రిజైన్ చేశారుగా.. ఇక ఆయన లైఫ్ అదుర్స్: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినరోజు నుంచీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన సీన్ స్పైసర్ భవిష్యత్తు ఇక వెలిగిపోతుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మీడియాకు సంబంధించిన బాధ్యతల నుంచి తప్పుకున్నందుకే స్పైసర్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ట్రంప్ అనడంపై జర్నలిస్టు సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 'సీన్ స్పైసర్ అద్బుతమైన వ్యక్తి. కానీ ఫేక్ న్యూస్ మీడియా కారణంగా ఆయన అవమానాల పాలయ్యారు. అలాంటి మీడియా స్పైసర్‌ను దారుణంగా దూషించిందని వ్యాఖ్యానించిన ట్రంప్' అనంతరం ఈ విషయంపై ట్వీట్ చేశారు. న్యూయార్క్ వ్యాపారవేత్త, రాజకీయ మద్ధతుదారుడైన ఆంథోనీ స్కారముక్కీని వైట్‌హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా అధ్యక్షుడు ట్రంప్ నియమించారు.
శుక్రవారం ఉదయం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ బాధ్యల నుంచి తప్పుకుంటూ సీన్ స్పైసర్ రాజీనామా చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన్నప్పటి నుంచీ స్పైసర్ ఆ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వైట్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా తనకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారని భావించిన స్పైసర్‌కే చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు మీడియాతో ఎప్పుడు హద్దులుదాటి ప్రవర్తించే వ్యక్తిని సమర్థించడంతో పాటు తమను ఫేక్ న్యూస్ మీడియా అంటూ ట్రంప్ సంబోధించడాన్ని మీడియా ప్రతినిధులు తప్పుపడుతున్నారు. రాజీనామా చేసిన స్పైసర్ అద్బుతమైన వ్యక్తి కానేకాదని, అతనికి కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలియదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sean Spicer is a wonderful person who took tremendous abuse from the Fake News Media - but his future is bright!
— Donald J. Trump (@realDonaldTrump) 22 July 2017