భారతీయ- అమెరికన్ ఆరోన్ 'రోనీ' ఛటర్జీ తాజాగా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్‌ఈసీ)లో వైట్ హౌస్ కోఆర్డినేటర్ పదవి నుండి వైదొలగారు. డ్యూక్ యూనివర్శిటీలో బిజినెస్ ప్రొఫెసర్‌గా తిరిగి తన పదవిలోకి వెళ్లనున్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలో చిప్స్, సైన్స్ చట్టానికి చెందిన $50 బిలియన్ల పెట్టుబడిని సెమీకండక్టర్స్ పరిశ్రమలో అమలు చేయడం కోసం గత ఏడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో ఛటర్జీ ఈ పదవిలో నియమితులయ్యారు.
“బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో రెండేళ్లు పనిచేసిన తర్వాత తిరిగి డ్యూక్ యూనివర్శిటీకి వెళ్లాలని భావిస్తున్నాను. వైట్‌హౌస్‌లోని నా సహోద్యోగులందరికీ, ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ కీలకమైన ఆర్థిక, జాతీయ భద్రతా సమస్యలపై పనిచేసినందుకు సంతోషిస్తున్నాను’అని ఛటర్జీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. వైట్ హౌస్‌లోని ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు కొంతకాలం సేవలు అందించిన ఆయన ఇప్పుడు రిలీవ్ అయ్యారు.
గ్లోబల్ చిప్‌ల కొరతకు పరిష్కారం దిశగా..
చిప్స్ అండ్ సైన్స్ చట్టాన్ని సెమీకండక్టర్ల ఉత్పత్తిని పెంచడానికి, పరిశోధన, రూపకల్పనలో నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ప్రపంచ వేదికపై దేశానికి పోటీతత్వాన్ని అందించడానికి అమలు చేశారు. దీనిని విభిన్న సెమీకండక్టర్ వర్క్‌ఫోర్స్‌ను పెంచడానికి గత సంవత్సరం ఆమోదించారు. పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన సెమీకండక్టర్ వ్యూహం గ్లోబల్ చిప్‌ల కొరతకు పరిష్కారం చూపించనుంది. అలాగే యుఎస్ ఆధారిత తయారీ సౌకర్యాలపై దృష్టి సారించింది. ఇతర దేశాల సరఫరాదారులపై తక్కువ ఆధారపడే ప్రయత్నంలో భాగంగా ఈ చట్టం అమలు చేశారు. తైవాన్, చైనాలతో పెరుగుతున్న ఇబ్బందుల నుంచి పరిష్కారానికి అమెరికాకు ఈ చట్టం చేయడం బాధ్యతగా మారింది.
పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తి
కాగా ఛటర్జీ 2021 ఏప్రిల్ నుండి వాణిజ్య శాఖకు చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేశారు. అక్కడ చటర్జీ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ఈ రంగంలో అమెరికాలో పోటీతత్వం పెరిగేందుకు, కార్మిక మార్కెట్లు, సరఫరా గొలుసులు, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, ఆర్థిక వృద్ధికి సంబంధించిన విధానాన్ని అభివృద్ధి చేయడానికి సారధ్యం వహించారు. పొలిటికో ఒక ప్రకటనలో ఛటర్జీని పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తిగా అభివర్ణించింది. ఈ రంగంలో అమెరికాలో చైన్ సిస్టమ్‌ను బలోపేతం చేయడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం, అమెరికా అంతటా మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంలో అతని నైపుణ్యం, మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని పేర్కొంది.
అత్యుత్తుమ సేవలకు అనేక అవార్డులు
కాగా ఛటర్జీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలనలోనూ సేవలు అందించారు. వైట్ హౌస్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్‌లో సీనియర్ ఆర్థికవేత్తగా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో విజిటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌లో టర్మ్ మెంబర్‌గా పనిచేసిన ఆయన గోల్డ్‌మన్ సాక్స్‌లో ఆర్థిక విశ్లేషకుడిగానూ సేవలు అందించారు. ఈ నేపధ్యంలో ఛటర్జీ అనేక అవార్డులు అందుకున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో విశిష్ట పరిశోధన కోసం 2017 కౌఫ్ఫ్‌మన్ ప్రైజ్ మెడల్, ఆస్పెన్ ఇన్‌స్టిట్యూట్ నుండి రైజింగ్ స్టార్ అవార్డు, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ సొసైటీ ఎమర్జింగ్ స్కాలర్ అవార్డును చటర్జీ అందుకున్నారు. చటర్జీ తన పీహెచ్‌డీని బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి పూర్తిచేశారు. అంతకు ముందు ఆర్థిక శాస్త్రంలో బీఏ పట్టాను కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి అందుకున్నారు.
ఇది కూడా చదవండి: ఆఫ్రికా ఎందుకు అగ్గిలా మండుతోంది? నైగర్ పరిస్థితేంటి?
Comments
Please login to add a commentAdd a comment