కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రితో ఆయన మరణిచారు. అనంతరం డేనియల్ నేత్రాలు ఒక ట్రస్ట్‌కు దానం చేశారు. 48 ఏళ్లు పూర్తి అయినా కూడా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదని పలు ప్రశ్నలు నెట్టింట కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన సంపాధించిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలుసా అంటూ పలురకాలుగా ప్రచారం జరుగుతుంది. వీటంన్నిటిక సమాధానం ఆయన గతంలోనే పలు ఇంటర్వ్యూలలొ పంచుకున్నాడు.
కుటుంబ నేపథ్యం
డేనియల్ బాలాజీ తండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన వ్యక్తి, ఆయన అమ్మగారు మాత్రం తమిళనాడుకు చెందిని వారు. డేనియల్ తండ్రి చెన్నైలో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అక్కడ హౌల్‌సేల్ క్లాత్ షోరూమ్స్ వారికి ఉన్నాయి. డేనియల్‌కు ఐదుగురు సోదరులతో పాటు ఐదుగురు సోదరీమణులు ఉన్నారు అలా మెత్తం 11 మంది వారి కుటుంబ సభ్యులు.
పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..
తనకు 25 ఎళ్ల వయసు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోనని తన తల్లికి చెప్పారట.. అందుకు కారణం తన కుటుంబంలోని సభ్యులందరికీ పెళ్లిళ్లు అయ్యాక వారి ఇబ్బందులు చూసి వద్దనుకున్నట్లు ఆయన చెప్పాడు. పెళ్లి తర్వాత, భార్యా, పిల్లలు వంటి బాధ్యతలు తన వల్ల కాదని ఆయన చెప్పాడు. వారి కోసం డబ్బు కూడబెట్టాలి.. అందుకోసం ఒక్కోసారి తప్పులు కూడా చేయాల్సి వస్తుంది. కొందరిని మోసం చేయాల్సి వస్తుంది.. ఇలా పలు కారణాలతో పెళ్లి వద్దని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.
సొంత డబ్బుతో గుడి నిర్మాణం
చెన్నైలో కొట్టివాక్కం ప్రాంతంలో డేనియల్ ఉంటున్నారు. తన సొంత డబ్బుతో అక్కడ ఒక గుడిని ఆయన నిర్మించారు. ఆ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర జరుగుతుందని ఆయన చెప్పారు. జాతర కోసం లక్షల్లో ప్రజలు వస్తారని తెలిపారు. 'సినిమా ద్వారా నేను కొంతమేరకు సంపాధించాను.. ఇప్పటికే తమిళ్,తెలుగు ప్రజల్లో నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంతకు మించి ఇంకేమీ వద్దు అనుకున్నాను. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ గుడిని ఎవరూ అభివృద్ధి చేయలేదు. ఇక్కడ ఉన్న అమ్మవారిని నమ్మిన వారు కోట్లలో సంపాదించారు. కానీ వారెవరూ గుడి కోసం ఖర్చు పెట్టలేదు. అలాంటి సమయంలోనే ఈ గుడి కోసం ఎదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను.
ఈ గుడి మొత్తం 4వేల చదరపు గజాలు ఉంది. ఒక రూమ్ మాదిరిగా ఉన్న ఈ గుడిని ఇప్పడు భారీగా నిర్మించాను. ఈ గుడి అంటే మా అమ్మకు కూడా ఎంతో నమ్మకం ఉంది. అందుకే నేను దీనిని ఎలాగైనా నిర్మించాలని కోరుకున్నాను.' అని గతంలో ఓ ఇంటర్వయూలో ఆయన చెప్పాడు. సినిమాల్లో నటించి వచ్చిన డబ్బంతా కూడా డేనియల్ ఆ గుడి కోసమే ఖర్చు చేశాడు. ఆలయ నిర్మాణ కోసం సుమారు రూ. 3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కోలీవుడ్‌లో పలు వార్తలు కూడా గతంలో వచ్చాయి.
గుడి కోసం కేజీఎఫ్ యష్ సాయం
డేనియల్ బాలాజీ కన్నడలో కూడా పలు సినిమాల్లో మెప్పించాడు. కేజీఎఫ్ యష్‌తో డేనియల్‌కు మంది స్నేహం ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో యష్ గురించి డేనియల్ ఇలా అన్నారు. ' కేజీఎఫ్ సినిమాలో ఛాన్స్ ఉంది అందులో నటించాలని యష్ నన్ను కోరాడు. కానీ నేను ఆ సమయంలో అందుబాటులో లేను. దానికి ప్రధాన కారణం గుడి నిర్మాణ పనులే. ఆలయానికి సంబంధించి చాలా కీలకమైన పనులు ఉండటంతో నేను రాలేనని యష్‌కు చెప్పాను.
రెండు రోజుల తర్వాత యష్ నాకు కొంత డబ్బు పంపాడు.. ఎందుకు అని నేను కాల్ చేసి మాట్లాడాను. గుడి నిర్మాణం కోసం తన వంతుగా ఇస్తున్నాను అన్నాడు. గుడి నిర్మాణం తర్వాత కూడా యష్ ఇక్కడికి వచ్చాడు. అని ఆయన చెప్పారు. డేనియల్ మరణం తర్వాత ఆయన చేసిన మంచి పనుల గురించి ఒక్కోక్కటిగా ఇలా బయటకొస్తున్నాయి. డేనియల్ విలన్ కాదు.. రియల్ హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
"அங்காள பரமேஸ்வரி அம்மனுக்கு கோயில் கட்டிய நடிகர் டேனியல் பாலாஜி காலமானார்" 😥😢💔#RIPDanielBalaji #DanielBalaji #OmShanthi pic.twitter.com/YN7SVdG1SA
— Aadhi Shiva (@aadhi_shiva1718) March 29, 2024
Comments
Please login to add a commentAdd a comment