
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’.. శరీరంలోని అన్ని అవయవాల కంటే కళ్లు ప్రధానమైనవని దానర్థం. ఈ క్రమంలోనే అమరుల నుంచి కళ్లు సేకరించి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపడమే కర్తవ్యంగా దేశంలోని అన్ని ప్రభుత్వాలు సంకల్పించాయి. ఈ క్రమంలో డేనియల్ బాలాజీ కూడా తన నేత్రాలను దానం చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు. మరణం తర్వాత తన కళ్లు మరో ఇద్దరికి చూపును ఇవ్వాలని తలచాడు. అందుకు సంబంధించిన ఐ రిజిస్టర్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈమేరకు కుటుంబ సభ్యుల అంగీకార ధ్రువపత్రం కూడా పొందాడు.
ఇప్పుడు ఆయన మరణం తర్వాత డేనియల్ బాలాజీ నేత్రాలను అక్కడ ప్రభుత్వ ఆస్పత్రి వారు భద్రపరిచి మరో ఇద్దరికి చూపును ఇచ్చేందుకు తోడ్పడుతున్నారు. డేనియల్ బాలాజీ తన నేత్రాలను దానం చేయడంతో అందుకు సంబంధించిన ఆపరేషన్ పూర్తి అయిందని తన కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తన స్వగృహానికి తరలించనున్నారు. తిరువాన్మియూర్‌లోని ఆయన నివాసంలో రేపు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఎంతో మందిని బతికేలా చేస్తున్న మంచి హృదయం ఉన్న డేనియల్ బాలాజీ అని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.
👉: గుండెపోటుతో నటుడి హఠాన్మరణం.. డేనియల్ బాలాజీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
Comments
Please login to add a commentAdd a comment