మా దేశానికి ట్రంప్‌.. పాక్‌ మీడియా కలరింగ్‌.. వైట్‌హౌస్‌ వార్నింగ్‌ | White House Dismisses Reports On Donald Trump Pakistan Visit, TV Channels Withdraw False Reports | Sakshi
Sakshi News home page

మా దేశానికి ట్రంప్‌.. పాక్‌ మీడియా కలరింగ్‌.. వైట్‌హౌస్‌ వార్నింగ్‌

Jul 18 2025 8:35 AM | Updated on Jul 18 2025 10:19 AM

White House Dismisses Reports On Trump Pakistan Visit

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్‌ పర్యటనకు వస్తున్నారని పాక్‌ మీడియా ది డాన్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై అమెరికాలోని వైట్‌ హౌస్‌ అధికారులు ఆగ్రహ​ం వ్యక్తం చేశారు. ట్రంప్.. పాక్‌ పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్‌ లేదని.. ఆయన పాకిస్తాన్‌కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది.

అయితే, ఇస్లామాబాద్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వస్తున్నారని పాక్‌ మీడియా కథనాలపై తాజాగా వైట్‌హౌస్‌ అధికారులు స్పందించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు. పాక్‌ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఏమీ లేదు. జూలై 18వ తేదీన ట్రంప్‌.. పాకిస్తాన్‌లో పర్యటించడం లేదు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని కొట్టిపారేసింది. ఇదే సమయంలో పాక్‌ మీడియా తప్పుడు కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది.

ఇటీవల భారత్‌, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో ట్రంప్‌.. పాక్‌ పర్యటిస్తున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది. పాక్‌ మీడియా అత్యుత్సాహంతో ట్రంప్‌.. పర్యటనకు వస్తున్నట్టు కలరింగ్‌ ఇచ్చింది. ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తొలుత పాక్‌ను సందర్శించే అవకాశం ఉందని ది డాన్ వెల్లడించింది. ఆ తరువాతే భారత పర్యటన ఉంటుందని అంచనావేసింది. సెప్టెంబర్‌లో భారత్ క్వాడ్ సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనడానికి భారత్‌కు ట్రంప్‌ వస్తారని పేర్కొంది.

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లో అమెరికా అధ్యక్షుడు పర్యటించడం చాలా అరుదు. 2006లో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్.. పాకిస్తాన్‌లో పర్యటించారు. అప్పటి నుంచి అమెరికా అధ్యక్షులు ఎవరూ పాక్‌ పర్యటనకు వెళ్లలేదు. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ విదేశీ పర్యటనలపై యుఎస్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా షెడ్యూల్‌ విడుదల చేశారు. జూలై 25-జూలై 29 వరకు ట్రంప్‌.. స్కాట్లాండ్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 17-19 మధ్య ట్రంప్‌ యూకే పర్యటన ఉందని ఆమె స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement