వాషింగ్టన్: అక్రమ వలసదారులు అగ్ర రాజ్యం అమెరికాను వీడుతున్నారు. అలాగే, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే నేరస్థులైన అక్రమ వలసదారులను టార్గెట్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనాలకు, హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు.
Just as he promised, President Trump is sending a strong message to the world: those who enter the United States illegally will face serious consequences. pic.twitter.com/yqgtF1RX6K
— The White House (@WhiteHouse) January 24, 2025
ఇక, ఈ వివరాలను శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో.. ట్రంప్ యంత్రాంగం ఇప్పటివరకూ 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. ఇక, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశాం. ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు అని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఎందుకంటే అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని స్పష్టం చేసింది. అయితే, వీసా గడువు ముగిసినా లేదా సరైన డాక్యుమెంట్స్ లేకుండా భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. సంబంధిత డాక్యుమెంట్లను తమతో పంచుకుంటే వాటిని పరిశీలించి స్వదేశానికి తీసుకువస్తామని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment