two womens
-
ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్
సరోజ్ బెన్, జరీనా, ముంతాజ్‌లాంటి సామాన్య మహిళలు తమలాంటి సామాన్యుల కోసం వాయు కాలుష్యంపై దిల్లీ గల్లీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోర్టబుల్ ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటర్లతో ‘వాయు కాలుష్య నివారణకు మన వంతుగా చేయాల్సింది’ అనే అంశంపై ప్రచారం చేస్తున్నారు... దిల్లీలోని నందనగిరి ప్రాంతం. చేతిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మానిటర్‌తో 39 సంవత్సరాల సరోజ్ బెన్ ఇద్దరు ముగ్గురు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ‘విషయం ఏమిటీ?’ అని అడుగుతూ మరో ఇద్దరు మహిళలు, ఆ తరువాత మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అడిగిన వారికల్లా ఓపిగ్గా చెబుతోంది సరోజ్. ‘మీ ఏరియాలో వాయుకాలుష్యం ప్రమాదకరమైన స్థాయిలో ఉంది...’ అంటూ ప్రారంభించి ఆ సమస్య తలెత్తడానికి కారణాలు, దీని ప్రభావం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు... మొదలైన వాటి గురించి చెబుతూ పోయింది. ‘మీరు గవర్నమెంట్ ఆఫీసరా?’ అని ఎవరో అడిగారు. ‘కాదమ్మా, నేనూ నీలాగే గృహిణిని. పెరుగుతున్న వాయుకాలుష్యం గురించి బాధపడి, కాలుష్య నివారణకు నా వంతుగా ఏదైనా చేయాలని ఇలా వీధులు తిరుగుతున్నాను’ అని చెప్పింది సరోజ్. సరోజ్ బెన్ మాత్రమే కాదు గ్రాస్‌రూట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘మహిళా హౌజింగ్ ట్రస్ట్’ కమ్యూనిటీ మూమెంట్ ‘హెల్ప్ దిల్లీ బ్రీత్’ ప్రభావంతో ఎంతోమంది సామాన్య మహిళలు వాయు కాలుష్యంపై అవగాహన చేసుకున్నారు. తమలాంటి వారికి అవగాహన కలిగించడానికి వాడ వాడా తిరుగుతున్నారు. కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ పౌరుల్లో వాయు కాలుష్యంపై అవగాహన కలిగించడానికి మహిళా హౌజింగ్ ట్రస్ట్, హెల్ప్ దిల్లీ బ్రీత్ సంస్థలు సామాన్య మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. పోర్టబుల్ ఏక్యూఐ మానిటర్లతో దిల్లీలోని గల్లీలు తిరుగుతూ వాయుకాలుష్య నివారణపై ప్రచారం నిర్వహిస్తున్న ఈ మహిళలు ‘ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్’లుగా గుర్తింపు పొందారు. ఏక్యూఐ అంబాసిడర్లు హెల్ప్ దిల్లీ బ్రీత్, మహిళా హౌజింగ్ ట్రస్ట్ నిర్వహించే సమావేశాలకు హాజరు కావడమే కాదు ప్రచార వ్యూహాల గురించి కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. ‘కమ్యూనిటీ యాక్షన్ గ్రూప్’గా ఏర్పడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు. ‘వాయు కాలుష్యం గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక గృహిణితో అన్నప్పుడు నా ముఖం మీద తలుపు వేసినంత పనిచేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఈసారి అలా కాదు ఇలా చేయాలనుకున్నాను. దిల్లీలోని నెహ్రూ నగర్‌కు వెళ్లినప్పుడు నా బ్యాగులో ఉన్న కొన్ని పోస్టర్లను ఆమెకు చూపాను. అవి చూసి అయ్యో ఏమిటి ఇది అన్నట్లుగా అడిగింది. అలా మెల్లగా టాపిక్‌ను మొదలుపెట్టాను. ఆమె చాలా శ్రద్ధగా విన్నది. పరిస్థితులను బట్టి ఏ రూట్లో వెళ్లాలో అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే సమస్య ఉండదు’ అంటుంది సీమ అనే ఏక్యూఐ అంబాసిడర్. ‘ఉపన్యాసం ఇచ్చినట్లు కాకుండా మన ఇంటి పరిసరాల్లో ప్రమాదం పొంచి ఉంటే ఎలా చెబుతామో అలా వాయు కాలుష్యం గురించి చెబుతాను. ఉదాహరణలతో అర్థమయ్యేలా చెబుతాను. పెద్దవాళ్లకే సాధ్యం కాని పెద్ద సమస్య ఇది. మన వల్ల ఏమవుతుంది... అని కొందరు అంటారు. మీలా అందరూ అనుకోవడం వల్లే అది పెద్ద సమస్యగా మారింది అని నేను అంటాను. మొదటగా మీరు చేయాల్సింది మీ పెరట్లో ఒక మొక్క నాటడం అని సలహా ఇస్తాను. నేను చెప్పింది వారికి నచ్చినట్లు వారి హావభావాలను బట్టి గ్రహిస్తాను’ అంటుంది ఏక్యూఐ అంబాసిడర్ ముంతాజ్. ఏక్యూఐ అంబాసిడర్ల కృషి వృథా పోవడం లేదు. ఇప్పుడు ఎంతో మంది కాలుష్యాన్ని నియంత్రించే చర్యల గురించి నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నారు. వారు పెద్ద చదువులు చదుకున్నవారేమీ కాదు. సామాన్య మహిళలు. ఏక్యూఐ అంబాసిడర్ల విజయానికి ఇది ఒక ఉదాహరణ. మార్పు మొదలైంది... జరీనా ప్రతిరోజూ ఏక్యూఐ మానిటర్‌తో ఉదయం, సాయంత్రం వివిధ ప్రాంతాలలో పొల్యూషన్ లెవెల్స్‌ను చెక్ చేస్తుంది. ‘కొన్నిసార్లు కాలుష్యం తక్కువగా, మరికొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఏక్యూఐ మానిటర్‌పై ఎరుపు రంగు కనిపిస్తుంది. కొత్త సంఖ్యలు కనిపిస్తాయి. ఒకప్పుడు వాయుకాలుష్యం గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే ఇప్పుడు చాలామందిలో మార్పు రావడాన్ని గమనించాను’ అంటుంది జరీనా.ఏక్యూఐ అంబాసిడర్ అయిన జరీనా వాయునాణ్యత, వెంటిలేషన్, బొగ్గు పొయ్యిలకు దూరంగా ఉండడం... మొదలైన అంశాలపై దిల్లీ గల్లీలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇలా కూడా... వాడ వాడలా తిరుగుతూ వాయుకాలుష్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు లేబర్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, పీఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్, సుమన్ యోజనలాంటి ప్రభుత్వ సామాజిక, సంక్షేమ పథకాల గురించి భనన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు తెలియజేస్తున్నారు ఏక్యూఐ అంబాసిడర్లు. స్కీమ్‌కు సంబంధించిన పత్రాలు నింపడం నుంచి ఐడీ కార్డ్‌లు వారికి అందేలా చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయం అందిస్తున్నారు. -
Manipur violence: రేప్ చేసి, రంపాలపై పడేసి...
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటన జరిగిన రోజే అక్కడికి 40కి.మీ. దూరంలో మరో దారుణం జరిగింది. కుకి–జోమి తెగకు చెందిన ఇద్దరు యువతుల్ని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసు స్టేషన్లో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ ద్వారా వెల్లడైంది. బాధిత యువతులు 21, 24 ఏళ్ల వయసున్న వారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని కొనుంగ్ మమాంగ్ ప్రాంతంలో కార్లు వాష్ చేసేవారు. మే 4న వారు కార్లు కడుగుతూ ఉండగా అల్లరిమూక కొందరు అక్కడికి వచ్చి దౌర్జన్యంగా వారిని పక్కనే ఉన్న గదిలోకి లాక్కెళ్లారు. వాళ్లు అరవకుండా నోటికి గుడ్డలు కట్టేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినట్టుగా జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఆ తర్వాత ఆ ఇద్దరు యువతుల్ని దుండగులు పక్కనే ఉన్న రంపం మిల్లులోకి లాగి పడేశారు. రంపాల మీద పడేయడంతో వారు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆ ఇద్దరు యువతుల్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకువెళ్లడం తాము చూశామని వారి స్నేహితులు చెబుతున్నారు. మరణించిన ఇద్దరు యువతుల్లో ఒకరి తల్లి సాయికుల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాదాపుగా 100–200 మంది దుండగులు రాక్షసంగా తమ కుమార్తె, ఆమె స్నేహితురాల్ని అత్యాచారం చేసి, హింసించి చంపేశారని ఆమె అందులో పేర్కొన్నారు. వీడియో ఘటనలో మరో నిందితుడు అరెస్ట్ మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై అమానవీయ ఘటనలో పోలీసులు అయిదో నిందితుడిని అరెస్ట్ చేశారు. 19 ఏళ్ల వయసున్న యువకుడిని అదుపులోనికి తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆ వీడియోలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. మణిపూర్‌లో వెలుగులోకి మరో భయానక ఘటన ఇటీవల మణిపూర్‌లో జరిగిన రెండు వర్గాల ఘర్షణల్లో ఓ స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను కొందరు దుండగులు సజీవదహనం చేశారు. ఆమెను లాక్కెళ్లి ఇంట్లో తాళం వేసి నిప్పంటించారు. దీనిపై పోలీసు కేసు కూడా నమోదైంది. కక్చింగ్ జిల్లాలోని సిరోయూ గ్రామంలో మే 28న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. -
హిమాచల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా దివ్యాంగ మహిళలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు దివ్యాంగ మహిళలు అరుదైన ఘనత సాధించారు. అంధులైన వీరిద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులయ్యారు. పట్టుదల, అంకితభావంతో తమ కలలను నిజం చేసుకున్నారు. రైతు కుటుంబంలో జని్మంచిన ముస్కాన్ ప్రముఖ గాయకురాలు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికల సంఘం యూత్ ఐకాన్‌గా ఇప్పటికే గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో రాజ్‌కియా కన్య మహావిద్యాలయలో సంగీతంలో ప్రవేశం పొందారు. ఇప్పుడు అదే విద్యాసంస్థలో సంగీతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ముస్కాన్ చురుగ్గా ఉంటున్నారు. సాధారణమధ్య తరగతి కుటుంబంలో జని్మంచిన ప్రతిభా ఠాకూర్ సైతం అంధురాలు. పీహెచ్డీ పూర్తిచేశారు. విద్యా రంగంలో సేవలు అందించాలన్నది ఆమె చిన్నప్పటి కల. రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితురాలైంది. -
ఫ్రీ నస్రీన్.. ఫ్రీ లోజైన్ విడుదల ఉద్యమం
నస్రీన్, లోజైన్.. ఈ ఇద్దరూ అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలు. ఇద్దరిలో ఒకరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇంకొకరు జైలు వంటి నిర్బంధంలో బయట ఉన్నారు. జైల్లో ఉన్న నస్రీన్‌కు కరోనా వచ్చిందని తాజా సమాచారం! జైలు బయట ఉన్న లోజైన్.. డేగ కళ్ల నిఘాల మధ్య తన అనుదిన జీవితాన్ని గడుపుతున్నారు. ఇద్దరూ రెండు దేశాల వాళ్లు. వీళ్ల కోసం ఇప్పుడు అంతర్జాతీయ సమాజం గళమెత్తింది. ‘ఫ్రీ సస్రీన్.. ఫ్రీ లోజైన్’ అని ఉద్యమించింది. హక్కుల కోసం పోరాడుతున్న మహిళ హక్కుల కోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెట్ బయట, నెట్ లోపల ‘ఫ్రీడమ్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్’ అంటూ నిరసనలు, ప్రదర్శనలు మొదలయ్యాయి. నస్రీన్ సొటుడే (57) లాయర్. మానవ హక్కుల కార్యకర్త. స్త్రీ హక్కుల ఉద్యమకారిణి. ఆమె రచనలు, ప్రసంగాలు, సమావేశాలు.. దేశంలో రాజకీయ అస్థిరతకు కారణం అవొచ్చంటూ ఇరాన్ ప్రభుత్వం 2018 జూన్‌లో ఆమెను అరెస్ట్ చేసింది. 38 ఏళ్ల జైలు శిక్ష విధించి, 148 కొరడా దెబ్బలు కొట్టించింది! టెహ్రాన్ సమీపంలో ఆమెను ఉంచిన కర్చక్ జైలు అత్యంత దారుణమైనది, అపరిశుభ్రమైనది. పైగా నస్రీన్ ఇప్పుడు కరోనా బారిన కూడా పడ్డారు. ఆమెను తక్షణం విడిపించి వైద్య చికిత్సకు తరలించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ కోరుతోంది. లోజైన్ అల్హత్లౌల్ (31) ప్రజా న్యాయవాది. మహిళా హక్కుల కార్యకర్త. ప్రజల తరఫున ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సౌదీ అరేబియా పాలకులకు నచ్చలేదు. అమెను తక్షణం నిలువరిం^è కపోతే దేశ సార్వభౌమాధికారానికే ప్రమాదం అని తలచారు. 2018 మే లో అమెను అరెస్ట్ చేశారు. వెయ్యి రోజులు జైలు శిక్షను అనుభవించాక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారు. అలాగని స్వేచ్చగా ఉండేందుకు లేదు. మూడేళ్ల ‘గమనింపు’ కాలం విధించారు. ఈ మూడేళ్లూ ఆమె ప్రభుత్వ సమ్మతి లేకుండా అడుగు తీసి అడుగు వేయడానికి లేదు. నోరు తెరిచి మాట్లాడటానికి లేదు. ఏ విధమైన రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనకూడదు. పాల్గొంటే మళ్లీ జైలు శిక్ష. వెయ్యి రోజుల శిక్షాకాలంలో అనేక విధాలైన హింసలకు గురయ్యారు లోజైన్. ‘ఆమ్నెస్టీ’ ఈమె కోసం కూడా పోరాడుతోంది. లోజైన్ పై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయమని డిమాండ్ చేస్తోంది. నస్రీన్, లోజైన్ మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలలో ఇంకా ఎంతో మంది మహిళా హక్కుల కార్యకర్తలు జైళ్లలోనూ, జైలు వంటి నిర్బంధాలలోనూ దుర్భమైన జీవితాలను గడుపుతున్నారు. వారందరి కోసం ఇప్పుడు ఆమ్నెస్టీ తో పాటు, ‘పెన్’ (పొయెట్స్, ఎడిటర్స్, నావెలిస్ట్స్) అమెరికా, ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్, ప్రసిద్ధ అమెరికన్ మ్యాగజీన్ ‘మిస్’, సెంటర్ ఫర్ ఉమెన్స్ గ్లోబల్ లీడర్షిప్ ఉద్యమించాయి. -
హిమాలయాలకు పెడల్ తొక్కారు...
24 ఏళ్ల సబిత మహతో, 21 ఏళ్ల శ్రుతి రావత్ ఇప్పుడు హిమాలయాలతో సంభాషిస్తున్నారు. ధ్వని లేదు. కాలుష్యం లేదు. నాలుగు కాళ్లు, నాలుగు పెడల్స్... అంతే. కశ్మీరులోని పీర్ పంజిల్ శ్రేణి నుంచి నేపాల్‌లోని మహాభారత శ్రేణి వరకు 5,600 కిలోమీటర్ల ‘ట్రాన్స్ హిమాలయా’ను వారు 85 రోజుల్లో సైకిళ్ల మీద చుట్టేయనున్నారు. స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ‘ఒన్ బిలియన్ రైజింగ్’ కాంపెయిన్లో భాగంగా వారు ఈ సాహసకార్యం చేస్తున్నారు. ఫిబ్రవరి 2న మొదలైన వీరి యాత్ర ప్రస్తుతం సిక్కింలో కొనసాగుతోంది. వీరి పరిచయం... వన్ బిలియన్ అంటే 100 కోట్లు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఫ్రపంచ జనాభాలోని ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు లేదా సగటున 100 కోట్ల మంది స్త్రీలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా హింసకు లేదా అత్యాచారానికి లోనవుతున్నారు. ఆ 100 కోట్ల మంది స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకం గా చైతన్యం, ప్రచారం కలిగించాలని అమెరికన్ ఫెమినిస్ట్ ‘ఈవ్ ఎన్స్లర్’ మొదలెట్టిన కార్యక్రమమే ‘వన్ బిలియన్ రైజింగ్’. ఈ కార్యక్రమం లో భాగంగా పర్వతారోహకులు సబితా మహతో, శ్రుతి రావత్‌లు చేస్తున్న సైకిల్ యాత్రే ‘రైడ్ టు రైజ్’. హిమాలయ పర్వత శ్రేణులలో సైకిల్ తొక్కుతూ స్త్రీ హింసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ దాదాపు 85 రోజుల పాటు వీరు యాత్ర చేస్తారు. ఫిబ్రవరి 2న నాటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఈ యాత్రను ప్రారంభించారు. అంతేకాదు తమ రాష్ట్రానికి చెందిన శ్రుతి రావత్ ఈ యాత్ర చేస్తున్నందున లక్షన్నర రూపాయల ఆర్థికసాయం కూడా చేశారు. ఇద్దరు అమ్మాయిలు బిహార్‌కు చెందిన సబిత మహతో, ఉత్తరాఖండ్‌కు చెందిన శ్రుతి రావత్ ఈ యాత్ర చేస్తున్నారు. అట్టారి సరిహద్దు దగ్గర మొదలెట్టిన ఈ యాత్ర ‘ట్రాన్స్ హిమాలయ’గా పేరు పొందిన ఆరు హిమాలయ శ్రేణులను కవర్ చేయనుంది. పంజాబ్, జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, నేపాల్‌ల గుండా హిమాలయాల అంచులను తాకుతూ వీరిరువురూ సైకిళ్ల మీద కొనసాగుతారు. 5 వేల కిలోమీటర్లకు పైగా ఉండే ఈ దూరం వీరు పూర్తి చేసేందుకు మూడునెలలు పట్టొచ్చు. అయినా మాకు ఇలాంటి సాహసాలు అలవాటే అని వీరు అంటున్నారు. అనడమే కాదు ఇప్పటివరకూ విజయవంతంగా యాత్ర చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. చేపలు అమ్మే వ్యక్తి కుమార్తె సబితా మహతో ఒక చేపలు పట్టే వ్యక్తి కుమార్తె. వీళ్లది బిహార్ అయినా తండ్రి కోల్‌కతా వెళ్లి చేపల పని చూసుకొని వస్తుంటాడు. ‘మా నాన్న నేను పర్వతారోహణ స్కూల్లో చేరతానంటే మనకెందుకమ్మా అన్నాడు. కాని డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్లో నేను 2014లో చేరి పర్వతాలు ఎక్కడం మొదలెట్టాక ఎంతో సంతోషపడ్డాడు. ఇప్పుడు మా నాన్న నేను ఏ పని చేసినా మెచ్చుకుంటాడు’ అంటుంది సబితా. ఈమె ఇప్పటికే హిమాలయాల్లోని అనేక ముఖ్య శిఖరాలను అధిరోహించింది. ఎవరెస్ట్ అధిరోహించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ‘ఎవరెస్ట్‌ను ఎక్కిన దారిలోనే ఎవరూ దిగరు. నేను మాత్రం ఎక్కినదారిలోనే దిగి రికార్డు సృష్టించాలనుకుంటున్నాను’ అంటుంది. ప్రస్తుతం ఆమె స్పాన్సర్ల అన్వేషణలో ఉంది. స్త్రీల కోసం భూమి కోసం ‘స్త్రీల హింస అంటే జన్మనిచ్చిన తల్లి మీద హింస చేయడం. అది పురుషుడు కొనసాగిస్తున్నాడు. అలాగే నేల తల్లి మీద కూడా కాలుష్యం, విధ్వంసంతో పీడన కొనసాగిస్తున్నాడు. మేమిద్దరం చేస్తున్న యాత్ర స్త్రీలపై హింసను మానుకోమని చెప్పడమే కాదు అందమైన ప్రకృతి స్త్రీ మీద కూడా హింస నివారించమని అందరినీ అభ్యర్థిస్తుంది. మా సైకిల్ యాత్రలో ఆంతర్యం సైకిల్ కాలుష్యం కలిగించదు. ఇలాంటి ఎరుకతో ఈ భూమి తల్లిని కాపాడుకొని భావితరాలకు అందజేయమని కోరుతున్నాం’ అన్నారు సబిత, శ్రుతి. యాత్ర ఇలా సాగుతోంది ‘మేమిద్దరం రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 7.30 వరకూ యాత్ర కొనసాగిస్తాం. ఆ తర్వాత ఆ గమ్యంలోని హోటల్లో బస చేస్తాం. ఇప్పటివరకూ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఘటనలు జరగలేదు. దారి పొడవునా జనం మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు చెడ్డవాళ్లను చూసి మనుషులందరూ చెడ్డవాళ్లనుకోకూడదు. ఇంట్లోనే ఉంటే లోకం చాలా ప్రమాదం అనిపిస్తుంది. లోకాన్ని చూడటం మొదలెడితే ఇది కూడా ఎంతో ఆదరణీయమని అర్థమవుతుంది’ అన్నారు వారిద్దరూ. వారి యాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
ఇద్దరు వనితల ఆస్కార్ చరిత్ర
ఆస్కార్ చరిత్రలోనే తొలిసారి ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఒకే ఏడాది ఇద్దరు మహిళలు నామినేట్ అయ్యారు! ‘నో మాడ్ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’.. అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన క్లోయీ జావో, ఎమరాల్డ్ ఫెనెల్.. ఇద్దరూ నలభై ఏళ్ల లోపు వారే. ఈ మార్చి 31 న క్లోయీ ఝావో జరుపుకునే తన 39వ జన్మదినం తప్పనిసరిగా ప్రత్యేకమైనదై ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు ఈసారి ఆమెకు ఆస్కార్ ఆకాంక్షలు తెలిపేవారూ ఉంటారు. ఆమె దర్శకత్వం వహించిన అమెరికన్ డ్రామా ఫిల్మ్ ‘నోమాడ్‌ల్యాండ్’ కు ఆరు నామినేషన్లు దక్కడం ఆ ఆకాంక్షలకు ఒక కారణం అయితే, వాటిల్లో సగానికి సగం.. ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ ఆడాప్టెడ్ స్క్రీన్‌ప్లే’, ‘బెస్ట్ ఫిల్మిం ఎడిటింగ్’ కేటగిరీలలో క్లోయీ ఝావో నామినేషన్ పొందడం మరొక విశేషం. ఇప్పటివరకు ఆమె దర్శకత్వం వహించింది మూడంటే మూడే సినిమాలు అయినా.. వచ్చిన అవార్డులు, పొందిన నామినేషన్లు ముప్పైమూడు! తొలి సినిమా ‘సాంగ్స్ మై బ్రదర్స్ టాట్ మి’ (2015), రెండో సినిమా ‘ది రైడర్’ (2017), మూడోది ఇప్పుడీ ‘నోమాడ్‌ల్యాండ్’ (2020). ఝావో చైనా మహిళ. జడను ముందుకు వేసుకుంటే సుమారుగా మన ఇండియన్లా ఉంటారు. ఉండటం అమెరికాలో. బి.ఎ. చదివిందీ, ఎం.ఎఫ్.ఎ. చేసిందీ అమెరికాలోనే. సినిమాలు తియ్యాలన్న అభిలాష తల్లిదండ్రులనుంచేమీ ఆమెకు రాలేదు. తండ్రి బీజింగ్‌లోని ఒక స్టీల్ ప్లాంట్‌లో మేనేజర్. తల్లి హాస్పిటల్ లో వర్కర్. ఝావో కొంచెం దూకుడు. స్కూల్లో సోమరి. తనే ఆ మాట చెప్పుకుంటారు. క్లాస్ రూమ్‌లో జపాన్ వాళ్ల ‘మాంగా’ గ్రాఫిక్ నవలల్ని బుక్స్ మధ్యలో పెట్టుకుని లీనమైపోయి చదివారు. అవి బుర్రలో పని చేస్తున్నప్పుడు తనూ కొన్ని కాల్పనిక పాత్రల్ని సృష్టించారు. ఇలాంటి వాళ్లకు సినిమాలు నచ్చుతాయి. ఝావో తన టీనేజ్‌లో విపరీతంగా సినిమాలు చూశారు. కూతురు మాట వినడం లేదని, తనకు అస్సలు ఇంగ్లిష్ తెలియకపోయినా పేరెంట్స్ ఆమెను లండన్ తీసుకెళ్లి అక్కడో బోర్డింగ్ స్కూల్లో చేర్చి వచ్చారు. తల్లిదండ్రుల ఇష్టం లండన్. తన ఇష్టం లాస్ ఏంజెలిస్. హై స్కూల్ చదువు కోసం లాస్ ఏంజెలిస్ వెళ్లిపోయి, అక్కడే ఉండిపోయారు ఝావో. మొదటి సినిమా తీసేటప్పటికి ఆమె వయసు 33. ప్రస్తుతానికి ఆమె జీవిత భాగస్వామి సినిమాలే. సినిమాలు చూడటం, సినిమాలు తీయడం. సినిమాకు ఎన్ని ఫ్రేములైతే ఉంటాయో, రోజుకు అన్ని గంటలపాటు సినిమాలకు పని చెయ్యడం! క్లోయీ ఝావోకు నామినేషన్ దక్కడంతో ఆస్కార్ చరిత్రలో ‘బెస్ట్ ౖyð రెక్టర్’గా నామినేట్ అయిన తొలి ఆసియా మహిళగా గుర్తింపు పొందారు. ∙∙ ఎమరాల్డ్ ఫెనెల్.. ఝావో కన్నా నాలుగేళ్లు చిన్న. బొద్దుగా, ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్‌లా ఉంటారు. ఎప్పుడూ పుస్తకాలు చదువుతుంటారు. బ్రిటన్ మహిళ. నటి, రచయిత్రి, దర్శకురాలు. ఝావో ‘నోమాడ్‌ల్యాండ్’తోపాటు ఫెనెల్ దర్శకత్వం వహించిన ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ చిత్రం కూడా ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ యాక్ట్రెస్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’, ‘బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్’ కేటగిరీలకు కూడా ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ నామినేట్ అయింది. ఝావోలా ఫెనెల్ కూడా మూడు నామినేషన్లు పొందారు. బెస్ట్ డైరెక్టర్‌తోపాటు.. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ పే’్ల కేటగిరీల్లో ఆమెకు చోటు లభించింది. ఫెనెల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే నామినేషన్ దక్కడం ఒక విధంగా అవార్డు రావడమే. నోమాడ్‌ల్యాండ్, ప్రామిసింగ్ యంగ్ ఉమన్ ఫెనెల్ ప్రధానంగా నటి. 2010 నుంచీ ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. లండన్‌లో పుట్టారు. ఆక్స్‌ఫర్డ్‌లో బి.ఎ. చదివారు. తర్వాత సిట్కామ్ (సిట్యువేషనల్ కామెడీ) షోలలోకి వెళ్లారు. సినిమా కథలు, స్క్రిప్టులు రాశారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ రెండు చిత్రాలు.. నోమాడ్‌ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ల కథాంశం కూడా మహిళలదే కావడం యాదృచ్చికమే. తన అరవైలలో ఉన్న మహిళ ‘గ్రేట్ రిసెషన్’ కాలంలో సర్వం కోల్పోయి వ్యాన్‌లో దేశ దిమ్మరిగా గడపడం నోమాడ్ ల్యాండ్ స్టోరీ అయితే.. జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చిన ఒక మహిళ కథ ప్రామిసింగ్ యంగ్ ఉమన్. ఈ రెండు చిత్రాలలో ఏ చిత్ర దర్శకురాలికి ఆస్కార్ వచ్చినా.. వారు ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఆస్కార్ పొందిన రెండో మహిళ అవుతారు. మొదటి మహిళ క్యాథ్రిన్ బెగెలో. 2010లో ‘హర్ట్ లాకర్’ అనే చిత్రానికి ఆమెకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. నామినేషన్‌కే 48 ఏళ్లు పట్టింది! తొంభై ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు (క్లోయీ, ఫెనెల్ లను మినహాయించి) ఐదుగురు మహిళలు మాత్రమే బెస్ట్ ౖyð రెక్టర్లుగా నామినేట్ అయ్యారు. 1976లో లీనా వెర్ట్మ్యూలర్ (సెవెన్ బ్యూటీస్), 1993లో జేన్ క్యాంపియన్ (ది పియానో), 2003లో సోఫియా కొప్పోలా (లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్), 2010లో క్యాథ్రీన్ బిగెలో (ది హర్ట్ లాకర్), 2017లో గ్రెటా గెర్విగ్ (లేడీ బర్డ్) నామినేట్ అవగా.. క్యాథ్రీన్ బిగెలోకు అవార్డు వచ్చింది. ఇక బెస్ట్ డైరెక్టర్‌గా ఒక మహిళ ఆస్కార్‌కు నామినేట్ అవడానికైతే 48 ఏళ్లు పట్టింది. ఆస్కార్ తొలి మహిళా ‘బెస్ట్ డైరెక్టర్’ క్యాథ్రీన్ బిగెలో. -
శబరిమలలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ భక్తురాళ్లు
-
షెల్టర్ హోంలో ఇద్దరు మహిళల మృతి
పట్నా: బిహార్ రాజధాని పట్నాలోని ఓ మానసిక వికలాంగుల కేంద్రంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. నేపాలినగర్లోని ‘ఆసరా’ అనే షెల్టర్‌హోంలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వం వేర్వేరు కారణాలు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. 17, 40 ఏళ్లున్న ఇద్దరు మహిళలను ఆగస్టు 10 అర్ధరాత్రి దాటిన తరువాత ఆసుపత్రి తీసుకెళ్లగా, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంగతిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైన షెల్టర్ హోం, ఆసుపత్రి వర్గాలపై పట్నా ఐజీ ఎన్‌హెచ్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, వారికి చికిత్స జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలోనే చనిపోయారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. ఆ హోం లో వారిని పారిపోవాలంటూ బహుమతులు ఆశచూపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన తరువాతి రోజే ఇద్దరు మృతిచెందారు. -
ఫోర్బ్స్ జాబితాలో భారత మహిళలు
న్యూయార్క్: అమెరికాలో స్వయం కృషితో అత్యంత ధనవంతులుగా ఎదిగిన 60 మంది మహిళల నాలుగో వార్షిక జాబితాను ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత సంతతికి చెందిన జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథీలు చోటు దక్కించుకున్నారు. అరిస్టా నెట్వర్క్స్ సీఈవో, ప్రెసిడెంట్‌గా ఉన్న ఉల్లాల్ రూ.9,250 కోట్ల సంపదతో జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. ఐటీ సంస్థ సైన్‌టెల్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్న సేథీ రూ.6,844 కోట్ల సంపదతో 21వ స్థానం సాధించారు. అమెరికా గృహ నిర్మాణ సంస్థ ఏబీసీ సప్లై సంస్థ చైర్మన్ డయానే హెన్డ్రిక్స్ రూ.33,547 కోట్ల సంపదతో జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. మూడేళ్లలో రూ.6,164 కోట్ల విలువైన కాస్మెటిక్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన అమెరికా టీవీ స్టార్ కైలీ జెన్నర్(20) జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. -
ఈ యాచకులు.. కోటీశ్వరులు!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరూ మహిళలు.. ఉన్నత చదువులు చదివారు.. విదేశాల్లో జీవించారు.. కోట్లలో ఆస్తులు.. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. కానీ ఇప్పుడా కళ్లలో దైన్యం.. మాటల్లో నిస్సహాయత.. ఆవేదన.. ఒక్క రూపాయి కోసం చేతులెత్తి యాచిస్తున్న తీరు.. హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్ దర్గా వద్ద భిక్షమెత్తుకుంటున్న ఫర్జానా, రబియా బసిరి అనే ఇద్దరు మహిళల వ్యథ ఇది. హైదరాబాద్ నగరంలో ఉన్న యాచకులందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పోలీసులు.. వీరిని చర్లపల్లిలోని ఆనందాశ్రమానికి తరలించారు. అక్కడ వీరి మాటతీరు, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతుండటాన్ని గుర్తించిన అధికారులు వారి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి కథ విన్నకొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. భర్త పోయిన వేదనతో.. హైదరాబాద్‌లోని ఆనంద్‌బాగ్‌కు చెందిన ఫర్జానా హైదరాబాద్‌లోనే డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. తర్వాత అక్కడే కొన్నేళ్లపాటు అకౌంట్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేసింది. తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక ఇస్మాయిల్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి అలీ అనే కుమారుడు ఉన్నాడు. తర్వాత కూడా ఆమె పై చదువులపై దృష్టి సారించింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, బాధల సుడిగుండాలను ఎదుర్కొంది. ఇటీవల భర్త మరణించడంతో మానసికంగా బాగా కుంగిపోయింది. ప్రశాంతంగా ఉంటుందంటూ లంగర్‌హౌజ్ దర్గాకు వచ్చి ఉండిపోయింది. దర్గాకు వచ్చే భక్తుల వద్ద యాచిస్తూ బతుకుతోంది. ప్రస్తుతం ఆమె వయసు సుమారు 60 ఏళ్లు. బాబా ఆశీర్వాదంతో ఆమె బాగుపడుతుందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఇటీవలి స్పెషల్ డ్రైవ్‌లో ఫర్జానాను గుర్తించిన పోలీసులు చర్లపల్లిలోని ఆనందాశ్రమానికి తరలించారు. ఇది తెలిసిన అలీ.. పోలీసులను సంప్రదించి తన తల్లిని తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. దగ్గరి వాళ్లే మోసం చేస్తే.. రబియా బసిరిది కన్నీటి గాథ. హైదరాబాద్‌లోని డిఫెన్స్ కాలనీకి చెందిన బసిరికి 15 ఏళ్ల కింద అమెరికాలో హోటల్ వ్యాపారం చేస్తున్న మహ్మద్ అబ్దుల్ నయీంతో వివాహమైంది. ఆయనకు ఆమె మూడో భార్య. అక్కడ వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇద్దరు పిల్లలు కలిగారు. కొన్నేళ్ల కింద ఆమె తండ్రి చనిపోవడంతో హైదరాబాద్‌కు వచ్చింది. కానీ తండ్రి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా బాగా కుంగిపోయింది. ఆమెకు అమెరికా గ్రీన్‌కార్డు ఉన్నా.. తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. వారికి హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను చూసుకుందామనుకుంది. కానీ బంధువులు, దగ్గరివారు ఆమెను మోసం చేసి ఆ ఆస్తులను కొల్లగొట్టారు. దీంతో రోడ్డున పడ్డ బసిరి.. చివరికి లంగర్‌హౌజ్ దర్గాకు చేరుకుంది. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే బసిరి కథ విని జైలు అధికారులు కూడా చలించిపోయారు. అయితే ఆమె సోదరుడు వచ్చి హామీ ఇవ్వడంతో బసిరిని ఇంటికి పంపించారు. -
మహిళపై సామూహిక అత్యాచారం
హయత్‌నగర్(ఇబ్రహీంపట్నం): అర్ధరాత్రి బస్సు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని తీసుకువెళ్తూ మధ్యలో అత్యాచారానికి యత్నించారు. వారి ప్రవర్తనను పసిగట్టిన ఓ మహిళ మార్గమధ్యలో కారులోంచి కిందికి దూకి పారిపోయిగా మరో మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన సోమవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. చంపాపేట్‌కు చెందిన ఓ మహిళ(33) చీరల వ్యాపారి. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి సమీపంలో నివసించే మరో మహిళ(30)తో పరిచయం ఏర్పడింది. వీరు హయత్‌నగర్‌కు వెళ్లేందుకు దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా గుడి సమీపంలో బస్సు కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఓ కారులో వచ్చి హయత్‌నగర్‌లో దింపుతామని మహిళలను కారెక్కించుకున్నారు. మద్యం మత్తులో ఉన్న దుండగులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. హయత్‌నగర్ వద్ద కారును ఆపకుండా ముందుకు తీసుకెళ్లారు. దీంతో ఓ మహిళ పెద్దంబర్‌పేట్ వద్ద కారులోంచి కిందికి దూకేసింది. దుండగులు మరో మహిళను ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్‌రోడ్డు నుంచి గండిచెర్వు వైపు నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అటువైపుగా వచ్చిన పోలీసు వాహనం సైరన్ మోత విన్న కామాంధులు మహిళ వద్ద ఉన్న రూ.2 వేల నగదును, ఓ సెల్‌ఫోన్‌ను తీసుకుని పారిపోయారు. అక్కడి నుంచి రోడ్డుపైకి వచ్చిన బాధిత మహిళ ఓ డీసీఎం వ్యాను ఎక్కి ఇంటికి చేరుకుంది. అనంతరం కారుదూకి వెళ్లిన మహిళతో కలసి వచ్చి హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇద్దరు కిలేడీలు అరెస్ట్
