
భారత సంతతి వ్యక్తికి కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనావర్గంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. రాజ్ షా(32)ను అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా, ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. సమాచార డైరెక్టర్‌గా హోప్ హిక్స్‌ను నియమించినట్లు పేర్కొంది. రిపబ్లికన్ నేషనల్ కమిటీలో పరిశోధన విభాగానికి నేతృత్వం వహించిన షా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు.