
వాషింగ్టన్: వైట్‌హౌస్ మిలటరీ ఆఫీస్ డైరెక్టర్ పదవికి భారతీయ సంతతికి చెందిన మజ వర్గీస్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నానని, ఈ పదవిని నిర్వహించడం తనకు గర్వకారణమని ఆయన శనివారం ట్వీట్ చేశారు. పదవీ కాలంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మజు అద్భుతమైన పనితీరు కనపరిచారని వైట్‌హౌస్ అధికారులు ప్రశంసించారు. గతంలో ఒబామా ప్రభుత్వంలో కూడా మజు పనిచేశారు. ఈ పదవిలో ఎవరిని నియమించేది ఇంకా వైట్‌హౌస్ నిర్ణయించలేదు. తదుపరి కార్యాచరణను మజు వెల్లడించలేదు. వృత్తిరీత్యా మజు న్యాయవాది. ఆయన తల్లిదండ్రుల స్వస్థలం కేరళ.
Comments
Please login to add a commentAdd a comment