Michael Bloomberg
-
బ్లూమ్‌బర్గ్ ‘పిజ్జా’ వీడియో.. ట్రంప్ సెటైర్లు!
వాషింగ్టన్: తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉంటారన్నది తెలిసిన విషయమే. అవకాశం దొరికితే చాలు తన మాటల తూటాలు, సెటైరికల్ ట్వీట్లతో ఎదుటివారిపై విరుచుకుపడతారు. ప్రస్తుతం ట్రంప్‌కు అలాంటి అవకాశమే ఇచ్చి అడ్డంగా బుక్కయ్యారు డెమొక్రాట్ పార్టీకి చెందిన మైఖేల్ బ్లూమ్‌బర్గ్. పిజ్జా ముక్కను కొరికి తిన్న మైఖేల్... తర్వాత దానిని మళ్లీ బాక్సులో పెట్టిన వీడియోను బ్లూమ్‌బర్గ్ స్నాప్‌చాట్ హ్యాండిల్ షేర్ చేసింది. ఇందులో... పిజ్జాను రుచిచూసిన తర్వాత మైఖేల్ తన ఐదు చేతివేళ్లను నోట్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా జుర్రుకున్నట్లుగా కనిపించింది. (తాలిబన్ అగ్రనేతకు ట్రంప్ ఫోన్) ఇక ఈ వీడియోపై ట్రంప్ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ‘‘మినీ మైక్.. నీ మురికైన చేతివేళ్లను అలా నోట్లో పెట్టుకోవద్దు. ఇది అపరిశుభ్రం. నీతోపాటు ఇతరులకు కూడా చాలా ప్రమాదకరం’’ అని ఆయన ట్వీట్ చేశారు. ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సైతం ఈ వీడియోపై స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రకంపనలు రేగుతున్న నేపథ్యంలో.. ‘‘ ఇది నిజంగా చెత్త విషయం. బ్లూమ్‌బర్గ్ ఎలాంటి వారో ఇందులో కనబడుతోంది. మైక్ నాకు 1,000,000,000 డాలర్లు పంపించండి. సోషల్ మీడియా ఎలా ఉపయోగించాలో చెప్తా’’ అంటూ కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసే విధానం ఇదే అని మైఖేల్ వీడియోను షేర్ చేశారు.(కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని!) కాగా వాణిజ్య సమాచారంతో పాటు వార్తలు అందించడంలోనూ ముందుండే ‘బ్లూమ్‌బర్గ్’ ను స్థాపించి మీడియా మొఘల్‌గా మైఖేల్ బ్లూమ్‌బర్గ్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు డెమొక్రాట్ల నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశించారు. ఇందులో భాగంగా ట్రంప్ విధానాలను ఎండగడుతూ తన ప్రసంగాలతో దూసుకపోయారు. ట్రంప్‌ను ఓడించడమే లక్ష్యంగా పోటీలో దిగినట్లు పేర్కొన్నారు. అయితే బుధవారం నాటితో మైఖేల్ ప్రచారం ముగిసింది. తగినన్ని ఓట్లు రాకపోవడంతో ఆయన అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకొన్నారు. డెమొక్రటిక్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ను అభ్యర్థిగా ప్రతిపాదించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసి.. గెలుపొందే అవకాశాలు బిడెన్‌కే ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 👇JUST WOW👇 Mini Mike is an absolute SLOB. Watch him AWKWARDLY rip a slice of pizza, place it back into the community pizza box, lick his fingers, then put his hands on the box of coffee! pic.twitter.com/zIQP9T6qah — AG William Barr (@AGWilliamBarr) March 3, 2020 -
భారత్... అవకాశాల గని!
