వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిౖకైన డొనాల్డ్ ట్రంప్ తదుపరి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా యువ కరోలిన్ లీవిట్‌ను ప్రకటించారు. ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే జనవరి 20, 2025న 27 ఏళ్ల లీవిట్ కూడా ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపడతారు. కరైన్ జీన్ పియరీ స్థానంలో లీవిట్ కొత్త ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తారు.
ఆమె ట్రంప్ ప్రచారబృందం జాతీయ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో లీవిట్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ‘ప్రచార పర్వంలో లీవిట్ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె తెలివైన వారు. ధృఢచిత్తురాలు. సమర్థురాలిగా రుజువు చేసుకున్నారు’అని ట్రంప్ ఆమె నియామక ప్రకటన సందర్భంగా పేర్కొన్నారు. కొత్త బాధ్యతల్లోనూ ఆమె రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment