏఎస్పీ సత్తిబాబు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
భ్రూణహత్యకు పాల్పడిన మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష
వాషింగ్టన్: భ్రూణహత్యకు పాల్పడినందుకు ఓ భారత సంతతి మహిళలకు అమెరికా కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పూర్వీ పటేల్(33) అనే మహిళ అమెరికాలోని ఇండియానా రాష్ట్రం గ్రాంగర్ లో నివాసం ఉంటోంది.2013 వ సంవత్సరంలో గర్భవతిగా ఉన్న పూర్వీ ఆన్ లైన్ ద్వారా విదేశాల నుంచి తెప్పించుకున్న మందులు వాడి గర్భస్రావం చేయించుకుంది. ఈ క్రమంలోనే పిండాన్ని బ్యాగ్ లో చుట్టి చెత్త తీసుకు వెళ్లే వాహనంలో వేసింది. అనంతరం ఆమెకు రక్తస్రావం అధికం కావడంతో ఆసుపత్రిలో చేరింది. దీనికి సంబంధించి ఆమెను పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెపై అప్పట్లో భ్రూణ హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారించిన కోర్టు పూర్వీకి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.