న్యూయార్క్: అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ స్వర్గధామంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాల ప్రయాణంలో కేవలం ఆరంభమేనన్నారు. కార్పొరేట్ పన్నును చరిత్రాత్మక స్థాయిలో ప్రభుత్వం తగ్గించిందని, పెట్టుబడులకు ఇదొక బంగారం లాంటి అవకాశమని అభివర్ణించారు. భారత్‌లో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని న్యూయార్క్‌లో బుధవారం జరిగిన బ్లూంబర్గ్ వ్యాపార సదస్సులో భాగంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కార్పొరేట్లను, సంపద సృష్టికర్తలను గౌరవించే ప్రభుత్వం భారత్‌లో ఉందన్నారు. ‘‘విస్తరణకు అవకాశం ఉన్న మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు భారత్‌కు విచ్చేయండి. ఆధునిక ధోరణులు, ఫీచర్లను అభినందించే మార్కెట్లో చేయదలిస్తే భారత్‌కు రండి. భారీ మార్కెట్ ఉన్న చోట స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్‌కు రండి. ప్రపంచంలో ఒకానొక అతిపెద్ద మౌలిక సదుపాయాల వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్‌కు తరలిరండి’’ అని ప్రధాని అంతర్జాతీయ కంపెనీలకు పిలుపునిచ్చారు. కార్పొరేట్ పన్నును అన్ని రకాల సెస్సులు, చార్జీలతో కలుపుకుని 35 శాతంగా ఉన్నదాన్ని ఇటీవలే ప్రభుత్వం 25.17 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల పన్నులకు దీటుగా భారత కార్పొరేట్ పన్ను మారింది. ఆ నాలుగు అంశాలే భారత్‌కు బలం... ‘‘భారత వృద్ధి పథం నాలుగు కీలక అంశాలతో ముడిపడి ఉంది. ప్రపంచంలో వేరెక్కడా ఇవి లేవు. అవి ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, నిర్ణయాత్మక శక్తి. ప్రజాస్వామ్యానికి తోడు, రాజకీయ స్థితర్వం, ఊహించతగ్గ విధానాలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ అన్నవి పెట్టుబడుల వృద్ధికి భరోసానిచ్చేవి., రక్షణనిచ్చేవి. భారత్ తన పట్టణాలను ఎంతో వేగంగా ఆధునీకరిస్తోంది. ఆధునిక టెక్నాలజీలతో, పౌరులకు సౌకర్యమైన సదుపాయాలతో వాటిని తీర్చిదిద్దుతోంది. కనుక పట్టణీకరణపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్‌కు రావాలి’’అని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రక్షణ రంగంలో ముందెన్నడూ లేని స్థాయిలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు ఆయన చెప్పారు.భారత్ కోసం, ప్రపంచం కోసం భారత్‌లో తయారు చేయాలనుకుంటే భారత్‌కు రావాలని ఆహ్వానం పలికారు. వ్యాపార వాతావరణం మెరుగుపరిచేందుకు గాను రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించిన అనంతరం.. మోదీ సర్కారు 50 చట్టాలను రద్దు చేసిన విషయం గమనార్హం. ఆరంభమే... మున్ముందు ఇంకా చూస్తారు ‘‘భారత ప్రభుత్వం వ్యాపార ప్రపంచాన్ని, సంపద సృష్టిని గౌరవిస్తుంది. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు కఠినమైన, భారీ నిర్ణయాలను తీసుకుంటోంది. నూతన ప్రభుత్వం కొలువుదీరి కేవలం మూడు నాలుగు నెలలే అయింది. ఇది కేవలం ఆరంభమేనని చెప్పదలుచుకున్నా. ఇంకా ఎంతో పదవీ కాలం ఉంది. ఈ ప్రయాణంలో అంతర్జాతీయ వ్యాపార సమూహంతో భాగస్వామ్యం పటిష్టం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మీకు బంగారం లాంటి అవకాశం’’ అని మోదీ వివరించారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) దేశ జీడీపీని తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని కేంద్ర సర్కారు విధించుకున్న విషయం గమనార్హం. ఇప్పటికే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్ల మేర జీడీపీ స్థాయిని పెంచామని, 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మోదీ చెప్పారు. 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో ఇప్పటికే 120 గిగావాట్ల మేర సాధించినట్టు తెలిపారు. 450 గిగావాట్ల లక్ష్యాన్ని సమీప కాలంలో చేరుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. గడచిన ఐదేళ్లలో భారత్ 286 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని, అంతక్రితం 20 ఏళ్లలో వచ్చినవి ఇందులో సగమేనన్నారు. మౌలిక సదుపాయాలపై 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. సరుకు రవాణా, అంతర్జాతీయ పోటీతత్వం, అంతర్జాతీయ ఆవిష్కరణ, వ్యాపార సులభతర నిర్వహణ సూచీల్లో భారత్ తన స్థానాలను మెరుగుపరుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. -
'నాకు ఆ శ్రమ వద్దు.. నేను దిగను'
న్యూయార్క్: తాను 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగడం లేదని, ప్రచారంలో కూడా పాల్గొనడం లేదని న్యూయార్క్ సిటీ మేయర్ మైఖెల్ బ్లూమ్‌బర్గ్ అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో దిగితే అది రిపబ్లికన్ అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్‌కుగానీ టెడ్ క్రూజ్‌కు గానీ లాభం చేకూర్చే అవకాశం ఉందని చెప్పారు. అందుకే తనకు ఈసారి ఆ ఉద్దేశం లేదని అన్నారు. బ్లూమ్ బర్గ్ న్యూయర్క్ సిటీ మేయర్‌గా 2002 నుంచి 2013 మధ్య కాలంలో విశేష సేవలను అందించారు. ఆయనకు ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థుల విషయంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో 'ఆ శ్రమను నేను తీసుకోవడం లేదు' అనే పేరిట ఒక ప్రకటన చేశారు. అందులో 'ఎవరైతే మన ఐకమత్యాన్ని దెబ్బతీస్తారో, భవిష్యత్తును అంధకారంగా మారుస్తారో అలాంటి వారిని ఎన్నుకునే విషయంలో నేను సమర్థమంతమైన పాత్రను పోషిస్తాను. ఎందుకంటే నేను మన దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తాను' అని ఆయన అన్నారు.