వైట్‌హౌస్‌లో మరో రాజీనామా | Sean Spicer Resigns As White House Press Secretary | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌లో మరో రాజీనామా

Published Sat, Jul 22 2017 9:30 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

వైట్‌హౌస్‌లో మరో రాజీనామా

వైట్‌హౌస్‌లో మరో రాజీనామా

న్యూయార్క్‌: అమెరికా శ్వేతసౌదం మీడియా సెక్రటరీ సియాన్‌ స్పైసర్‌ రాజీనామా చేశారు. అతి తక్కువ కాలం మాత్రమే విధులు నిర్వహించిన ఆయన శుక్రవారం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇటీవల ఇక నుంచి తన మీడియా అధికారిక ప్రతినిధిగా వాల్‌స్ట్రీట్‌ ఫైనాన్సియర్‌ అంటోనీ స్క్రాముస్సి ఉండనున్నారని చెప్పిన నేపథ్యంలో స్పైసర్‌ ఇక రాజీనామా చేశారు.

ఈ విషయాన్ని వైట్‌ హౌస్‌ స్పష్టం చేసింది. అయితే, స్పైసర్‌ అనూహ్యంగా బాధ్యతల నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ట్రంప్‌, లీగల్‌, కమ్యునికేషన్‌ బృందాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సియాన్‌ రాజీనామా వారిలో కొంత ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌ అధికార బాధ్యతలు చేపట్టాక ఆయన టీంలో సియాన్‌ కీలక సభ్యుడిగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement