నీర్జా సేథీ, జయశ్రీ ఉల్లాల్
న్యూయార్క్: అమెరికాలో స్వయం కృషితో అత్యంత ధనవంతులుగా ఎదిగిన 60 మంది మహిళల నాలుగో వార్షిక జాబితాను ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత సంతతికి చెందిన జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథీలు చోటు దక్కించుకున్నారు. అరిస్టా నెట్‌వర్క్స్ సీఈవో, ప్రెసిడెంట్‌గా ఉన్న ఉల్లాల్ రూ.9,250 కోట్ల సంపదతో జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. ఐటీ సంస్థ సైన్‌టెల్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న సేథీ రూ.6,844 కోట్ల సంపదతో 21వ స్థానం సాధించారు. అమెరికా గృహ నిర్మాణ సంస్థ ఏబీసీ సప్లై సంస్థ చైర్మన్ డయానే హెన్డ్రిక్స్ రూ.33,547 కోట్ల సంపదతో జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. మూడేళ్లలో రూ.6,164 కోట్ల విలువైన కాస్మెటిక్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన అమెరికా టీవీ స్టార్ కైలీ జెన్నర్(20) జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment