Duke University
-
వైట్‌హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం!
భారతీయ- అమెరికన్ ఆరోన్ 'రోనీ' ఛటర్జీ తాజాగా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ)లో వైట్ హౌస్ కోఆర్డినేటర్ పదవి నుండి వైదొలగారు. డ్యూక్ యూనివర్శిటీలో బిజినెస్ ప్రొఫెసర్‌గా తిరిగి తన పదవిలోకి వెళ్లనున్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలో చిప్స్, సైన్స్ చట్టానికి చెందిన $50 బిలియన్ల పెట్టుబడిని సెమీకండక్టర్స్ పరిశ్రమలో అమలు చేయడం కోసం గత ఏడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో ఛటర్జీ ఈ పదవిలో నియమితులయ్యారు. “బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో రెండేళ్లు పనిచేసిన తర్వాత తిరిగి డ్యూక్ యూనివర్శిటీకి వెళ్లాలని భావిస్తున్నాను. వైట్‌హౌస్‌లోని నా సహోద్యోగులందరికీ, ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ కీలకమైన ఆర్థిక, జాతీయ భద్రతా సమస్యలపై పనిచేసినందుకు సంతోషిస్తున్నాను’అని ఛటర్జీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. వైట్ హౌస్‌లోని ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు కొంతకాలం సేవలు అందించిన ఆయన ఇప్పుడు రిలీవ్ అయ్యారు. గ్లోబల్ చిప్‌ల కొరతకు పరిష్కారం దిశగా.. చిప్స్ అండ్ సైన్స్ చట్టాన్ని సెమీకండక్టర్ల ఉత్పత్తిని పెంచడానికి, పరిశోధన, రూపకల్పనలో నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ప్రపంచ వేదికపై దేశానికి పోటీతత్వాన్ని అందించడానికి అమలు చేశారు. దీనిని విభిన్న సెమీకండక్టర్ వర్క్‌ఫోర్స్‌ను పెంచడానికి గత సంవత్సరం ఆమోదించారు. పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన సెమీకండక్టర్ వ్యూహం గ్లోబల్ చిప్‌ల కొరతకు పరిష్కారం చూపించనుంది. అలాగే యుఎస్ ఆధారిత తయారీ సౌకర్యాలపై దృష్టి సారించింది. ఇతర దేశాల సరఫరాదారులపై తక్కువ ఆధారపడే ప్రయత్నంలో భాగంగా ఈ చట్టం అమలు చేశారు. తైవాన్, చైనాలతో పెరుగుతున్న ఇబ్బందుల నుంచి పరిష్కారానికి అమెరికాకు ఈ చట్టం చేయడం బాధ్యతగా మారింది. పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తి కాగా ఛటర్జీ 2021 ఏప్రిల్ నుండి వాణిజ్య శాఖకు చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేశారు. అక్కడ చటర్జీ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ఈ రంగంలో అమెరికాలో పోటీతత్వం పెరిగేందుకు, కార్మిక మార్కెట్లు, సరఫరా గొలుసులు, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, ఆర్థిక వృద్ధికి సంబంధించిన విధానాన్ని అభివృద్ధి చేయడానికి సారధ్యం వహించారు. పొలిటికో ఒక ప్రకటనలో ఛటర్జీని పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తిగా అభివర్ణించింది. ఈ రంగంలో అమెరికాలో చైన్ సిస్టమ్‌ను బలోపేతం చేయడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం, అమెరికా అంతటా మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంలో అతని నైపుణ్యం, మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని పేర్కొంది. అత్యుత్తుమ సేవలకు అనేక అవార్డులు కాగా ఛటర్జీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలనలోనూ సేవలు అందించారు. వైట్ హౌస్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్‌లో సీనియర్ ఆర్థికవేత్తగా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విజిటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌లో టర్మ్ మెంబర్‌గా పనిచేసిన ఆయన గోల్డ్‌మన్ సాక్స్‌లో ఆర్థిక విశ్లేషకుడిగానూ సేవలు అందించారు. ఈ నేపధ్యంలో ఛటర్జీ అనేక అవార్డులు అందుకున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో విశిష్ట పరిశోధన కోసం 2017 కౌఫ్ఫ్మన్ ప్రైజ్ మెడల్, ఆస్పెన్ ఇన్స్టిట్యూట్ నుండి రైజింగ్ స్టార్ అవార్డు, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సొసైటీ ఎమర్జింగ్ స్కాలర్ అవార్డును చటర్జీ అందుకున్నారు. చటర్జీ తన పీహెచ్‌డీని బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి పూర్తిచేశారు. అంతకు ముందు ఆర్థిక శాస్త్రంలో బీఏ పట్టాను కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి అందుకున్నారు. ఇది కూడా చదవండి: ఆఫ్రికా ఎందుకు అగ్గిలా మండుతోంది? నైగర్ పరిస్థితేంటి? -
వెలుగులోకి కొత్త కరోనా.. కుక్కలనుంచి మనుషులకు!
వాషింగ్టన్ : కరోనా బారిన పడి కొన్ని దేశాలు గిలగిల్లాడుతున్నాయి. మరికొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుని మామూలు స్థితిలోకి వస్తున్నాయి. కానీ, కరోనా భయంనుంచి పూర్తిగా బయట పడలేకుండా ఉన్నాయి. ప్రపంచంలో ఏదో ఓ మూల కరోనా వైరస్ కొత్త రూపంలో దర్శనమిస్తోంది. తాజాగా, ఓ కొత్త కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ గ్రేగరీ గ్రే, అతడి శిష్యుడు లేషన్ క్ష్యూ ఈ కొత్త వైరస్‌ను కనుగొన్నారు. ఈ వైరస్ కుక్కల నుంచి మనుషులకు వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. గురువారం ప్రచురితమైన క్లినికల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ జర్నల్‌లో ఈ వివరాలను వెల్లడించారు. మలేషియాలోని సెరవాక్ ఆసుపత్రి రోగుల నుంచి 2017, 2018 సంవత్సరాలలో కొన్ని శాంపిళ్లను సేకరించారు. వీటిని పరీక్షించగా కొత్త కరోనా వైరస్ కంటపడింది. ఈ కొత్త కరోనా వైరస్ బారిన పడిన వారిలో నిమోనియా ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ వైరస్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉందని తెలిపారు. 301 శాంపిళ్లలో కేవలం ఎనిమిది మందిలో మాత్రమే ఈ కొత్త కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఈ శాంపిళ్లను స్క్రీనింగ్ టెస్టుకు పంపగా వాటిలో కొత్త కరోనా వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయింది. అయితే, ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందా లేదా.. అసలు వారికి ఈ వైరస్ ఎలా సోకింది అన్నది స్పష్టం కాలేదు. అదే విధంగా ఈ వైరస్ నుంచి మనుషులకు ఎంత వరకు ప్రమాదం ఉందన్న సంగతి కూడా తేలలేదు. -
యాంటీబాడీలు అందరిలో ఒకేలా ఉండవు
సింగపూర్: కరోనా వైరస్‌పై పోరాడే యాంటీ బాడీలు కొందరిలో దశాబ్దం పాటు ఉండవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ పని చేసే తీరుని బట్టి యాంటీ బాడీలు ఎన్నాళ్లు శరీరంలో ఉంటాయో ఆధారపడి ఉంటుందని లాన్సెట్ మైక్రోబ్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి శరీరంలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ (ఎన్ఏబీ) తక్కువ స్థాయిలో ఉత్పత్తి అయినప్పటికీ టీ సెల్స్ , రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పని చేస్తున్నప్పడు వారికి మళ్లీ వైరస్ సోకే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయినట్టుగా నివేదిక స్పష్టం చేసింది. సింగపూర్‌లోని డ్యూక్–ఎన్‌యూఎస్ మెడికల్ స్కూలుకి చెందిన శాస్త్రవేత్తలు ఆరు నుంచి తొమ్మిది నెలలు పాటు 164 మంది కోవిడ్ రోగులకు రక్త పరీక్షలు నిర్వహిస్తూ వారిలో కరోనా వైరస్‌పై పోరాటంలో ఎన్ఏబీ, టీ సెల్స్, రోగ నిరోధక వ్యవస్థ పని తీరు వంటివన్నీ అంచనా వేస్తూ వచ్చారు. అధ్యయనంలో పాల్గొన్న వారిని అయిదు కేటగిరీలుగా విభజించారు. యాంటీ బాడీలు అసలు ఉత్పత్తి కాని వారు 11.6శాత మంది ఉంటే, యాంటీ బాడీలు ఉత్పత్తి అయినప్పటికీ అవి త్వరగా క్షీణించిన వారి శాతం 26.8గా ఉంది. 29 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు నెమ్మదిగా క్షీణించడం కనిపించింది. ఇక 1.8శాతం మందిలో యాంటీబాడీలు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్ సోకినప్పటికీ, వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయన్నది వారి రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని డ్యూక్ వర్సిటీ ప్రొఫెసర్ లిన్ఫా వెల్లడించారు. -
వాల్వ్‌ల్లేని ‘ఎన్–95’లే బెస్ట్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రజల రోజువారీ అలవాట్లను, జీవనశైలిని ఒక్కసారిగా మార్చేసింది. మాస్క్ ధరించడం అందరి జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుందని తెలిశాక మాస్క్‌లకు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి ఎలాంటి మాస్క్‌లు ధరించాలన్న అంశంపై మాత్రం ఆరు నెలలు గడిచినా ఇంకా నిర్దిష్టమైన పరిష్కారమేదీ లభించలేదు. దీంతో ప్రజలు తమకు తోచినట్లుగా వివిధ రకాల మాస్క్‌లను ధరిస్తున్నారు. వైద్యులు మొదలుకొని నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ‘సర్జికల్ మాస్క్’లు ఉపయోగిస్తుండగా ఇప్పుడు రకరకాల మాస్క్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవి ఏ మేరకు ఒకరి నుంచి మరొకరికి తుంపర్లు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి? ఏ మాస్క్‌లు ఉపయోగిస్తే మంచిది? దీనికి తాజాగా సమాధానం లభించింది. శాస్త్రవేత్తల పరిశోధన... ఈ అంశంపై పరిశోధన చేసిన అమెరికా డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరోనా వ్యాప్తికారక తుంపర్లను నిరోధించడం లేదా తగ్గించడంలో వాల్వ్‌లు లేని ఎన్–95 మాస్క్‌లు అత్యుత్తమమైనవని తేల్చారు. దీని తర్వాతి స్థానంలో ‘త్రీ లేయర్ మాస్క్‌లు’(మూడు పొరలవి) నిలిచాయి. కాటన్–పాలిప్రోలిన్–కాటన్ మాస్క్ మూడోస్థానంలో నిలవగా టూ లేయర్ పాలిప్రోపిలిన్ ఏప్రాన్ మాస్క్ నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు వదులుగా బట్టతో చేసిన మాస్క్‌లు, ఫేస్ కవరింగ్స్ వంటివి పెట్టుకున్నప్పటికీ అవి మాస్క్‌లు ధరించకుండా ఉన్న దానితో సమానమని వెల్లడైంది. వాల్వ్‌లున్న ఎన్–95 మాస్క్‌లు కూడా సమర్థంగా తుంపర్ల వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్నాయని ఈ అధ్యయనంలో తెలిసింది. ఈ మాస్క్‌లు ఏడో ర్యాంక్‌లో నిలిచాయి. ప్రయోగం సాగిందిలా... డ్యూక్ వర్సిటీ పరిశోధకులు తక్కువ ఖర్చుతో రూపొందించిన ‘లేజర్ సెన్సర్ డివైజ్’తో 14 రకాల మాస్క్‌లు, ఫేస్ కవరింగ్స్‌ను పోల్చి చూశారు. ఈ మాస్క్‌లు ధరించిన వారు మాట్లాడినప్పుడు వారి నుంచి తుంపర్లు ఏ దిశలో ప్రయాణించాయి? వాటిని అడ్డుకోవడంలో మాస్క్‌లు ఏ మేరకు సమర్థంగా పనిచేశాయన్న దానిని లేజర్ బీమ్, లెన్స్, మొబైల్ ఫోన్ కెమెరాతో పరిశీలించారు. మాట్లాడేటప్పుడు, గాలిని బయటకు వదిలినప్పుడు ఎన్–95 మాస్క్‌కున్న వాల్వ్‌లు తెరుచుకోవడం వల్ల పరిసరాల్లోని వ్యక్తులకు తుంపర్ల నుంచి రక్షణ తగ్గుతోందని ఈ పరిశీలనలో వెల్లడైంది. అయితే ఈ పరిశోధనకున్న పరిమితులతోపాటు ఇతర రూపాల్లోని మాస్క్‌లు, వెర్షన్లను పరిశీలించకపోవడం వంటి అంశాల ప్రాతిపదికన దీనిపై మరింతగా పరిశోధించాల్సిన అవసరముందని డ్యూక్ వర్సిటీ పరిశోధకుడు ఎమ్మా ఫిషర్ పేర్కొన్నారు. -
సహోద్యోగులతోనే కరోనా ముప్పు!
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరాడుతున్న యోధుల్లో ముందుండే వైద్యులు, వైద్య సిబ్బందికి కోవిడ్ ఎక్కువగా రోగుల నుంచి కాకుండా సహోద్యోగులతోనే వస్తోంది. ఆస్పత్రి నుంచి వైరస్ సంక్రమించిన కేసుల్లో దాదాపు 70 శాతం మందికి సహోద్యోగులు, తోటి సిబ్బందితోనే వ్యాప్తి చెందుతోంది. హెల్త్ వారియర్స్‌కు కరోనా సోకుతున్న తీరుపై అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. మార్చి 15వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు జరిపిన ఈ పరిశోధనలో 21,104 మంది వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకిన విధానంపై అధ్యయనం చేశారు. వైరస్ వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయిన తర్వాత వారితో ఫోన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సంభాషించి పరిస్థితిని విశ్లేషించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. (మాస్క్ అనేది సరిగ్గా వేసుకుంటేనే..) రోగులతో జాగ్రత్తగా ఉండటంతో... కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు పెట్టుకోవడం, చేతికి గ్లౌజ్‌లు తొడుక్కోవడంతో పాటు పీపీఈ కిట్లు ధరించిన తర్వాతే రోగి ఉంటున్న వార్డుల్లోకి వెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవడంతో రోగుల నుంచి డాక్టర్లు, ఇతర సిబ్బందికి వైరస్ తక్కువగా సోకుతుంది. అయితే రోగిని పరిశీలించిన తర్వాత వైద్యులు, వైద్య సిబ్బంది వారి గదుల్లోకి వెళ్లిన తర్వాత పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్‌లు తొలగిస్తున్నారు. ఇదే సమయంలో సహోద్యోగులతో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా, కనీసం భౌతిక దూరాన్ని సైతం పాటించకుండా ఉండటంతో వైరస్ వ్యాప్తికి అనుకూలంగా మారుతోందని పరిశీలనలో తేలింది. (ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్) వైద్యులు, వైద్య సిబ్బందికి వైరస్ సోకిన తీరును మూడు కోణాల్లో పరిశీలన చేశారు. సమాజం నుంచి, సహచరుల నుంచి, ఆస్పత్రుల నుంచి సోకుతున్నట్లు నిర్ధారించి ఆమేరకు విభజన చేసి పరిశోధన సాగించారు. హెల్త్ వారియర్స్‌కు సోకుతున్న వైరస్ ప్రధానంగా 38 శాతం సమాజం నుంచే సోకుతుండగా.. మరో 22 శాతం మేర ఆస్పత్రుల నుంచి సోకుతుంది. మిగతా 40 శాతం మందికి సమాజం, ఆస్పత్రులతో పాటు ఇతర అంశాల వల్ల వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చని అభిప్రాయపడింది. ఇక ఆస్పత్రి ద్వారా కరోనా సోకిన వారిలో 70 శాతం మందికి కేవలం సహోద్యోగుల వల్లే వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. మాస్కులు ధరించకుండా, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా వచ్చినట్లు తేల్చారు. ఈ క్రమంలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు మాస్కులు ధరించాలనే నిబంధన కఠినతరం చేయడంతో వారం తర్వాత వారియర్స్‌కు వైరస్ సోకడం గణనీయంగా తగ్గిందని కనుగొన్నారు. దీంతో ఆస్పత్రిలో ఉన్నంతసేపు జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తూ వస్తున్నట్లు ఆ యూనివర్సిటీ స్పష్టం చేసింది. (మేలుకుంటేనే కోలుకుంటాం) ఐసీయూలోని వారియర్స్‌కు హైరిస్క్: ఐసీఎంఆర్ కరోనా సోకుతున్న హెల్త్ వారియర్స్‌లో అధికంగా ఐసీయూలో డ్యూటీ చేస్తున్న వాళ్లున్నట్లు ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) పరిశీలనలో తేలింది. ఐసీయూ విధుల్లో భాగంగా పేషెంట్ కు ఆక్సిజన్ పెట్టడం, పైపులు మార్చడంతో పాటు రోగిని మరింత దగ్గరగా పరిశీలించాల్సి రావడంతో ఈ పరిస్థితి ఏ ర్పడుతున్నట్లు ఐసీఎంఆర్ శా స్త్రవేత్తలు గుర్తించారు. సాధార ణ వార్డులో పనిచేసే వారితో పోలిస్తే ఐసీయూ వైద్యు లు, వైద్య సిబ్బంది నాలు గు రెట్లు అధిక రిస్క్‌లో ఉ న్నట్లు స్పష్టంచేసింది. అదే విధంగా పీపీఈ కిట్లు ధరి స్తున్న వారు జాగ్రత్తలు పాటించకపోవడం కూడా రిస్క్‌కు కారణమని తెలిపింది. (లాక్డౌన్లో ఎంత డౌన్?) చిరిగిన పీపీఈ కిట్లు ధరించడం, సరైన పద్ధతిలో మాస్క్ పెట్టుకోకపోవడం, గ్లౌజ్‌లు సరిగ్గా వేసుకోని వాళ్లలో రిస్క్ 3 రెట్లున్నట్లు తెలిపింది. జనాభా నిష్పత్తితో పోలిస్తే మన దగ్గర వైద్యులు, సిబ్బంది తక్కువగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బందిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, వైద్యులు, సిబ్బందికి విధుల్లో ఉన్నంతసేపు మాస్క్ ధరించాలనే నిబంధనను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అదేవిధంగా బయటకు వెళ్లినప్పుడు కూడా మాస్క్ ధరిస్తే మంచి ఫలితముంటుందని నిజామాబాద్ వైద్య కళాశాల క్రిటికల్ కేర్ యూనిట్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. -
గోడలోకి తొంగి చూడొచ్చు!
వాషింగ్టన్: గోడలకు చెవులుంటాయని విన్నాం. కానీ గోడ అవతల కళ్లుంటాయనే విషయాన్ని కూడా ఇకపై గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గోడకు అవతలివైపు ఏం జరుగుతుందో ఇటువైపు ఉండి చూడొచ్చట. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో అభివృద్ధి పర్చారు. అయితే ఆ టెక్నాలజీ అత్యంత ఖరీదైనదే కాకుండా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం కష్టసాధ్యమైనది కావడంతో అంతగా ఉపయోగంలోకి రాలేదు. అయితే అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చాలా తక్కువ ఖర్చుతో గోడ లోపల ఏముందో తెలుసుకునే కొత్త టెక్నాలజీని స్కానర్‌ను అభివృద్ధి చేశారు. ఈ స్కానర్ ప్రత్యేకత ఏంటంటే... అంత్యంత తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన సింగిల్ ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్స్‌ను ఉపయోగించడమే. ఇవి గోడలో అడ్డుగా ఉన్న ఇటుక, కంకర, ఇనుము వంటివాటిని సులువుగా ఛేదించుకొని లోపలికి వెళ్లిపోతాయట. దీనివల్ల గోడలో ఎదుయ్యే సమస్యలను గుర్తించవచ్చని... ముఖ్యంగా నిర్మాణరంగ నిపుణులకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. -
బ్రెయిన్ పవర్ కావాలా? అయితే, ఛలో షాపింగ్!
స్టడీ షాపింగ్ మీద బోలెడు జోకులు ఉన్నాయి. షాపింగ్...అంటే భయపడేవాళ్ల మీద కూడా బోలెడు జోకులు ఉన్నాయి. షాపింగ్ అంటే భయపడనక్కర్లేదని, షాపింగ్ వల్ల పోయేదానితో పాటు (డబ్బులు) వచ్చేది కూడా ఉంటుందని, దాని పేరే ‘బ్రెయిన్ పవర్’ అని చెబుతున్నారు పరిశోధకులు. బ్రెయిన్ పవర్‌కు, షాపింగ్‌కు ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకుందాం... వయసు పైబడినవారు షాపింగ్ చేస్తే బ్రెయిన్ పవర్ పెరుగుతుందని, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని డ్యూక్ యూనివర్శిటీకి(అమెరికా)కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. తమ అధ్యయనంలో భాగంగా 20 మంది యువకులు, 22 మంది వయసు మళ్లిన వారిని ఎంచుకొని షాపింగ్ అనంతరం వారి బ్రెయిన్ స్కాన్‌తో పాటు రకరకాల అధ్యయనాలు నిర్వహించారు. కొందరికి ఆన్లైన్ షాపింగ్ సైట్లు చూపిస్తూ ప్రశ్నలు అడిగారు. ఒక వస్తువును ఎంచుకునే సమయంలో, ధర గురించి ఆలోచించే సమయంలో వారి మెదడు కదలికలలో వచ్చే మార్పును రికార్డ్ చేశారు. నాణ్యత గల వస్తువు గురించి ఆలోచించడం, ఎంచుకున్న వస్తువును వేరే వస్తువుతో పోల్చిచూసుకోవడం, బేరమాడడం... ఇలా షాపింగ్‌లో కనిపించే సమస్త అంశాలు... జ్ఞాపకశక్తిని వృద్ధి చేసేవే అంటున్నారు పరిశోధకులు. ఒక వస్తువుని ఎంచుకోవడానికి, ఒకటికి పదిసార్లు ఆలోచించడం అనేది కూడా మెదడు చురుకుదనానికి కారణమవుతుందట. దీనివల్ల మెదడులో కాస్తో కూస్తో స్తబ్దంగా ఉన్న ప్రాంతాలు కూడా... షాపింగ్ తాలూకు ఆలోచన ప్రక్రియలోకి వచ్చి చేరుతాయి. ఒక ప్రాడక్ట్‌కు సంబంధించిన రెండు వస్తువులను చూపిస్తూ ‘‘ఏది ఎంచుకుంటారు?’’ అని అడిగినప్పుడు మెదడులోని చురుకుదనం పెరుగుతుందట! కాబట్టి ఇకముందు మీకు మీరుగా షాపింగ్ చేయాలనుకున్నా, ఎవరికోసమైనా చేసినా సాకుల కోసం వెదుక్కోనక్కర్లేదు. హడావిడిగా కాకుండా కాస్త ఎక్కువ టైమ్ తీసుకునే షాపింగ్ చేయండి!