'నాకు ఆ శ్రమ వద్దు.. నేను దిగను'
న్యూయార్క్: తాను 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగడం లేదని, ప్రచారంలో కూడా పాల్గొనడం లేదని న్యూయార్క్ సిటీ మేయర్ మైఖెల్ బ్లూమ్బర్గ్ అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో దిగితే అది రిపబ్లికన్ అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్కుగానీ టెడ్ క్రూజ్కు గానీ లాభం చేకూర్చే అవకాశం ఉందని చెప్పారు. అందుకే తనకు ఈసారి ఆ ఉద్దేశం లేదని అన్నారు. బ్లూమ్ బర్గ్ న్యూయర్క్ సిటీ మేయర్గా 2002 నుంచి 2013 మధ్య కాలంలో విశేష సేవలను అందించారు.
ఆయనకు ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థుల విషయంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో 'ఆ శ్రమను నేను తీసుకోవడం లేదు' అనే పేరిట ఒక ప్రకటన చేశారు. అందులో 'ఎవరైతే మన ఐకమత్యాన్ని దెబ్బతీస్తారో, భవిష్యత్తును అంధకారంగా మారుస్తారో అలాంటి వారిని ఎన్నుకునే విషయంలో నేను సమర్థమంతమైన పాత్రను పోషిస్తాను. ఎందుకంటే నేను మన దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తాను' అని ఆయన అన్నారు.