తుర్కయంజాల్: మాటలతో నమ్మించి, మోసం చేసి దుస్తులను చోరీ చేసి అమ్మడానికి వెళ్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైమ్ ఎస్సై సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మంకు చెందిన నల్లగొండ నారాయణ భార్య రమాతులసి (45), బాలసాని రవి భార్య కుమారి (40)లు ఇద్దరు కలిసి ఈ నెల 19న వనస్థలిపురంలోని గేట్‌వేకాలనీలోగల కాటన్ ఎక్స్పో బట్టల దుకాణంలోకి వెళ్లారు. అనంతరం వీరితో పాటు వీరికి చెందిన మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అంతా కలిసి బట్టలు కావాలంటూ బేరసారాలు చేశారు. ఈ సమయంలో వారు సుమారు 200పైగా టీషర్ట్‌లతోపాటు కొన్ని చీరలను కళ్లుగప్పి ఎత్తుకెళ్లారు. అనంతరం ఈ నెల 20న ఉదయం వేళలో ఎస్కేడీనగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీలలో ఉన్న పోలీసు సిబ్బందికి అనుమానాస్పదంగా బట్టల మూటలు తీసుకెళ్తూ పట్టుబడ్డారు. వీరిని విచారించగా సుమారు రూ.1.70 లక్షల విలువ చేసే బట్టలు పట్టుబడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు మహిళలను రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు మహిళలు పరారీలో ఉన్నారు. -
ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
సేలం: సేలం కలెక్టరేట్లో ఇద్దరు మహిళలు వేర్వేరు సమయాల్లో ఆత్మాహుతి యత్నాలు చేశారు. తమ శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునే యత్నం చేశారు. ఆ మహిళల్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఓమలూరుకు చెందిన ఇలంగో కూలీ కార్మికుడు. ఆయన భార్య శాంతి(48) సోమవారం ఉదయం సేలం కలెక్టరేట్‌కు వచ్చింది. తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను మీద పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేసింది. దీన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారనలో 2012లో అనారోగ్యంతో ఓమలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. అయితే, వాళ్లు తన గర్భ సంచి తొలగించినట్టు వివరించారు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, చివరకు కోర్టును ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ఆ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవడంలో ఓమలూరు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని, స్వయంగా సేలం కమిషనర్ అమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే సేలం కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానని, అందుకు అనుమతి లభించని దృష్ట్యా, ఆత్మహుతి యత్నం చేసినట్టు పేర్కొన్నారు. ఈమెను అదుపులోకి తీసుకుని అలా పోలీసు స్టేషన్‌కు తరలించారో లేదో, మరో మహిళ హఠాత్తుగా లోనికి ప్రవేశించి ఆత్మాహుతి యత్నం చేయడం కలకలం రేపింది. ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. నామక్కల్‌జిల్లా రాశిపురానికి చెందిన గుణశేఖరన్ భార్య రాణిగా ఆమెను గుర్తించారు. ఆమె భర్త సేలం జైలులో హెడ్ వార్డెన్‌గా పనిచేసి పదవీ విరమణ పొందినట్టు తేలింది. ఆయనకు వచ్చిన పెన్షన్ రూ.7 లక్షలను జైలర్ జయరామన్, ఆయన భార్య అరుణ, స్నేహితుడు భూపతిలో మింగేసినట్టు తేలింది. తమకు ఇళ్లు ఇస్తామని నమ్మబలికి ఆ ఏడు లక్షల్ని తీసుకుని మోసం చేశారని, ఈ విషయంగా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వాళ్లు లేక చివరకు ఆత్మాహుతి చేసుకుందామని ఇక్కడికి వచ్చినట్టు పేర్కొన్నారు. -
ఇద్దరు మహిళలు, ఒక బాలుడి అదృశ్యం
యానాం టౌన్: యానాంలోని అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తున్న ఇద్ద రు మహిళలు, ఒక బాలుడు అదృశ్యమయ్యారు. వివాహితలు దారా కృష్ణవేణి, దారా లలితాదేవి, బాలుడు అఖిల్‌కుమార్ గత నెల జనవరి 18 నుంచి కనిపించడం లేదని భర్త దారా రవికుమార్ బుధవారం సాయంత్రం యానాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఎస్సై అబ్బులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...దారా రవికుమార్‌కు తొమ్మిది సంవత్సరాల క్రితం కృష్ణవేణితో వివాహం జరిగింది. అయితే కృష్ణవేణి అనారోగ్యం దృష్ట్యా ఆమె చెల్లెలు లలితాదేవిని కూడా రవికుమార్‌కు ఇచ్చి వివాహం చే శారు. కృష్ణవేణి కుమారుడు అఖిల్‌కుమార్. ఈ కుటుంబం కొంతకాలంగా స్థానిక అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తోంది. లలితాదేవిని రవికుమార్ బీఈడీ చదివిస్తున్నాడు. అయితే ఆమె క్లాసులకు సరిగ్గా వెళ్లడం లేదని భర్త రవికుమార్ మందలించాడు. అదే రోజు నుంచి వారు కనిపించడం లేదని రవికుమార్ తమకు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రవికుమార్ గుల్ల వ్యాపారం చేస్తున్నాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
మాటల్లో గారడీ.. ప్రయాణంలో దోపీడీ
సిద్దిపేట రూరల్ : డబ్బును దాచేందుకు ఆటోలో బ్యాంక్‌కు వెళ్తున్న ఓ వృద్ధురాలిని మాటలతో మస్కా కొట్టిన ఇద్దరు మహిళలు నగదును దోపీడీ చేసిన సంఘటన శుక్రవారం సిద్దిపేట పట్టణంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని బక్రిచెప్యాల గ్రామానికి చెందిన మల్లోజి విజయలక్ష్మి గ్రామానికి చెందిన ఓ ఆటోలో తన వద్ద ఉన్న రూ. 2.50 లక్షలను ఓ చేతి సంచిలో పెట్టుకుని సిద్దిపేటలో ఉంటున్న తన కుమారుడి వద్దకు బయలుదేరింది. ఈ క్రమంలో రాజీవ్ రహదారి పొన్నాల స్టేజీ వద్ద గుర్తుతెలియని ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు పురుషులు ఆటో ఎక్కారు. ఆటోలో ప్రయాణిస్తున్న విజయలక్ష్మిని మాటల్లో పెట్టి ఆమెకు తెలియకుండానే చేతిలో ఉన్న సంచిని కత్తిరించి అందులో గల రూ. 2.50 లక్షలను అనుమానం రాకుండా నొక్కేశారు. పాత బస్టాండ్ వద్ద అందరూ ఆటో నుంచి దిగారు. అప్పటికే ఆటోలో వస్తున్న విజయలక్ష్మి కోసం తన కుమారుడు అక్కడ సిద్ధంగా ఉండడంతో ఆమెను తీసుకుని డబ్బులను జమ చేసేందుకు పట్టణంలోని ఎస్బీహెచ్ బ్యాంక్‌కు తీసుకెళ్లాడు. డబ్బులను జమ చేసే ఓచర్లో పేర్లు రాసి నోట్లు లెక్కించడానికి సంచిని తెరిచి చూడగా అందులోని డబ్బు మాయమైంది. సంచికి కత్తిరించిన ఆనవాళ్లు కనిపించడంతో బాధితురాలు డబ్బులు దోపిడీకి గురయ్యాయని లబోదిబోమంది. వెంటనే కుమారుడితో కలిసి స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని చోరీకి సంబంధించిన వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. వెంటనే పట్టణంలో పోలీసులను అలర్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. -
అప్పుల బాధతో ఇద్దరు మహిళల బలవన్మరణం
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇద్దరు మహిళలను బలిగొన్నాయి. అప్పుల బాధతోపాటు తన ముగ్గురు పిల్లలు వికలాంగులు కావడం, భర్త అనారోగ్యంతో బాధపడుతుండడంతో చిలుకోడు శివారు ఫకీరాతండాలో సర్పంచ్ భార్య ఆత్మహత్యకు పాల్పడగా.. వ్యవసాయానికి చేసిన అప్పులు పెరిగిపోవడంతో తరిగొప్పులలో మరో మహిళ బలవన్మరణానికి పాల్పడింది. చిలుకోడు(డోర్నకల్) : కుటుంబ సమస్యలతో ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని చిలుకోడు గ్రామపంచాయతీ పరిధిలోని ఫకీరాతండాలో మంగళవారం జరిగింది. ఎస్సై రమేష్‌కుమార్ కథనం ప్రకారం.. ఫకీరాతండాలో నివాసముంటున్న చిలుకోడు సర్పంచ్ గుగులోత్ కిషన్‌సాదుకు భార్య జగ్ని(50), ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులు రవి, వెంకన్న, కుమార్తె కౌసల్య పోలియో కారణంగా వికలాంగులుగా మారారు. కౌసల్యకు అదే తండాకు చెందిన ఓ యువకుడితో పెళ్లి చేయగా ఒక పాప పుట్టింది. అరుుతే ఆరు నెలల క్రితం కౌసల్యను భర్త వదిలి వెళ్లడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ముగ్గురు వికలాంగులు కావడంతో తల్లి జగ్ని వారిని కంటికి రెప్పలా కాపాడుతూ కాలం వెళ్లదీస్తోంది. కొద్దిరోజుల క్రితం కిషన్‌సాదు కళ్లకు ఆపరేషన్ కావడం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. దీంతో ఆయన ఆస్పత్రి ఖర్చులతోపాటు తన ఏడెకరాల భూమిలో వ్యవసాయం చేసేందుకు సుమారు ఐదు లక్షల రూపాయలకుపైగా అప్పు చేశాడు. పిల్లలు వికలాంగులు కావడం, భర్త అనారోగ్యం పాలవడం, అప్పులు కావడంతోపాటు కుటుంబ తగాదాల నేపథ్యంతో తీవ్ర మనోవేదనకు గురైన జగ్ని మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. చుట్టుపక్కలవారు గమనించేసరికి మృతిచెంది ఉంది. పవర్‌స్ప్రేయర్ బాగు చేయించేందుకు డోర్నకల్ వచ్చిన కిషన్‌సాదు విషయం తెలుసుకుని తండాకు వచ్చి జగ్ని మృతదేహాన్ని చూసి కుప్పకూలాడు. కుమారులు, కుమార్తె తల్లి మృతదేహంపై పడి బోరున ఏడ్చారు. పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా కళ్లల్లో పెట్టుకుని కాపాడుకున్న జగ్ని అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఇప్పుడు ఆ కుటుంభాన్ని ఎవరు చూసుకుంటారంటూ తండావాసులు కంటతడి పెట్టారు. మృతదేహాన్ని మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌కుమార్ తెలిపారు.