
షాంపులు, సబ్బుల ఉత్పత్తుల్లో మంచి బ్రాండు ఉన్న డవ్ వివాదంలో చిక్కుకుంది. తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసిన ఓ యాడ్ మూలాన తీవ్ర విమర్శలు పాలవుతోంది. ఒక నల్లజాతీయురాలు తన షర్ట్ తీసేస్తే తెల్ల మహిళగా రివీల్ అవుతుందంటూ ఓ బాడీ వాష్ యాడ్‌ను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసింది. ఈ ప్రకటన తీవ్ర జాత్యహంకారాన్ని చూపుతుందని సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. దీంతో మూడు సెకన్లతో కూడిన ఓ వీడియో క్లిప్‌ను డవ్ విడుదల చేసింది. ఈ క్లిప్‌లో నిజమైన అందంపై డవ్ వైవిధ్యాన్ని చూపించడం లేదని, దీనిపై తాము తీవ్రంగా చింతిస్తున్నామని, క్షమాపణ చెబుతున్నట్టు కంపెనీ చెప్పింది.
నల్ల జాతీయురాలు, తెల్ల జాతీయురాలుగా మారే విధంగా చూపించే ఈ సబ్బు ప్రకటన జాత్యహంకారాన్ని కలిగి ఉందని సోషల్ మీడియా యూజర్లంటున్నారు. అంటే నల్ల రంగు శరీరం చెత్త అని, తెల్ల రంగు శరీరం శుభ్రమైనదని ఈ యాడ్ ప్రతిపాదిస్తుందని విమర్శిస్తున్నారు. శుభ్రమైన శరీరమంటే, తెల్ల రంగు శరీరం కాదని, అలా అని నల్ల రంగు శరీరాలన్నీ చెత్త కాదని అట్లాంటకు చెందిన ఓ ప్రొఫెసర్ ట్వీట్ చేశారు. డవ్ ఉత్పత్తులను చాలా కాలంగా వాడుతున్నానని, కానీ ప్రస్తుతం వీటిని విడిచిపెడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదే తొలిసారి కాదని, డవ్ చాలాసార్లు ఇలాంటి జాత్యంహకారం ప్రకటనలను ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment